Intinti Gruhalakshmi: ప్రేమ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. సామ్రాట్ వచ్చి కాపాడుతాడా?

First Published Oct 1, 2022, 11:38 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రేమ్ ఆడిషన్ కి సెలెక్ట్ అయ్యాను అని లోపలికి వెళ్ళగా ఇంతలో తోటి అభ్యర్థి రాకేష్ అన్నవాడు ప్రేమ్ ని అడ్డుకుంటాడు. నాకు టాలెంట్ ఉన్నది కానీ నువ్వు రికమండేషన్ తో వచ్చి సెలెక్ట్ అయ్యావు అని రాకేష్ అనగా, నేను రికమండేషన్ తోనే వచ్చాను కానీ ఎంపికయింది మాత్రం నా సొంత టాలెంట్ తో అని అంటాడు ప్రేమ్. అప్పుడు రాకేష్, మీరు ఎలాగా వచ్చారో నాకు తెలుసు అండి, మీ అమ్మ సామ్రాట్ ని పట్టింది తన వలలో వేసుకుంది, సామ్రాట్ రైట్ హ్యాండ్ గా అయ్యింది. ఇప్పుడు నువ్వు దాన్ని వాడుకుంటున్నావు అని అంటాడు. దానికి ప్రేమ్ కి చాలా కోపం వచ్చి తన షర్టు పట్టుకొని కొడుతూ ఉంటాడు. ఇంతలో ఎవరో పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఇక్కడ గొడవ అవుతుంది అని చెప్తారు. ఆ తర్వాత సీన్లో సామ్రాట్ అందరితో మీటింగ్లో ఉండగా తను మాత్రం తులసి గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు.

అప్పుడు తులసి సామ్రాట్ ని చూసి సామ్రాట్ కి మెసేజ్ పెట్టి, మీకు ఒంట్లో బానే ఉందా అని అడుగుతుంది.బానే ఉన్నాను అని సామ్రాట్ మెసేజ్ పెడతాడు. మరి మీటింగ్ గురించి వినండి అని తులసి అనగా, సామ్రాట్ వింటాడు. ఆ తర్వాత సీన్లో ప్రేమ్,రాకేష్ ఇద్దరు కలిసి జైల్లో ఉంటారు.అప్పుడు పోలీసులు, రౌడీల్ల తయారవుతున్నారు మీరు అని వాళ్ళని అనగా రాకేష్,మీకు తెలియదు సార్ ఈయన, సామ్రాట్ ని వలలో వేసింది కదా తులసి, ఆవిడ కొడుకు. న్యూస్ లో వీళ్ళిద్దరూ మధ్య ఏదో ఉంది అని చెప్పుకున్నారు కదా సర్ మొన్న పేపర్లో అడిగినా సరే సామ్రాట్ గారేమి మాట్లాడలేనట్టున్నారు అని అనగా,ప్రేమ్ కి కోపం వస్తుంది. వెళ్లి రాకేష్ ని కొడతాడు అప్పుడు పోలీసులు, పోలీస్ స్టేషన్లో కూడా కొట్టుకుంటున్నారు అని వాళ్ళని తిడతారు.అప్పుడు పోలీస్ ప్రేమ్ దగ్గరికి వెళ్లి ఎవరో ఒకరుకి ఫోన్ చెయ్, ఒక్కరికి మాత్రమే ఫోన్ చెయ్యు పోలీస్ స్టేషన్కు వస్తారు అని అంటారు.

అప్పుడు ప్రేమ్, అమ్మకి ఫోన్ చేస్తే కంగారు పడుతుంది, సామ్రాట్ గారికి చేద్దాము అని అనుకుంటాడు. అదే సమయంలో సామ్రాట్,మీటింగ్ లో ఉన్నా సరే మనసు మాత్రం అనసూయ మాటలు మీదే ఉంది. ఇంతలో నో! అని గట్టిగా అరుస్తాడు సామ్రాట్.ఏమైంది అని అందరూ అడగంగా ఏమీ లేదు  సారీ అని సామ్రాట్ చెప్తాడు. అప్పుడు తులసి సామ్రాట్ తో, మీ మనసు ఎక్కడో ఉన్నట్టున్నది అని మెసేజ్ పెడుతుంది. అప్పుడు సామ్రాట్,నా మనసు మీ దగ్గరే ఉన్నదంటే మీరు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు తులసి గారు అని మనసులో అనుకుంటాడు సామ్రాట్.ఇంతలో ప్రేమ్ సామ్రాట్ కి ఫోన్ చేసి, సామ్రాట్ గారు నాకు మీరు ఒక సహాయం చేయాలి నేను జైల్లో ఉన్నాను అటెంప్ట్ మటర్ మీద కేసు వేస్తా అన్నారు ఈ విషయం అమ్మకు చెప్పొద్దు నన్ను వచ్చి విడిపిస్తారా అని అనగా సామ్రాట్ అక్కడ బయలుదేరుతాడు. ఏమైంది అని తులసి అనగా, కొన్ని పర్సనల్ మేటర్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడికి వెళ్తాడు.

ఇంతలో పోలీస్,సామ్రాట్ని చూసి సామ్రాట్ గారు రండి అని అనగా ప్రేమ్ ని విడిచిపెట్టండి అని సామ్రాట్ అంటాడు. ఇలాంటి రౌడీలను విడిచి పెట్టడం మంచిది కాదు అని పోలీస్ అనగా, మీరు రోజు రౌడీలను చూసి మంచోళ్ళు కూడా రౌడీలాగ కనిపిస్తున్నారు అని అంటాడు సామ్రాట్.అప్పుడు రాకేష్,చూశారా! తులసి గారి కొడుకు కదా అందుకే సపోర్ట్ చేస్తూ ఉంటారు అని అంటాడు. అప్పుడు పోలీసు, మీకు ఇతనికి ఏం సంబంధం అని అనగా, అలా అడగండి సార్!వాళ్ళిద్దరికీ ఏం సంబంధం కొడుకులాంటి వారేమో ఎవరికి తెలుసు మొన్న మీటింగ్లో కూడా మౌనంగా ఉండిపోయారు కదా అని రాకేష్ అంటాడు. దానికి ప్రేమ్ కి కోపం వచ్చి, తన కాలర్ పట్టుకుని మళ్ళీ కొడుతాడు. పోలీస్ స్టేషన్లోనే కొట్టుకుంటున్నారు అని పోలీసు చిరాకు పడగా సామ్రాట్ ప్రేమ్ ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రేమ్ ఆపకపోయేసరికి సామ్రాట్ ప్రేమ్ ని కొట్టి అక్కడి నుంచి బయటకు తీసుకొని వస్తాడు.

 మా అమ్మని అన్ని మాటలు అంటే నేను ఊరుకోలేను సామ్రాట్ గారు అని అనగా, అలాగని పోలీస్ స్టేషన్లోనే గొడవ చేస్తే పోలీసులు ఊరుకుంటారా?ఇప్పుడు వీడని కొత్తవి, తర్వాత ఇంకొకడు అంటాడు అందరినీ అలా కొట్టుకుంటూనే వెళ్తావా! ఇప్పుడు ఆ ఎస్ఐ నా మాట విన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే జైల్లోనే ఉండేవాడివి. దానివల్ల నీకు నువ్వుగా మీ అమ్మ బతుకుని బజార్లో పెట్టినట్టు అయ్యేది. ఇప్పుడు ఆ రాకేష్ గదికి  తగలకూడని చోటు ఎక్కడైనా దెబ్బలు తగిలితే మీరు కోర్టు మెట్లు ఎక్కేవారు. ఈ చెత్తంతా కోర్టులో అందరి ముందు రాకేష్ గాడు చెప్తే అప్పుడు మీ అమ్మ పరువు ఏమయ్యది?
 

 ఇప్పటికే మా మధ్య వస్తున్న చెత్త చాలు ఇంక పెంచవద్దు అని అంటాడు సామ్రాట్. అప్పుడు ప్రేమ్, సారీ సర్ మా అమ్మను ఎవరైనా అంటే నేను ఊరుకోలేను. మీరు ఎలాగైనా ఈ చెత్తనంతా క్లియర్ చేయండి సార్ మా అమ్మని ఇలా చూస్తూ నేను ఉండలేను అని ఏడుస్తూ అంటాడు ప్రేమ్. అప్పుడు సామ్రాట్ కార్ లో తిరిగి ఆఫీస్ కి వెళ్తూ దీని గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంతలో తులసి, సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు సామ్రాట్ కి ఫోన్ చేయగా, సామ్రాట్ ఫోన్ కట్ చేసేస్తాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్, ముగ్గురు కలిసి భోజనం చేద్దాం అని చెప్పాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అనగా తులసి మళ్ళీ ఫోన్ చేస్తుంది.
 

 అప్పుడు సామ్రాట్ ఎత్తి,ఫోన్లో పేరు ఉన్నది కనిపిస్తుంది కదా ఫోన్ ఎత్తట్లేదు అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో తెలియాల్సిన అవసరం లేదా! నేను కంపెనీ సీఈఓ ని నాకు పనులు ఉంటాయి ఫోన్ పెట్టేయండి అని చెప్పి సామ్రాట్ కావాలని ఫోన్ పెట్టేస్తాడు. తులసి బాధపడుతుంది. నేను వెళ్లి అడుగుతాను అని సామ్రాట్ వాల్ల బాబాయ్ అనగా, వద్దు బాబాయ్ మళ్ళీ నేను చాడీలు చెప్పాను అని నన్ను తిడతారు అని తులసి అంటుంది. అప్పుడు సామ్రాట్,సారీ తులసి గారు మన మంచి కోసమేది చేస్తున్నాను అని అనుకుంటాడు.
 

ఆ తర్వాత సీన్లో తులసి ఇంట్లో కూర్చొని గోరింటాకు ఆకులు తీస్తున్నప్పుడు అనసూయ తులసిని చూసి, సామ్రాట్ తులసికి విషయం చెప్పి ఉంటాడా? ఒకవేళ చెప్పి ఉంటే ఈపాటికి తులసి గోల చేసేది చెప్పలేదంటే సామ్రాట్ నా మాటకు విలువ ఇవ్వలేనట్టే కదా అని అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!