చిరంజీవి, నాగార్జునలను మించి నా మార్క్ క్రియేట్‌ చేస్తా.. ప్రేమగా ఎలా పిలిచినా పలుకుతాః ఎన్టీఆర్‌ ‌

First Published Mar 13, 2021, 2:09 PM IST

`ఎవరు మీలో కోటీశ్వరులు` నాల్గో సీజన్‌లో చిరంజీవి, నాగార్జునలు తమ మార్క్ చూపించారు. నేను వారికి మించి నా మార్క్ ని క్రియేట్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. పాల్గొన్న వారికి కచ్చితంగా కాన్ఫిడెన్స్ ని ఇస్తాను. అది నాది గ్యారంటీ. అయితే సోషల్‌ మీడియాపై ఆసక్తి లేదు` అని ఆసక్తికర కామెంట్‌ చేశారు ఎన్టీఆర్‌. 

ఎన్టీఆర్‌ హోస్ట్ గా `ఎవరు మీలో కోటీశ్వరులు` షో ప్రసారం కాబోతుంది. జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ఈ షోని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ప్రోమో విడుదల చేశారు. ఎన్టీఆర్‌ తనదైన స్టయిల్‌తో ప్రోమోని రక్తికట్టించారు. ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటీ మీరు.. రండి గెలుద్దాం.. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు. ఎవరు మీలో కోటీశ్వరులు. మీ రామారావు` అని చెప్పారు.
undefined
ఈ సందర్భంగా ప్రెస్‌ ఇంటరాక్షన్‌లో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ షో చేయడానికి పెద్దగా రీజన్‌ లేదని చెప్పిన ఆయన విభిన్న నేపథ్యాలకు, ఎమోషన్స్ కి చెందిన వారితో ఇంటరాక్ట్ కావడం అదృష్టమన్నారు. దీంతో రకరకాల ఎమోషన్స్ ఉండేవారిని కలవచ్చు అని చెప్పారు. దీంతో వారి జీవిన విధానం తెలుస్తుందన్నారు.
undefined
ఈ షో ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని, వ్యక్తిగతంగా చాలా ఇన్‌స్పైర్‌ అవుతామని నమ్ముతున్నానని చెప్పారు. మనిషి తాత్పర్యాన్ని అర్థం చేసుకునే వీలుంటుందన్నారు.
undefined
ఇప్పటికే చిరంజీవి, నాగార్జున గారు ఈ షోపై వాళ్ల మార్క్ ని క్రియేట్‌ చేశారు. కచ్చితంగా ఇది నాకు ఛాలెంజ్‌. హంబుల్‌గా ఈ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేశాను. నా వంతు ఒక మార్క్ ని క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
undefined
ఈ షో ద్వారా డబ్బు గెలవడమే ముఖ్యం కాదని, అదొక సెక్యూరిటీ మాత్రమే అని, కానీ కచ్చితంగా జీవితంలో గెలుస్తామనే నమ్మకాన్ని పొందుతారని, లైఫ్‌కి కావాల్సిన నమ్మకాన్ని ఇస్తానని చెప్పారు. ఆ విషయంలో తనది గ్యారంటీ అన్నారు.
undefined
సోషల్‌ మీడియాపై స్పందిస్తూ, తనకి సోషల్‌ మీడియాలో ఉండటం ఇష్టం ఉండదని, ఒక కల్పిత ప్రపంచంలో ఉండలేనని చెప్పారు. అదే సమయంలో ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నాను, ఏం జరుగుతుందనేది నాకు అప్‌డేట్‌ ఇచ్చేందుకు కొంత మంది తనతో ఉన్నారని, వారికి థ్యాంక్స్ చెప్పారు. మూడేళ్లుగా సోషల్‌ మీడియాలో కనిపించకపోవడానికి `ఆర్‌ఆర్‌ఆర్‌` కారణమన్నారు. సోషల్‌ మీడియాని మిస్‌ అవుతున్న ఫీలింగ్‌ ఏం లేదన్నారు.
undefined
మన తెలుగు వారి స్టోరీన్‌ని దేశ వ్యాప్తంగా చెప్పడం గొప్ప విషయమని, `ఆర్‌ఆర్‌ఆర్‌`లో భాగం కావడం గర్వంగా ఫీలవుతున్నా. మన హీరోలను దేశవ్యాప్తంగా చూపించే చిత్రమిదన్నారు. ఇందులోని కొమురంభీమ్‌ పాత్రకి బాగా ఎగ్జైట్‌ అయ్యానని, అలాగే రామ్‌చరణ్‌ నటించే అల్లూరి పాత్ర విషయంలో కూడా అని, సినిమా కోసం ఎగ్జైటింగ్‌గా వెయిట్‌ చేస్తున్నట్టు చెప్పారు.
undefined
ప్రోమోలో ఫస్ట్ టైమ్‌ రామారావు అని చెప్పడం కొత్తగా ఉంది. దీనిపై ఆయన స్పందిస్తూ, చిన్నప్పటి నుంచి తనని రకరకాలుగా పిలిచేవారని, అమ్మ ఒకలా, భార్య ఒకలా, స్నేహితులు మరోలా, ఫ్యామిలీ ఇంకోలా, పిల్లలు డాడీ అని ఇలా పిలుస్తుంటారు. అందరు ప్రేమతో అలా పిలుస్తారని, ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతా అని చెప్పాడు ఎన్టీఆర్‌.
undefined
బాధ్యతలను, ఒత్తిళ్లని తీసుకుంటూ ముందుకెళ్లడమే మనిషి లక్షణం. రెండూ ఉండాలి. రెండు ఉంటేనే మన పని సక్రమంగా చేయగలుగుతాం. జీవితంలో ఎదుగుతామని చెప్పారు. మనిషి అసామాన్యుడు అని, వారి పరిస్థితులు, ఫేట్‌ని బట్టి, నమ్మకాన్ని బట్టి అలా ఉండిపోతారని చెప్పారు.
undefined
ఫ్యాన్స్ పై స్పందిస్తూ, టీమ్‌తారక్‌ పేరుతో తన వంతు కృషి చేస్తున్నానని, కానీ అభిమానులు నాకు చాలా ఎక్కువే చేస్తున్నారని చెప్పారు. ఫ్యాన్స్ కి ఎంత సేవ చేసినా తీరనిది. ఎంత చేసినా సరిపోదు. కాకపోతే అంతా కాలర్‌ ఎగిరేలా చేస్తానని చెప్పారు. సేవ అనేది ఎన్టీఆర్‌ అభిమానిగా కాదు, మనుషులుగా సేవ చేస్తే బాగుంటుందని చెప్పారు.
undefined
హాట్‌ సీట్‌పై కూర్చొవడం చదువుకున్నవాళ్లు మాత్రమేగానీ, ఇంటలిజెన్స్ వాళ్లు మాత్రమే ఆడే గేమ్‌ కాదు. చదువు ఎంత ముఖ్యమో, చదువు కంటే ముఖ్యమైనది నాలెడ్జ్ అన్నారు. ఇది ఏ స్కూల్‌, కాలేజ్‌లో నేర్చించదు. జీవితంలో అనుభవాలను బట్టి నాలెడ్జ్ వస్తుందన్నారు.
undefined
ఇక తాము యాక్టర్స్ అయ్యాక ఫ్రీడమ్‌ పోయిందని, ఈ షో ద్వారా అందరిని కలిసే ఛాన్స్ వస్తుందన్నారు. ఓ షో ద్వారా వంద మందిని కలిసే అవకాశం రావడం గొప్ప విషయం. ఈ షో ద్వారా నేను కూడా నేర్చుకుంటానని, ఇది మంచి కొడుకుగా, మంచి తండ్రి, మంచి భర్తగా, మంచి మనిషిగా తయారయ్యేలా చేస్తుందని చెప్పారు. రాజకీయాలపై స్పందించేందుకు ఇది సమయం, సందర్భం కాదన్నారు. సున్నితంగా తిరస్కరించారు.
undefined
click me!