లెజెండ్రీ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ తొలి అడుగు.. చిరు, అల్లు అరవింద్ తో పాటు సురేఖ ప్రమేయం ?

First Published Sep 2, 2021, 10:43 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రవేశం చాలా సులభంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కి ఎంట్రీ లభించింది. కానీ చాలా తక్కువ టైంలో పవన్ చిరంజీవి తమ్ముడనే ట్యాగ్ ని తన క్రేజ్ తో ఓవర్ టేక్ చేసేశాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రవేశం చాలా సులభంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కి ఎంట్రీ లభించింది. కానీ చాలా తక్కువ టైంలో పవన్ చిరంజీవి తమ్ముడనే ట్యాగ్ ని తన క్రేజ్ తో ఓవర్ టేక్ చేసేశాడు. ఒక దశలో నేను కూడా ఇక జాగ్రత్త పడాలి అని చిరంజీవి అనేంతలా పవన్ స్టార్ గా ఎదిగాడు. 

పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కానీ సినీ రంగంలో పవన్ తొలి అడుగు అంతకు ముందే పడింది. పవన్ కళ్యాణ్ టీనేజ్ వయసులోనే చిరంజీవి, కళాతపస్వి కె విశ్వనాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన శుభలేఖ చిత్రంలో చిన్న డైలాగ్ చెప్పాడు. 

చిరంజీవి డబ్బింగ్ థియేటర్ లో ఉండగా స్కూల్ నుంచి వచ్చాక పవన్ అన్నయ్యకు టీ ఇవ్వడానికి వెళ్ళాడు. శుభలేఖ నిర్మాత వివి శాస్త్రి అక్కడే ఉన్నారు. ఈ డైలాగ్ చెబుదూ రారా అని పవన్ ని పిలిచారట. దీనితో పవన్ 'మంచి నీళ్లు ఎక్కడ సార్' అనే డైలాగ్ చెప్పాడు. అలా సినీ రంగంలో పవన్ తొలి అడుగు కె విశ్వనాథ్ చిత్రంతో పడింది. 

ఇక అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో పవన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ నటుడిగా మారడం వెనుక చిరంజీవి ప్రమేయం తో పాటు వదిన సురేఖ ప్రోద్బలం కూడా ఉందని అంటారు. పవన్ ని నటుడిని చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతున్నప్పుడు.. కళ్యాణ్ బాబు చూడడానికి బావుంటాడు.. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని సురేఖ అన్నారట. 

ఆ తర్వాత పవన్ తొలి చిత్ర నిర్మాతగా అల్లు అరవింద్ ముందుకు వచ్చారు. ఇవివి డైరెక్షన్ లో పవన్ హీరోగా, సుప్రియ హీరోయిన్ ఆ చిత్రం తెరకెక్కింది. ఒక్కో మెట్టు అన్నట్లుగా గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు ఇలా ప్రతి చిత్రానికి పవన్ క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఖుషితో ఆ క్రేజ్ తారా స్థాయికి చేరింది. 

ఖుషి తర్వాత పదేళ్లు హిట్టు లేకపోవడం.. తిగిరి గబ్బర్ సింగ్ తో బాక్సాఫీస్ వద్ద జూలు విదల్చడం, పాలిటిక్స్ లోకి ఎంట్రీ.. జనసేన పార్టీ స్థాపన ఇవన్నీ పవన్ లైఫ్ లో కీలక ఘట్టాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన 50న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 

click me!