తొడలు కనిపించేలా పొట్టి డ్రెస్‌లో కవ్విస్తూ.. ఎయిర్‌పోర్ట్ లో పూజా హెగ్గే రచ్చ.. చెన్నైకి చక్కర్లు

First Published | Sep 30, 2021, 9:46 AM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే అందాలకు కోట్లల్లో అభిమానులున్నారు. `అల వైకుంఠపురములో` చిత్రంతో ఆమె కాళ్లకి కూడా సపరేట్‌గా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. `నీ కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు` అంటూ బన్నీ పాడటమే అందుకు కారణం. 

డస్కీ బ్యూటీ పూజా హెగ్డే ఇప్పుడు ఏం చేసినా సంచలనమే. ఆమె బయట ఫోటోలకు చిక్కినా, ఎయిర్ పోర్ట్ లో మెరిసినా, వర్కౌట్‌ సెషన్‌లో కనిపించినా అవి వైరల్ అవ్వాల్సిందే. పూజా ఒక్క పిక్‌ షేర్‌ చేసినా అది ట్రెండింగ్‌ న్యూస్‌ అవుతుంది. 

తాజాగా పూజా ఎయిర్‌పోర్ట్ లో మెరిసింది. ఆమె షూటింగ్‌ నిమిత్తం చెన్నై వెళ్తుంది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ లో దిగిన ఓ పిక్‌ని పంచుకుంది పూజా. ప్రస్తుతం ఇది సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతుంది. 


పూజా ఇందులో సినిమా షూటింగ్‌లకు టైమ్‌ అయ్యిందని పేర్కొంది. అందుకోసమే చెన్నైకి వెళ్తున్నట్టు పేర్కొంది. ఇందులో `చెన్నై డైరీస్‌` అని పేర్కొంది పూజా. అయితే ఇందులో థైస్‌ షోతో రచ్చ చేయడం విశేషం. మోకాళ్లపైకున్న బ్లాక్‌ వేర్‌లో మెరిసింది. మెరున్‌ కలర్‌ జాకెట్‌ ధరించింది. చాలా స్టయిలీష్‌గా ఉంది పూజా. 
 

పూజా కాళ్లపై ఇప్పటికే కుర్రాళ్లు పాటలు పాడుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సమయంలో ఈ అమ్మడు ఇలా కాళ్లని చూపిస్తూ, థైస్‌ షో చేస్తూ కనిపించడం మరింత హీటెక్కిస్తుంది. 

అయితే ఈ సందర్భంగా పూజా ధరించిన షూస్‌, ఆమె బ్యాక్‌ వార్తల్లో నిలుస్తుంది. లూయిస్‌ విట్టన్ బ్యాగ్‌ ధరించింది పూజా. దీని ధర భారీగానే ఉంటుందని తెలుస్తుంది. 

మరోవైపు ఉమెన్‌ లెధర్‌ ఫ్యాషన్‌ షూస్‌ ధరించింది. చాలా స్టయిలీష్‌గా ఉన్న ఈ షూస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం వీటి స్పెషాలిటీ గురించి వెతికే పనిలో బిజీగా ఉన్నారు ఆమె అభిమానులు.

ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. 

మరోవైపు అఖిల్‌తో నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌` సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ ఈ రోజు సాయంత్రం రిలీజ్‌ కానుంది. 

దీంతోపాటు మహేష్‌- త్రివిక్రమ్‌ చిత్రంలోనూ పూజాహెగ్డే హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభం కానుందని ఇటీవల మహేష్‌ తెలిపిన విషయం తెలిసిందే. 

తమిళంలోనూ ఓ భారీ సినిమా చేస్తుంది పూజా. దళపతి విజయ్‌తో కలిసి `బీస్ట్` సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకే పూజా చెన్నై వెళ్తుందని సమాచారం. మరోవైపు ధనుష్‌- వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందే సినిమాలోనూ  హీరోయిన్‌గా పూజా పేరు వినిపిస్తుంది.

తమిళంలోనూ ఓ భారీ సినిమా చేస్తుంది పూజా. దళపతి విజయ్‌తో కలిసి `బీస్ట్` సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకే పూజా చెన్నై వెళ్తుందని సమాచారం. మరోవైపు ధనుష్‌- వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందే సినిమాలోనూ  హీరోయిన్‌గా పూజా పేరు వినిపిస్తుంది.

Latest Videos

click me!