Latest Videos

బుజ్జిని స్వయంగా డ్రైవ్ చేస్తూ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. గ్లింప్స్ మైండ్ బ్లోయింగ్ 

By tirumala ANFirst Published May 22, 2024, 9:50 PM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మాణంలో దాదాపు 600 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబందించిన ప్రతి అంశం అంచనాలని పెంచేస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మాణంలో దాదాపు 600 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబందించిన ప్రతి అంశం అంచనాలని పెంచేస్తోంది. దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి హేమా హేమీలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో ప్రభాస్ ఉపయోగించే కారు బుజ్జి అని తెగ సందడి చేస్తున్నారు. ఆ కారు గురించి అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. బుజ్జిని తయారు చేయడానికి నాగ్ అశ్విన్ అండ్ టీం చివరికి ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజాలని కూడా కలిశారట. బుజ్జిని తయారు చేయడానికి టీం ఎంత కష్టపడ్డారో ఇటీవల మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. అప్పటి నుంచి బుజ్జిని చూడాలని.. ప్రభాస్ దానిని ఎలా డ్రైవ్ చేస్తాడో చూడాలి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

నేడు బుధవారం రోజు రామోజీ ఫిలిం సిటీలో దాదాపు నాలుగు కోట్ల ఖర్చుతో బుజ్జిని పరిచయం చేసే ఈవెంట్ నిర్వహించారు. అంతే కాదు బుజ్జి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభాస్ బుజ్జిని డ్రైవ్ చేసుకుంటూ ఈవెంట్ కి ఎంట్రీ ఇచ్చాడు. బుజ్జితో గ్రౌండ్ మొత్తం రౌండ్లు కొట్టాడు. స్వయంగా ఒక సూపర్ హీరోలా ప్రభాస్ బుజ్జిని డ్రైవ్ చేస్తూ కనిపించాడు. 

బుజ్జి కారులోనుంచి ప్రభాస్ దిగుతునప్పుడు ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. అనంతరం ప్రభాస్ ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. బుజ్జి గురించి వివరించారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మూడేళ్ళ పాటు బుజ్జితో నరకం చూపించాడని సరదాగా కామెంట్స్ చేశాడు. 

అనంతరం బుజ్జి గ్లింప్స్ ని ఈవెంట్ ప్రదర్శించారు. ప్రభాస్ బుజ్జితో కలసి చేస్తున్న విధ్వంసం మామూలుగా లేదు. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ ఘట్టాలు ఉన్నాయి. బుజ్జి ప్రభాస్ కి పరిస్థితులు అనుకూలంగా లేవు వెనక్కి వెళ్ళిపోదాం పద అని హెచ్చరిస్తుంది. ఇంక తిరిగి వెళ్ళేదే లేదు అంటూ ప్రభాస్ చెప్పడం ఆకట్టుకుంటోంది. బుజ్జి గ్లింప్స్ ని మీరూ చూసేయండి. 

click me!