తల్లైన ప్రభాస్‌ హీరోయిన్‌ రిచా గంగోపాధ్యాయ.. లేట్‌గా బిడ్డని పరిచయం..(ఫోటోలు)

First Published Jun 5, 2021, 3:18 PM IST

ప్రభాస్‌ హీరోయిన్‌ రిచా గంగోపాధ్యాయ తల్లి అయ్యింది. ఆమె ఇటీవల పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆలస్యంగా ప్రకటించింది. తాజాగా కుమారుడిని పరిచయం చేస్తూ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలిప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

ప్రభాస్‌ సరసన `మిర్చి` చిత్రంలో నటించింది రిచా గంగోపాధ్యాయ. దీంతోపాటు వెంకటేష్‌, రవితేజ, రానా, నాగార్జునలతోనూ కలిసి నటించింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అందాల భామ చాలా రోజుల తర్వాత అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెబుతూ వెలుగులోకి వచ్చింది.
undefined
మాజీ హీరోయిన్‌ రిచా గంగోపాధ్యాయ మే నెల 27న పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని శనివారం ప్రకటించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫోటోలను పంచుకుంది.
undefined
తన బాబుకి పేరుని కూడా పెట్టారట. ఆ విషయాలను తెలిపింది. `లుకా షాన్‌` అనే పేరు పెట్టినట్టు తెలింది రిచా. ముద్దుల తనయుడి ఫోటోలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె చెబుతూ, సంతోషాన్ని వెల్లడించింది.
undefined
`మా చిరు సంతోషం, లుకా షాన్‌. మే 27న జన్మించాడు. చిన్నారి రాకతో మేమంతా ఆనందంలో మునిగి తేలుతున్నాం. లుకా ఆరోగ్యంగా, ఆనందంగా, అచ్చం తన తండ్రి పోలికలతో ఉన్నాడు. లుకా నువ్వు మా జీవితాల్లో చెప్పలేనంతా ఆనందాన్ని నింపావు` అని పేర్కొంది రిచా.
undefined
రిచా తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను రహస్యంగా పెళ్లి మ్యారేజ్‌ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించి అభిమానులకు, సినీ వర్గాలకు షాక్‌ ఇచ్చింది రిచా. తన ప్రెగ్నెన్సీని కూడా రహస్యంగానే ఉంచింది రిచా. కొద్ది రోజుల కిందట బేబీ బంప్ ఫొటోలను షేర్‌ చేసి అసలు విషయం బయటపెట్టారు.
undefined
ఫిబ్ర‌వరిలో తాను త‌ల్లి కాబోతున్న‌ట్టు తెలియ‌జేసిన రిచా, గత నెల 27న పండంటి మ‌గ బిడ్డ పుట్టాడంటూ ఈ సారి కూడా కాస్త ఆల‌స్యంగా తెలియ‌జేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం రిచా పంచుకున్న చిన్నారి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
రానా నటించిన `లీడర్‌` చిత్రంతో తెలుగు తెరకి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది రిచా గంగోపాధ్యాయ. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ అమ్మడు వెంకటేష్‌ నటించిన `నాగవల్లి` చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత రవితేజతో `మిరపకాయ్‌`, `సారొచ్చారు` చిత్రాల్లో నటించింది. ప్రభాస్‌తో నటించిన `మిర్చి`తో బంపర్‌ హిట్‌ని అందుకుంది.
undefined
చివరగా ఆమె నాగార్జునతో `భాయ్‌` సినిమా చేస్తుంది. తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అక్కడ బిజినెస్‌ స్కూల్‌లో జోను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్ అని సమాచారం.
undefined
కుమారుడితో రిచా భర్త జోయి లంగేల్లా.
undefined
భర్తతో రిచా.
undefined
భర్తతో రిచా.
undefined
ప్రెగ్నెంట్‌గా రిచా.
undefined
click me!