బ్యాచిలర్స్ లిస్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యావు. ప్రభాస్ అన్నకి కూడా చెప్పు శర్వా అన్నా త్వరగా పెళ్లి చేసుకోమని అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. శర్వానంద్, రక్షితరెడ్డి నిశ్చితార్థానికి టాలీవుడ్ క్రేజీ కపుల్ రాంచరణ్, ఉపాసన దంపతులు అతిథులుగా హాజరయ్యారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రాంచరణ్, శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్స్.. చిన్ననాటి నుంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే.