2015లో వచ్చిన ‘నేను రౌడీనే’ చిత్రాన్ని దర్శకుడు విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి - నయనతారా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంతో నయనతార, విగ్నేష్ కు మంచి పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి.. చివరికి పెళ్లి పీటల వరకు వచ్చింది. ఏడేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలో గ్రాండ్ గా వివాహం జరిగింది.