పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` జనం కోసమా? `జనసేన` రాజకీయాల కోసమా?

First Published Apr 9, 2021, 1:42 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ సినిమా `వకీల్‌సాబ్‌` ఎట్టకేలకు రిలీజ్‌ అయ్యింది. ఫ్యాన్స్ థియేటర్ లో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు. అదే సమయంలో ఈ సినిమా ద్వారా పవన్‌ కళ్యాణ్‌ తన పార్టీని, తన సిద్ధాంతాలను బాగా ప్రమోట్‌ చేసుకున్నాడనే టాక్‌ వినిపిస్తుంది. 

పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీగా హిందీలో సూపర్‌ హిట్‌ అయిన `పింక్‌` చిత్రాన్ని ఎంచుకున్నాడు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ దీన్ని తెలుగుకి తగ్గట్టు, ఇంకా చెప్పాలంటే పవన్‌ కళ్యాణ్‌కి తగ్గట్టు మార్పులు చేశారు. పవన్‌ మ్యానరిజమ్‌, పవన్‌ ఇమేజ్‌, స్టయిల్‌కి తగ్గట్టుగా దీన్ని తెరకెక్కించారు. సినిమాలో ఇంటర్వెల్‌లో వచ్చే ఫైట్‌ సీన్‌, వాష్‌రూమ్‌ ఫైట్‌, క్లైమాక్స్ ఫైట్‌, కోర్ట్ లో వాదనలు చాలా ఆసక్తికరంగా సాగుతాయి. హైలైట్‌గానూ నిలిచాయి. థమన్‌ బీజీఎం సైతం సినిమాని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసింది. కొన్నిసార్లు ఓవర్‌గానూ మారింది.
undefined
ఇంత వరకు బాగానే ఉంది. ఇవి పవన్‌ అభిమానికి సరిపోయే అంశాలు, ఎంజాయ్‌ చేసే అంశాలు. కానీ అసలు కథకి అనేక ఇతర అంశాలు జోడించడమే ఈ సినిమాని ట్రాక్‌ తప్పేలా చేశాయి. సినిమాలో పవన్‌ పూర్తిగా ఇన్‌వాల్వ్ అయ్యాడనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కథ పరంగానూ ఇందులో పవన్‌ కళ్యాణ్‌ ఇన్వాల్‌మెంట్‌ స్పష్టంగా కనిపిస్తుంది.
undefined
`పింక్‌` సినిమాని యదాతథంగా తీస్తే పవన్‌ ఇమేజ్‌కి సెట్‌ కాదు, అలాగని కమర్షియల్‌ అంశాలు జోడితే ఓవర్‌గా ఉంటాయి. ఈ సినిమా విషయంలో చాలా చోట్ల అదే ఫీలింగ్‌ కలుగుతుంది. ఇందులో రాజకీయాలను చర్చించడం సదరు ఆడియెన్స్ కి రుచించడం లేదు. అయితే సందర్భం వస్తే జనరల్‌ పాలిటిక్స్ ని, అందులోని లోటుపాట్లపై టచ్‌ చేయడంలో తప్పులేదు. దీన్ని అందరు ఆమోదిస్తారు. అది కూడా కన్విన్సింగ్‌గా చెబితేనే. లేదంటే అందరు ఆడియెన్స్ కి ఎక్కదు. `వకీల్‌సాబ్‌`లో ఇలాంటి యాంగిల్స్ కూడా ఉన్నాయి.
undefined
సినిమా చూసిన చాలా మంది ఆడియెన్స్ ఇదొక `జనసేన` (పవన్‌ కళ్యాణ్‌ పార్టీ ప్రమోషన్‌) సినిమాలా ఉందనే కామెంట్‌ చేస్తున్నారు. ఎందుకంటే మొదటి భాగంలో ఆయన చూపించిన చాలా సన్నివేశాల్లో జనసేన సిద్ధాంతాలు, ఆయన ప్రత్యక్షంగా చేసిన పోరాటలు ప్రతిబింబిస్తాయి. ప్రస్తుతం రాజకీయాలను డైరెక్ట్ గా టచ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగాలు రాలేదని విద్యార్థులు ఎంత అసహనంతో ఉన్నారనే విషయాలు ఇందులో చూపించారు పవన్‌. ఓయూ క్యాంపస్‌ పాలిటిక్స్ కి చూపించారు. ఓయూ విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వం ఎలా వాడుకుని, ఆ తర్వాత ఎలా మోసం చేసిందనే విషయాలను చూపించారు. ఓయూ విద్యార్థి నాయకుడిగా పవన్‌ కనిపించి తీరు ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వానికి, ఓయూ విషయంలో జరిగిన ఘటనలను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగాల కోసం విద్యార్థులు చేసిన పోరాటాలని ప్రభుత్వం ఎలా అణచి వేసిందో ఇందులో చూపించారు.
undefined
ఆ సమయంలోనే తాను లాయర్‌ చదువాలనుకోవడం, జనం కోసం, సమాజం కోసం తాను పోరాడాలని నిర్ణయించుకోవడం, లాయర్‌ చదివే క్రమంలోనే జనం సమస్యలను తెలుసుకోవడం, ఇందులో భాగంగా లాయర్‌గా పట్టా తీసుకున్నాక `సింగరేణి కార్మికుల` కోసం పోరాడి కేసు గెలవడం, వైజాగ్‌లోని `ఎల్జీపాలిమర్స్` గ్యాస్‌ లీకేజీ కేసుని గెలవడం, ఆ కంపెనీ మూసివేయించడం, అలాగే యూరేనియం తవ్వకాల కేసుపై లాయర్‌గా, ప్రత్యక్ష నాయకుడిగా పవన్‌ చేసిన పోరాటం, ఆదివాసిల హక్కుల కోసం పోరాడటం, పునరావాలకు సంబంధించిన విషయాలను టచ్‌ చేశారు. లాయర్‌గా ఆయన ఎంత ఫేమస్‌ అనేది తెలియజేసేందుకు ఇవన్నీ చూపించడమనేది ఆడియెన్స్ ని కాస్త డీవియేట్‌ అయ్యేలా ఉన్నాయి.
undefined
తెలంగాణ ప్రభుత్వంపై, నాయకులపై సెటైర్లు, కామెంట్లు చేసిన పవన్‌, ఏపీలో వైఎస్‌ ప్రభుత్వాన్ని దూషించలేకపోయారు. కేవలం సమస్యలను మాత్రమే చూపించారు. కానీ అందులో ప్రభుత్వ ఇన్‌వాల్వ్ మెంట్‌ని చూపలేదు. అంతటితో ఆగలేదు.. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ కండువని పట్టుకుని, తన సిద్ధాంతాలను చెప్పడం, పిడికిలి బిగించిన తన పార్టీ సింబల్‌ని తన బెల్డ్ పై చూపించడం వంటివన్నీ జనసేన పార్టీ సిద్ధాంతాలను తన పాత్ర రూపంలో ప్రొజెక్ట్ చేసినట్టుగానే ఉన్నాయి. ఇవన్నీ జనరల్‌ ఆడియెన్స్ కే కాదు, చాలా వరకు పవన్‌ ఫ్యాన్స్ కి కూడా కనెక్ట్ అయ్యేలా లేవు. అందుకే పలు విమర్శలు వస్తున్నాయి.
undefined
`పింక్‌` సినిమా కథని పవన్‌ తన పార్టీ సిద్ధాంతాలను ప్రొజెక్ట్ చేసుకునేందుకు వాడుకున్నాడా? అనే డౌట్‌ కూడా ఆడియెన్స్ లో కలుగుతుంది. కోర్ట్ సీన్లలోనూ పవన్‌ పదే పదే కేసుని జనరలైజ్‌ చేసి చెప్పడం, పదే పదే క్లాస్‌ పీకినట్టుగా, కోర్ట్ వేదికగా ప్రసంగాలు ఇచ్చినట్టుగానే ఉంది. `వకీల్‌సాబ్‌` ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు వేణు శ్రీరామ్‌ పవన్‌ ఈ సినిమా కథ విషయంలో ఇన్‌వాల్వ్ అయ్యారు. ఆయన కూడా దర్శకుడు. ఆయనకు దర్శకత్వంపై అవగాహన ఉంది. అందులో భాగంగా ఆయన చాలా వరకు సహకరించారని చెప్పాడు దర్శకుడు. కానీ సినిమా చూశాక స్క్రిప్ట్ మొత్తం పవనే దగ్గరుంచి తనకు అనుకూలంగా రాయించుకున్నట్టుగా ఉంది.
undefined
కోర్ట్ సీన్లు చాలా చోట్ల మరీ శృతి మించినట్టుగా ఉంటాయి. ప్రకాష్‌ రాజ్‌, పవన్‌ కళ్యాణ్‌ మధ్య వచ్చే కొన్ని సీన్లు మరీ ఓవరాక్షన్‌ ఫీలింగ్‌ని కలిగిస్తాయి. ఇద్దరు డ్రామాలు బాగా చెబుతున్నారు, కథలు బాగా అల్లుతున్నారు, బాగా నటిస్తున్నారని కామెంట్‌ చేసుకుంటారు. కానీ చూసే ఆడియెన్స్ కి వీరిద్దరు బాగా కామెడీ చేస్తున్నారని, మరీ ఓవర్‌ చేస్తున్నారనే ఫీలింగ్‌ కలుగుతుంది.
undefined
మధ్య తరగతి జనం ఆత్మగౌరవం, నిస్సాహయత మధ్య ఊగీసలాడతారని పెద్దవాళ్లు, అధికారంలో ఉన్న వాళ్లు భయపెడితే భయపడతారని, వాళ్లు తన వెంట ఉన్నా లేకున్నా, తాను మాత్రం వాళ్ల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాను అని ఇంటర్వెల్‌లో, కేసు గెలిచి బయటకు వచ్చాక జనమంతా తమ సమస్యలు, కేసులు పరిష్కరించాలని పవన్‌ వద్దకు వస్తే, మీ అందరి సమస్యలు నాకు తెలుసు. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, సమస్యలపై అందరం కలిసి పోరాడుదామని పవన్‌ చివర్లో చెప్పడం ఎన్నికల్లో ఆయన ఓటమిని, తిరిగి ఆయన చేస్తున్న ఉద్యమాలను గుర్తు చేస్తుంది. తనకు ఓటు వేయకపోవడం వల్ల ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశాడు పవన్‌. ఫైనల్‌గా ఇది `పింక్‌` రీమేక్‌ అనే విషయం పక్కకు వెళ్లి, పవన్‌ పార్టీకి సంబంధించిన అంశాలే హైలైట్‌ కావడం గమనార్హం.
undefined
click me!