ఆ వీడియో అర్థాన్నే మార్చేశారు.. సోషల్‌ మీడియాపై ప్రియా ప్రకాష్‌ వారియర్‌ అసహనం.. అందాల ఆరబోతకు సై

First Published Jul 27, 2021, 1:56 PM IST

కన్నుగీటుతో సెన్సేషనల్‌ అయిన వింకీ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ సోషల్‌ మీడియాపై మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించింది. గతేడాది ఓ సారి తన బాడీపై విమర్శలకు చెక్‌ పెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు దానిపై స్పందించింది. 

ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఇటీవల తన ఫ్రెండ్‌ ఒక ఫన్నీ వీడియో చేస్తే అది తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకుంది. అందులోని చిన్న క్లిప్‌ని పంచుకుందట. దాన్ని నెటిజన్లు యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియా అకౌంట్లలో పంచుకుంటూ మరో రకంగా టైటిల్స్ పెట్టి అర్థాన్నే మార్చేశారని వాపోయింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌.
undefined
రాంగ్‌ టైటిల్స్ తో చెప్పాల్సిన కంటెంట్‌ తప్పుదోవ పట్టినట్టయ్యిందని చెబుతూ నెటిజన్లపై ఫైర్‌ అయ్యింది ప్రియా. అంతేకాదు ఆ మిస్‌ లీడ్‌ని సరి చేసేందుకు మొత్తం వీడియో క్లిప్‌ని పంచుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది.
undefined
ఇది ఇటీవల కాలంలో పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడే కాదు గతేడాది కూడా ప్రియా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలను ట్రోల్స్ చేశారు నెటిజన్లు. తరచూ ఈ అమ్మడికి ఇలాంటి అనుభవాలు ఎదురుకావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది.
undefined
కన్నుగీటుతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ తనకు వచ్చిన క్రేజ్‌ని సినిమాల రూపంలో ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుంది.
undefined
గతేడాది నితిన్‌తో `చెక్‌` చిత్రంలో నటించింది. ఇప్పుడు తేజా సజ్ఞాతో `ఇష్క్` సినిమాలో నటిస్తుంది. ఇది ఈ ఏడాది మార్చిలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌తో వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 30న థియేటర్లు ఓపెన్‌ అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమాగా నిలవబోతుంది.
undefined
ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఆసక్తికర విషయాలను పంచుకుంది. రొమాంటిక్‌ థ్రిల్లర్‌ అని తెలిపింది. తేజ సజ్జాని `ఓ బేబీ` టైమ్‌లో చూశానని, అప్పుడు పేరు తెలియదని వెల్లడించింది.
undefined
`చెక్‌` చిత్రంలో తనది చిన్న రోల్‌ అని, ఇందులో పూర్తి స్థాయి హీరోయిన్‌గా కనిపిస్తానని తెలిపింది. ఓ రకంగా తనకిది పూర్తి స్థాయి డెబ్యూ చిత్రమని చెప్పింది.
undefined
అంతేకాదు తాను గ్లామర్‌ పాత్రలు చేసేందుకు సిద్ధమే అని, హీరోయిన్‌ కి ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాదు, కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు, కమర్షియల్‌ చిత్రాలు కూడా చేస్తానని తెలిపింది.
undefined
ప్రస్తుతం తెలుగులో సందీప్‌ కిషన్‌తో ఓ సినిమా, హిందీలో రెండు సినిమాలు, కన్నడలో ఓ సినిమా చేస్తున్నట్టు చెప్పింది.
undefined
click me!