పూజా మనసుదోచిన బ్రూనో...  సమయం దొరికితే అతడితోనే గడిపేస్తుందట!

First Published Jan 16, 2021, 9:16 PM IST

స్టార్ హీరోయిన్ గా టాప్ ఫార్మ్ లో ఉన్న పూజా హెగ్డే, తన న్యూ ఇయర్ లక్ష్యాలు బయట పెట్టింది. ప్రతి కొత్త సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకుంటాము. ఈ ఏడాది నేను తీసుకున్న నిర్ణయం బ్రూనోతో గడపడమే అంటుంది పూజ. 

పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ మూవీలో నటిస్తున్నారు.
undefined
పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అలాగే తెలుగులో అక్కినేని అఖిల్ కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో నటిస్తున్నారు.
undefined
ఇక హిందీలో కూడా పూజా ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఏకంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో మూవీకి సైన్ చేసింది పూజా హెగ్డే.
undefined
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న కభీ ఈద్ కభీ దివాళి మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.
undefined
అలాగే మరో టాప్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న సర్కస్ మూవీలో కూడా పూజా హీరోయిన్ గా ఎంపిక కావడం విశేషం.
undefined
గత ఏడాది పూజా హీరోయిన్ గా నటించిన అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ అందుకోగా.. ఇటీవల జరిగిన  సెలెబ్రేషన్స్ లో పూజా పాల్గొన్నారు.
undefined
ఇక విషయానికి వస్తే ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఎక్కువ సమయం బ్రూనోతో గడుపుతాను అంటుంది పూజా.
undefined
పూజా మనసు దోచిన ఆ బ్రూనో ఎవరో కాదు, ఆమె పెట్ డాగ్. ఈ ఏడాది బ్రూనో తో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు, బ్రూనోకి కొత్త ట్రిక్స్ నేర్పుతాను అంటుంది. అలాగే తన పెర్ఫార్మన్స్ ను బట్టి ఇష్టమైన ఫుడ్ గిఫ్ట్ గా ఇస్తుందట. క్రేజీ పూజా కదా!
undefined
click me!