రెడ్‌ స్లీవ్‌లెస్‌ ట్రెండీ వేర్‌లో కిల్లింగ్‌ లుక్స్ తో కవ్విస్తున్న `పాగల్‌` బ్యూటీ నివేతా పేతురాజ్‌..

First Published Aug 12, 2021, 9:12 AM IST

`పాగల్‌` భామ నివేతా పేతురాజ్‌ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. కిల్లింగ్‌ లుక్స్ తో కేక పెట్టిస్తుంది. తాజాగా రెడ్‌ స్లీవ్‌లెస్‌ ట్రెండీ వేర్‌లో మతిపోగొడుతుంది. ఇంటర్నెట్‌ని ఆక్యూపై చేస్తూ హాట్‌ టాపిక్‌గా మారుతుంది. నివేతా లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుండటం విశేషం. 

నివేతా పేతురాజ్‌ తాజాగా విశ్వక్‌ సేన్‌తో కలిసి `పాగల్‌` చిత్రంలో నటించింది. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతుంది. డిఫరెంట్‌ లవ్‌ స్టోరీతో రూపొందుతున్న చిత్రమిది. 
 

ఇందులో విశ్వక్‌ సేన్‌ 1600 మంది అమ్మాయిలకు ఐ లవ్యూ చెబుతాడు. కానీ ఆయన ప్రేమించింది మాత్రం కేవలం హీరోయిన్‌ నివేతానే. కానీ తన ప్రేమకి ఆమె నో చెబుతుంది. 

ప్రేమించనంటే ప్రేమించనని, తనకు ప్రేమ పడదని చెబుతూ, ఆ తర్వాత నివేతా ప్రేమ కోసం తపించే విశ్వక్‌ ఏం చేశాడు, ఆమె ప్రేమని పొందాడా లేడా అన్నది ఈ సినిమా కథగా ఉంది.

జనరల్‌గా నివేతా మెచ్యూర్డ్ హవభావాలను పలికి ఆకట్టుకుంటుంది. ఇందులోనూ అలాంటి రోల్‌ చేసినట్టు కనిపిస్తుంది. తన సెక్సీ అందాలను సైతం పొదుపుగా చూపించినట్టు తెలుస్తుంది. 

తాజాగా `పాగల్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సందడి చేసింది నివేతా. స్లీవ్‌ లెస్‌ రెడ్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. స్టేజ్‌పై ఈ అమ్మడు హైలైట్‌గా మారింది. ఇందులో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లున్నా, అందరి చూపు తన వైపే తిప్పుకుంది నివేతా. 

తాజాగా ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో మొత్తం నివేతా పిక్స్ నే షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు అభిమానులు. 

ఇక `మెంటల్‌ మదిలో` చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది నివేతా పేతురాజ్‌. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన నటించి ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది.

ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ 'చిత్ర లహరి'లో మెరిసింది. మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. డీ సెంట్‌ హిట్లతో దూసుకుపోతుంది. 

శ్రీవిష్ణుతో కలిసి చేసిన `బ్రోచేవారేవరురా..' తో మరో విజయాన్ని అందుకుంది. ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో ప్రామిసింగ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. 

ఇటీవల అల్లు అర్జున్‌, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన `అల వైకుంఠపురములో` చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించి మెరిసింది. `రెడ్‌` చిత్రంతో పరాజయం మూటగట్టుకున్న ఈ భామ ఇప్పుడు `పాగల్‌`తో ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతుంది. 
 

click me!