2015లో `క్వాంటికో` సిరీస్‌తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ప్రియాంక చోప్రా. దీంతో గ్లోబల్ హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. అప్పట్నుంచి వరుసగా అక్కడ ఆఫర్లు దక్కించుకుంది. `బేవాచ్`లో నటించి మెప్పించింది. దీంతోపాటు `ఏ కిడ్ లైక్ జేక్`, `ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్`, `షేసింగ్ హ్యాపీనెస్`, `హ్యాపీనెస్` కింటిన్యూ`, `వి కెన్ బి హీరోస్`, రెండేళ్ల క్రితం `ది మ్యాట్రిక్స్ రెసురెక్షన్స్` చిత్రాల్లో నటించింది. జయాపజయాలకు అతీతంగా హాలీవుడ్ ఆఫర్లని దక్కించుకుంటూ దూసుకుపోతుంది ప్రియాంక. ప్రస్తుతం ఆమె `లవ్ ఎగైన్` అనే హాలీవుడ్ మూవీలో నటిస్తుంది.