నయనతార, విగ్నేష్ శివన్, విజయ్ సేతుపతితో సమంత సెలెబ్రేషన్స్.. ఎందుకో తెలుసా!

First Published Aug 23, 2021, 1:54 PM IST

సౌత్ క్రేజీ హీరోయిన్ సమంత తన నటనా ప్రతిభతో వివాహం తర్వాత కూడా దూసుకుపోతోంది. సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2. ఇటీవల అమెజాన్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఘనవిజయం సాధించింది. 

సౌత్ క్రేజీ హీరోయిన్ సమంత తన నటనా ప్రతిభతో వివాహం తర్వాత కూడా దూసుకుపోతోంది. సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2. ఇటీవల అమెజాన్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఘనవిజయం సాధించింది. 

ఈ వెబ్ సిరీస్ లో సమంత నటనకి గాను ప్రతిష్టాత్మాక ఐఎఫ్ఎఫ్ ఎం అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీనితో మరోసారి సమంతపై ప్రశంసల వర్షం కురిసింది. 

ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత శ్రీలంక తమిళ రెబల్ గా నటించిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత సత్తా ఇండియా మొత్తం తెలిసింది. 

రాజి రోల్ కోసం సమంత డీగ్లామర్ గా కనిపించింది. తన మేకోవర్ ని అద్భుతంగా మార్చుకుంది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది. 

వెబ్ సిరీస్ విభాగం లో బెస్ట్ ఫిమేల్ పెర్ఫామర్ గా సమంతకు అవార్డు దక్కింది. ప్రస్తుతం సమంత 'కాత్తువకుల రెండు కాదల్' అనే చిత్రంలో నటిస్తోంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

సమంతకు అవార్డు రావడంతో సెట్స్ లో నయనతార, విజయ్ సేతుపతి, విగ్నేష్ సెలెబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. చిత్ర యూనిట్ తో పాటు మరికొందరితో సమంత ఆగార్డు విన్నింగ్ సెలెబ్రేషన్స్ చేసుకుంది. 

సెలెబ్రేషన్స్ లో సరదా మూమెంట్స్ ని సామ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. తన మేకోవర్ మార్చుకుంటున్న పిక్ కూడా షేర్ చేసింది. 

ఇదిలా ఉండగా సమంత మరోవైపు గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం అనే పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!