కసి చూపులతో కాల్చేస్తున్న రాశీ ఖన్నా.. ట్రెడిషనల్ లుక్ లోనూ పిచ్చెక్కిస్తోందిగా.!

First Published Oct 17, 2022, 11:24 AM IST

యంగ్ బ్యూటీ రాశీఖన్నా (Raashi Khanna) అందాల ధాటికి కుర్ర హృదయాలు చెదిరిపోతున్నాయి. వరుస ఫొటోషూట్లతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చింది.
 

టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా వరుస ఫొటోషూట్లతో ఇటీవల నెట్టింట తెగ సందడి చేస్తుంది. ఊహించని విధంగా తన అభిమానులకు, నెటిజన్లు గ్లామర్ విందు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో పరువాలను ప్రదర్శిస్తూ మతిపోగొడుతోంది.
 

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. నటన పరంగా, గ్లామర్ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది. ప్రస్తుతం తను నటించిన చిత్రాలు ఒక్కోటిగా రిలీజ్ అవుతున్నాయి. 

ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా డార్క్ కలర్ చుడీదార్ లో మెరిసింది. అప్పటికే ఫెయిర్ స్కిన్ టోన్ కలిగిన ఈ బ్యూటీ డార్క్ డ్రెస్ లో మరింత గ్లామరస్ గా కనువిందు చేసింది.
 

గ్లామర్ షోతో పాటు రాశీ ఖన్నా హాట్ నెస్ లోనూ హద్దులు చెరిపిస్తోంది. ఎలాంటి అవుట్ ఫిట్ ధరిస్తున్న హాట్ స్టిల్స్ తో పిచ్చెక్కిస్తోంది. తాజా ఫొటోల్లో కసి చూపులు, మతిపోయే పోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. 
 

తెలుగు, తమిళంలో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది రాశీ ఖన్నా. తెలుగులో పెద్దగా కలిసి రాకపోయినా.. తమిళ చిత్రాలతో క్రేజ్ సంపాదించుకుంటోంది. ఇటీవల ‘తిరుచిత్రంబలం’తో ఆకట్టుకోగా.. ప్రస్తుతం ‘సర్దార్’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

తమిళ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం Sardar, ఇందులో హీరోయిన్ గా రాశీఖన్నా నటించింది. ఇప్పటికే మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీంతో రాశీకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఈ క్రమంలో రాశీ ఖన్నా కూడా తనదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. ఇక బాలీవుడ్ లోనూ రాశీ ఖన్నా ‘యోదా’ అనే చిత్రంలో నటిస్తోంది.
 

click me!