తలలో మల్లెలు.. చీరకట్టులో మెరిసిపోతున్న పరువాలు.. పూజా హెగ్దే కవ్వింపు చూస్తే మైండ్ బ్లాకే.!

First Published Dec 15, 2022, 6:12 PM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) ట్రెడిషనల్ లుక్ లో పరువాలను ప్రదర్శించింది. అందాల విందుతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తన నటించిన చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉండటంతో ఇలా క్రేజీ ఫొటోషూట్లతో ప్రమోషన్స్ చేసుకుంటోంది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్రస్తుతం బాలీవుడ్ లోనూ వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. తెలుగు సినీ పరిశ్రమలో కొన్నేండ్ల పాటు దుమ్ములేపిన ఈ హాట్ బ్యూటీ.. సౌత్ తో పాటు నార్త్ లోనూ అభిమానులకు సంపాదించుకుంటోంది. 

ఇప్పటికే హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సౌత్ లో గట్టి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం మళ్లీ బాలీవుడ్ వైపు అడుగులేస్తోంది. పూజా హెగ్దే నటించిన రెండు హిందీ చిత్రాలు ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి ఈనెలలోనే  రిలీజ్ కానుంది.
 

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన పిరియడ్ కామెడీ డ్రామా ‘సర్కస్’(CIRKUS). డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ హీరో రన్వీర్ సింగ్, పూజా హెగ్దే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, వరుణ్ శర్మ ప్రధాన పాత్రలో నటించారు. 
 

విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహించారు. పూజా హెగ్దే కూడా ‘సర్కస్’ చిత్ర ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటోంది. పలు ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ ఈవెంట్స్ కు హాజరవుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ప్రమోట్ చేసుకుంటోంది.

ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్ల అటెన్షన్ ను డ్రా చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను ఆరబోస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా చీరకట్టులో మెరిసిందీ బుట్టబొమ్మ. ట్రెడిషనల్ లుక్ లో మతులు పోగొట్టింది.

బ్లూ స్లీవ్ లెస్ బ్లౌజ్, స్కిల్ శారీలో పరువాలను ప్రదర్శించింది. టాప్ గ్లామర్ చూపుతూ కునుకు లేకుండా చేస్తోంది. తలలో మల్లెలు పెట్టి మంత్రముగ్ధులను చేస్తూ.. అభిమానులతో పాటు నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. చురకత్తుల్లాంటి చూపులతో యువతను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

అలాగే కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ‘కిసికా బాయ్ కిసికి జాన్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పూజా హెగ్దే తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘ఎస్ఎస్ఎంబీ 28’లో నటిస్తూ బిజీగా ఉంది.  

click me!