గుబురు గడ్డం, మెడలో పులిగోరు గోండ్రు బెబ్బులిగా ఎన్టీఆర్... అంచనాలు పెంచేసిన ఆర్ ఆర్ ఆర్ లేటెస్ట్ లీక్ వీడియో!

First Published Jun 16, 2021, 1:18 PM IST

ఆర్ ఆర్ ఆర్ మూవీకి లీకుల బెడద తగ్గడం లేదు. ఏడాది కాలంలో పలుమార్లు ఆర్ ఆర్ ఆర్ సెట్స్ నుండి ఎన్టీఆర్ లుక్ లీక్ కావడం జరిగింది. తాజాగా ఆర్ ఆర్ ఆర్ ఎడిటింగ్ రూమ్ నుండి మరో వీడియో లీక్ కాగా, అంచనాలు భారీగా పెంచేసింది. 
 

గుబురు గడ్డం, మెడలో పులిగోరు, నేత వస్త్రం ధరించిన ఎన్టీఆర్ లుక్ ఊర మాస్ గా ఉంది. గోండ్రు బెబ్బులిగా ఎన్టీఆర్ లుక్ గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది.
undefined
గుబురు గడ్డం, మెడలో పులిగోరు, నేత వస్త్రం ధరించిన ఎన్టీఆర్ లుక్ ఊర మాస్ గా ఉంది. గోండ్రు బెబ్బులిగా ఎన్టీఆర్ లుక్ గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. ఆ వీడియోలో ఎన్టీఆర్ పులితో వీరోచితంగా పోరాడుతున్నారు.
undefined
భయంకరమైన పులితో ప్రాణాలకు తెగించి తలపడుతున్న ఎన్టీఆర్ ని ఆ లీక్డ్ వీడియోలో చూడవచ్చు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోతోనే ఆర్ ఆర్ ఆర్ అంచనాలు మరోస్థాయికి చేరిన నేపథ్యంలో తాజాగా లీకైన వీడియో సినిమాపై అంచనాలు పతాక స్థాయికి తీసుకెళ్లింది.
undefined
తాజా లీక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మరింత ఫిదా చేసేదిలా ఉంది. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్నడూ చూడని ఓ కొత్త ఎన్టీఆర్ ని చూడబోతున్నట్లు వారు భావిస్తున్నారు. విరోచితమైన కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తుంది.
undefined
ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 13గా విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో తిరిగి షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
undefined
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే.  ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ టీమ్ రెండు సార్లు విడుదల వాయిదా వేసింది. ఈసారైనా చెప్పిన ప్రకారం మూవీ విడుదల చేయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నారు.
undefined
డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. అలియా భట్, అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తున్నారు.
undefined
click me!