ఎంత మెగాస్టార్‌ అయినా నటుడిగా ఆ విషయంలో సక్సెస్‌ కాలేకపోయాడు.. ఎన్టీఆర్‌కి, చిరుకి ఉన్న తేడా అదే!

First Published Aug 22, 2021, 9:58 AM IST

టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి.. అనేక పాత్రలు, విభిన్న కథలు చేసి ఈ స్థాయికొచ్చారు. కానీ సినిమాల పరంగా ఒకే ఒక్క విషయంలో మాత్రం చిరు సక్సెస్‌ కాలేదు. ఎన్టీఆర్‌కి, చిరుకి ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది. 
 

చిరంజీవి.. మెగాస్టార్‌, గ్యాంగ్‌ లీడర్‌, బిగ్‌బాస్‌, మాస్టర్‌, బాస్‌, సుప్రీం.. ఇవన్నీ చిరంజీవికి పర్యాయపదాలు. ఒక్కో ట్యాగ్ తో తన నటన స్థాయిని, ఇమేజ్‌ స్థాయిని పెంచుకుంటూ వచ్చారు. టాలీవుడ్‌ కి ఇప్పుడు మెగాస్టార్‌ అయ్యారు.  నేడు ఆయన తన 66వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. వయసు ఆరున్నర దశాబ్దాలైనా ఆయన లుక్‌ మాత్రం 30 ప్లస్‌ అనేలా ఉన్నాడు. ఇటీవల ఆయన పంచుకున్న ఫోటో షూట్‌ లుక్స్ చూస్తే ఎవ్వరైనా ఇదే అంటారేమో. 

1955 ఆగస్ట్ 22న జన్మించారు చిరంజీవి. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వర ప్రసాద్‌. సినిమాల్లోకి వచ్చాక చిరంజీవిగా పేరు మార్చుకున్నారు. అభిమానుల గుండెల్లో నిజంగానే చిరంజీవి ముద్రని
వేసుకున్నారు. ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలకు, టాలీవుడ్‌ సినీవినీలాకాశంలో ఆయనో ధృవతారగా నిలిచారు. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసులో గెలుచుకున్నారు. తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనకు మించిన స్టార్‌ లేరని చెబితే అది అతియోక్తి కాదు. 

నవరసాలు పలికించడంలోనూ చిరంజీవి దిట. అద్భుతమైన కామెడీని, చేయగలడు, ఎమోషన్‌ని పండించగలడు. ఏడిపించడగలను, ఏడవగలడు వెండితెరపై నట విశ్వరూపం చూపించగలడు. ఇంతగా మెప్పించి జనాదరణ పొందిన చిరంజీవి ఒక్క విషయంలో మాత్రం సక్సెస్‌ కాలేదు. నటుడిగా ఆ విషయంలో ఫెయిల్యూర్‌ అనే చెప్పాలి. 

చిరంజీవి పౌరాణికి, హిస్టారికల్‌ పాత్రల్లో మెప్పించలేకపోయాడు. ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఇటీవల చిరంజీవి `సైరా నర్సింహరెడ్డి`తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తన జీవితంలో చేసిన తొలి హిస్టారికల్‌, కాస్ట్యూమ్‌ బేస్డ్ చిత్రం. ఉయ్యాల వాడ నర్సింహరెడ్డిగా వెండితెరపై మెప్పించినా, బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయాడు. ఇది విమర్శల ప్రశంసలకే పరిమితమైంది కానీ జనాదరణకు నోచుకోలేదు. 
 

అంతకు ముందు `శ్రీమంజునాథ` చిత్రంతోనూ ప్రయోగం చేశాడు చిరంజీవి. కె రాఘవేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. సినిమా పరాజయం సాధించిందంటే.. జనం చిరంజీవిని
ఆయా పాత్రల్లో చూడలేకపోయారనే కామెంట్లు వినిపించాయి. ఇలాంటి పాత్రలు చిరంజీవికి సెట్‌ కావని, కమర్షియల్‌, యాక్షన్‌ డ్రామాలే ఆయనకు సూట్‌ అవుతాయనే వాదన కూడా జరిగింది. 
 

దీంతోపాటు `అంజి` చిత్రంతో మరో ప్రయోగం చేశాడు చిరు. ఫాంటసీ యాక్షన్‌ చిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాసైతం ఆడియెన్స్ ఆదరణకు నోచుకోలేదు. క్రిటిక్స్ వైజ్‌గా ఫర్వాలేదనిపించినా థియేటర్ల వద్ద మాత్రం సత్తా చాటలేకపోయింది. ఇలా చిరంజీవి కొత్తగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

కానీ కమర్షియల్‌ చిత్రాలు, ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ చిత్రాలు, యాక్షన్‌ జోనర్‌లోని చిత్రాల్లో మాత్రం తిరుగులేని విజయాలను అందుకున్నారు. దీంతో ఎంత మెగాస్టార్‌ అయినా ఈ ఒక్క విషయంలో ఆయన సక్సెస్‌ కాలేకపోయారనే కామెంట్‌ తరచూ వినిపిస్తుంది. ఆయన్ని వెంటాడుతుంది.

టాలీవుడ్‌లో విశ్వ విఖ్యాత నట సార్వభమౌమ ఎన్టీఆర్‌ అన్ని పాత్రలకు సెట్‌ అయ్యారు. సాంఘీకం, పౌరాణికం, జానపదం, చరిత్రక చిత్రాలు, ఆయా పాత్రల్లో నటించారు. మెప్పించారు. కృష్ణుడు, రాముడు, సర్దార్‌  పాపారాయుడు, మేజర్‌ చంద్రకాంత్‌ ఇలా పాత్ర ఏదైనా రక్తికట్టించడం, దాన్ని బాక్సాఫీసు వద్ద దుమ్ముదులిపేయడంలో ఆయన దిట. 

ఎన్టీఆర్‌ అద్బుతమైన కామెడీ కూడా చేయగలడు. అందుకే ఆయన తిరుగులేని నటుడిగా నిలిచారు. తెలుగు చిత్ర సీమకి తలమానికంగా ఉన్నారు. కానీ చిరంజీవి సక్సెస్‌ కాలేకపోవడం నటుడిగా ఆయనకు ఇదొక వెలితిగా నిలిచిపోయింది. 

click me!