Samantha Hot looks: థైస్‌ చూపిస్తూ సమంత క్లీవేజ్‌ షో.. రెడ్‌ డ్రెస్‌లో నెవర్‌ బిఫోర్‌ లుక్‌.. మైండ్‌ బ్లాక్‌

First Published Nov 22, 2021, 6:08 PM IST

సమంత.. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత అనేక సంకేతాలనిస్తుంది. గ్లామర్ షో విషయంలో తాను సిద్ధమే అని సిగ్నల్స్ ఇస్తుంది. సెక్సీ ఫోటోలతో మేకర్స్ ఆకర్షించించబోతుంది. అదే సమయంలో తాను మరింతగా ఓపెన్‌ అవుతుంది. 

సమంత(Samantha) ఇప్పుడు ఘాటు కొడుతుంది. గుంటూరు మిర్చిని మించిన ఘాటు రేపుతుంది. లేటెస్ట్ ఫోటో షూట్‌లో సమంత నెవర్‌ బిఫోర్‌ అనేలా హోయలు పోయింది. రెడ్‌ అండ్‌ రావిషింగ్‌ లుక్‌లో మతులు గతులు తప్పేలా చేస్తుంది. Samantha క్లీవేజ్‌ అందాలతో కేకపెట్టిస్తుంది. అంతేకాదు థైస్‌ షోతో మరింత కాకరేపుతుంది. సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. తన గ్లామర్‌ పిక్స్ తో అగ్గిరాజేస్తుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. గత ఫస్ట్ వేవ్‌ కరోనా సమయం నుంచి సమంత తన గ్లామర్‌ షోకి బార్డర్స్ లేవా? అనేట్టుగా ఫోటో షూట్లకి పోజులిస్తూ ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని సందర్భాల్లో అయితే సమంతనేనా ఇలా చేసిందని అభిమానులు, సాధారణ ఆడియెన్స్ సైతం ముక్కున వేలేసుకున్నారు. కానీ తాను మాత్రం తగ్గేదెలే అని నిరూపించుకుంది. 

సమంత మరోసారి ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతుంది. అందుకు కారణంగా ఆమె తాజాగా పంచుకున్న గ్లామర్ ఫోటోలే. అంతగా జనాలను కట్టిపడేస్తున్నాయి. సమంత తాజాగా `ఇఫీ`లో సందడి చేసింది. గోవాలో జరుగుతున్న 52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం(ఇంటర్నేషన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా-ఇఫీ)2021లో గెస్ట్ గా పాల్గొంది. ఈ ఈవెంట్లో పాల్గొని మాట్లాడే అవకాశం పొందిన తొలి దక్షిణాది నటిగా సమంత నిలిచారు.

అందులో భాగంగా ఇలా రెడ్‌ డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలతో మతిపోగొట్టింది. ఈవెంట్‌కే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇందులో ఆమె తాను నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌ టీమ్‌తో కలిసి సందడి చేశారు. దర్శకులు రాజ్‌  అండ్‌ డీకేలతో కలిసి సందడి చేయడం విశేషం. వీరితోపాటు అమెజాన్‌ ఇండియా ఒరిజినల్స్  హెడ్‌ అపర్ణా పురోహిత్‌లతో కలిసి `మాస్టర్‌ క్లాస్‌` చర్చ గోష్టిలో పాల్గొంది సమంత. ఇందులో ఆమె మాట్లాడారు. 

`తెలుగు పరిశ్రమ, హైదరాబాద్‌ నా పుట్టినిల్లు. నటిగా నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది అవే. నేనింకా హిందీ సినిమాలేవీ చేయలేదు కానీ, ఉత్తరాది పరిశ్రమకూ, దక్షిణాదికీ పెద్ద తేడా ఏమీ లేదు. ఏ నటి, నటుడైనా ఎప్పుడూ ఒకే రక మైన పాత్రలు చేయాలనీ, అవే రకమైన భావోద్వేగాలను చూపించాలనీ అనుకోరు. సవాలు నిండిన కొత్త పాత్రలు, కథా నేపథ్య వాతావరణం కోసం చూస్తారు` అని చెప్పింది సమంత. 

`ది ఫ్యామిలీ మ్యాన్‌2` సిరీస్‌లో రాజీ పాత్రని పోషించడంపై స్పందిస్తూ, `ఆ సిరీస్‌ రూపకర్తలు రాజ్, డీకే నన్ను వ్యక్తిగతంగా కలవకుండానే, అందులోని యాక్షన్‌ పాత్రకు నన్ను ఎంచుకున్నారు. తీరా నన్ను కలిశాక, (నవ్వుతూ...) వారికి తమ తప్పు దిద్దుకొనే టైమ్‌ దాటిపోయింది. కొత్తదనం కోసం తపిస్తున్న నేనూ ఆ పాత్రను ఠక్కున పట్టేసుకున్నా` అని చెప్పింది సామ్‌. `సినిమా, ఓటీటీ దేనికదే. చీకటి హాలులో అంతరాయాలకు దూరంగా చూసే సినిమాతో పోలిస్తే, ఇంట్లో టీవీలో అనేక అంతరాయాల మధ్య చూసే ఓటీటీ వెబ్‌ సిరీసుల్లో ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టి, మెప్పించడం చాలా కష్టం. రొటీన్‌కు భిన్నమైన భావోద్వేగాలనూ, పాత్రలనూ పండించేందుకు నటీనటులకు కూడా ఓటీటీ ఓ అవకాశం, పెద్ద సవాల్‌` అని చెప్పింది సమంత.  

`ఫ్యామిలీమ్యాన్‌ 2`లోని పాత్రతో ఇక హిందీ `ధూమ్‌` సిరీస్‌ లాంటి వాటిలో అవకాశాలు రావచ్చన్న ప్రేక్షకుల ప్రశంసకు సమంత ఉబ్బితబ్బిబ్బవుతూ, `నేనిక యాక్షన్‌ స్టార్ అన్న మాట` అని నవ్వేశారు. దీనిపై దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే చెబుతూ, `రాజీ పాత్రకు తమిళం తెలిసిన నటి కావాలనుకున్నాం. తమిళ చిత్రం `సూపర్‌డీలక్స్`, తెలుగు `రంగస్థలం` చూసి, ఆ పాత్రకు సమంత సరిపోతారనుకొని, సంప్రదించాం. మా అంచనాలను మించి ఆమె చేశారు. పాత్రను పూర్తిగా మనసుకు ఎక్కించుకొని, ఆ భావోద్వేగాల్లోనే జీవిస్తూ, కొన్ని సీన్లు కాగానే ఆమె వెక్కివెక్కి ఏడ్చార`ని తెలిపారు. చేతులకు గాయమై రక్తం కారుతున్నా డూప్‌లు లేకుండా సమంత చేసిన ఫైట్లు చూసి ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. 

సమంత ఇప్పుడు రెట్టింపు జోష్‌తో రాబోతుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో `శాకుంతలం`, తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటించింది. మరోవైపు ఇటీవల రెండు బైలింగ్వల్ చిత్రాలకు కమిట్‌ అయ్యింది సమంత. అంతేకాదు హిందీలోనూ ఓ సినిమా చేయబోతుందని సమాచారం. సమంత గత నెలలో తన భర్త నాగచైతన్యకి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు పరస్పరం విడిపోతున్నట్టు అక్టోబర్ 2న సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. నాలుగేండ్ల అన్యోన్య బంధానికి ముగింపు పలికి అభిమానులకు షాక్‌ ఇచ్చారు. ఆ బాధాకర ఘటన నుంచి సమంత ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. 

also read: అబ్బురపరిచే సెట్ లో సమంత అందాల విందు.. ఐటమ్ సాంగ్ లో నెవర్ బిఫోర్ అనిపించేలా

click me!