మైఖేల్ జాక్సన్ బయోపిక్ కు రంగం సిద్థం, పాప్ సింగర్ గా నటించబోయేది ఎవరంటే..?

First Published Jan 31, 2023, 8:38 PM IST

ప్రపంచాన్ని తన పాప్ మ్యూజిక్ తో.. అద్భుతమైన స్టెప్పులతో ఉర్రూతలూగించిన సంగీత శిఖరం  మైఖేల్ జాక్సన్. ఆయన మరణించి చాలా కాలం అవుతుండగా.. త్వరలో ఆయన బయోపిక్ కు  రంగం సిద్థం అవుతోంది. 

కొన్నేళ్ల పాటు ప్రపంచ సంగీతాన్ని శాసించిన సంగీత చక్రవర్తి.. కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్.  ప్రపంచాన్ని తన పాటలు,  రకరకాల స్టెప్పులతో ఉర్రూతలూగించిన  రారాజు మైఖేల్. ఇక  మైఖేల్ జాక్సన్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి దాదాపుగా 14 ఏళ్లు కావొస్తోంది. పాప్ వరల్డ్‌ను తన మ్యూజిక్ టాలెంట్‌తో కిక్కెంచిన జాక్సన్ మరణం సంగీత అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా..  ఎంతో మంది సింగర్లు, డాన్సర్లు.. పాప్ స్టార్లు అంతకు మించి చేయగలిగిన వారు వచ్చినా.. మైఖేల్ జాక్సన్ ను మాత్రం మరిపించలేకపోతున్నారు. ఆయన  లేని లోటును మాత్రం పూడ్చలేకపోతున్నారు. మల్టీటాలెంట్ చూపించిన మైఖైల్.. 
 

Image Credit: Getty Images

సింగర్ గా, డాన్సర్ గానే కాకుండా రైటర్ గా.. కంపోజర్ గా..మేకర్ గా ఎంతో టాలెంట్ చూపించారు. అంతే కాదు ప్రపంచ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు మైఖేల్.  లెబెలె డిస్ప్యూట్, డేంజరస్, బ్యాడ్, థ్రిల్లర్, మోటౌన్ వంటి ఎన్నో ఆల్బమ్స్‌తో ఆడియెన్స్ మనసుల్లో ‘కింగ్ ఆఫ్ పాప్‌’గా సుస్థిర స్థానం దక్కించుకున్నారు జాక్సన్. ఇంతటి పేరు, డబ్బు, క్రేజ్ తెచ్చుకున్న ఆయన

Michael jackson

ఇక మైఖేల్ జాక్సన్ చేసిన ఆల్బమ్స్.. వీడియో సాంగ్స్ ఎన్నో రికార్డ్స్ ను క్రియేట్ చేశాయి. యూట్యూబ్ తో పాటు.. సోషల్ మీడియాను శేక్ చేసి పడేశాయి. అంతే కాదు నేటి తరం వారిపై కూడా ఈ ప్రభావం గట్టిగానే కనిపించింది. 50 ఏళ్ల వయసులో 2009, జూన్ 25వ తేదీన గుండెపోటుతో మరణించారు. 

ఇకపోతే, జాక్సన్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. జాక్సన్ బయోపిక్‌ను తీయనున్నట్లు లయన్స్ గేట్ సంస్థ ప్రకటించింది. మైఖేల్ జాక్సన్ బయోపిక్‌ను ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గ్రాహమ్ కింగ్ నిర్మించనున్నారు. ఇందులో జాక్సన్ పాత్రలో జాఫర్ జాక్సన్ నటించనున్నారు.

Michael Jackson

మైఖేల్ జాక్సన్ పాత్రలో నటించే యాక్టర్ కోసం ప్రపంచమంతా వెతికానని.. కానీ చివరికి ఆయన సోదరుడి కొడుకు జాఫర్ జాక్సనే కరెక్ట్ అనిపించిందని డైరెక్టర్ ఆంటోనీ చెప్పారు.

Michael Jackson

అంతే కాదు మైఖేల్ జాక్సన్ స్టెప్‌ను జాఫర్ వేస్తున్న ఓ ఫొటోను ఆంటోనీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు. దీనికి నెటిజన్స్ నుంచి మంచి అప్లాజ్ వస్తోంది. మితిమీరిన ట్యాబ్లెట్లు, మెడిసిన్స్ తీసుకోవడం వల్లే మైఖేల్ చనిపోయారు అనేని అందరికి తెలిసిన నిజం. మరి ఈ సినిమాలో ఈ విషయాన్ని ఎలా చూపిస్తారో చూడాలి. 
 

click me!