NTR30: ఎన్టీఆర్‌కి హీరోయిన్‌ దొరికింది.. ఆ భామ కల నెరవేరుతుంది?

Published : Jan 03, 2023, 07:32 PM ISTUpdated : Jan 03, 2023, 08:05 PM IST

ఎన్టీఆర్‌ కోసం `ఎన్టీఆర్‌30`లో అరజడను హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వీరిలో ఎవరూ ఒప్పుకోలేదు. ఎట్టలకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలుస్తుంది. 

PREV
15
NTR30: ఎన్టీఆర్‌కి హీరోయిన్‌ దొరికింది.. ఆ భామ కల నెరవేరుతుంది?

ఎన్టీఆర్‌ కోసం చాలా రోజులుగా హీరోయిన్‌ని వెతుకుతున్నారు. కానీ సెట్‌ కావడం లేదు. తారక్‌కి హీరోయిన్‌ని సెట్‌ చేయడం దర్శక నిర్మాతల కోసం పెద్ద టాస్క్ గా మారింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు. ఇప్పుడు మాత్రం ఓ వైపు స్క్రిప్ట్, మరోవైపు హీరోయిన్‌ అస్సలు ఫైనల్‌ కావడం లేదనే టాక్‌ వినిపించింది. అయితే ఇప్పుడు రెండూ ఒకేసారి సెట్‌ అయ్యాయి. ఓ వైపు స్క్రిప్ట్ ఫైనల్‌ అయినట్టుగానే హీరోయిన్‌ కూడా కుదిరిందట.  

25

ఇదంతా ఏ సినిమా కోసమో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును ఎన్టీఆర్‌ 30 కోసం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ఎనిమిది నెలల క్రితమే ప్రారంభం కావాల్సింది. స్క్రిప్ట్ ఫైనల్‌ కాకపోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవలే ఎన్టీఆర్‌ సాటిస్ఫై అయ్యారట. దీంతో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ చేశారు. ఓ వైపు మ్యూజిక్‌ సిట్టింగ్స్ కంప్లీట్‌ అయ్యాయి. మరోవైపు ఇప్పుడు హీరోయిన్‌ కూడా ఫైనల్‌ అయ్యిందనే వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

35

ఎన్టీఆర్‌ కోసం `ఎన్టీఆర్‌30`లో అరజడను హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అలియాభట్‌, రష్మిక మందన్నా, మృణాల్‌ ఠాకూర్‌, మాళవిక మోహనన్‌, కీర్తిసురేష్‌, కియారా అద్వానీతోపాటు జాన్వీ కపూర్‌ పేర్లు వినిపించాయి. కానీ వీరిలో ఎవరూ ఒప్పుకోలేదు. పాత్ర ప్రభావమా? నిడివి విషయంలో అభ్యంతరమా? తెలియదు గానీ అందరూ నో చెబుతూ వచ్చారు. అయితే జాన్వీ కపూర్‌ ఇప్పుడు ఓకే చెప్పిందని సమాచారం. అయితే ముందుగా ఆమె కూడా తిరస్కరించిందన్నారు. కానీ ఎట్టలకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలుస్తుంది. 

45

చాలా కాలంగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని జాన్వీ కపూర్‌ ప్రయత్నిస్తుంది. విజయ్‌ దేవరకొండ `లైగర్‌`లోనే ఆమె నటించాల్సి ఉంది. కానీ కుదరలేదు. దీంతో మరో మంచి ప్రాజెక్ట్ తో సౌత్‌ ఎంట్రీ ఇవ్వాలనుకున్నట్టు వార్తలొచ్చాయి. దీనికితోడు జాన్వీ.. ఎన్టీఆర్‌పై తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది. ఆయన్ని ఆకాశానికి ఎత్తేసింది. ఆయనతో నటించేందుకు తన ఆసక్తిని కనబరిచింది. ఆ లెక్కనే ఇప్పుడు ఆయనతోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్.  మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే జాన్వీ కల నెరవేరబోతుందని చెప్పొచ్చు. 
 

55

ప్రస్తుతం ఎన్టీఆర్‌ అమెరికాలో ఉన్నారు. ఫ్యామిలీతో ఆయన వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నెల మొత్తం ఆయన అమెరికాలోనే ఉండే ఛాన్స్ ఉందట. అనంతరం ఇండియాకి తిరిగి వచ్చి ఫిబ్రవరిలో ఎన్టీఆర్‌30 షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. నాన్‌ స్టాప్‌గా షూటింగ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు కొరటాల. ఇప్పటికే ఏడాది గ్యాప్‌ రావడంతో ఇక షూటింగ్‌లో గ్యాప్‌ రాకుండా చూసుకుంటున్నారట. త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఉగాది పండుగని పురస్కరించుకుని విడుదల చేయబోతున్నారు. ఈ లెక్కన ఈ ఏడాది తారక్‌ వెండితెరపై కనిపించబోడు. ఇది అభిమానులకు పెద్ద లోటే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories