పవన్ కి సపోర్ట్ గా నాని, పెరుగుతున్న హీట్.. మంత్రి అనిల్ కామెంట్స్ పై సంపూర్ణేష్ రియాక్షన్

First Published Sep 26, 2021, 3:47 PM IST

రిపబ్లిక్ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల హీట్ క్రమంగా పెరుగుతోంది. చిత్ర పరిశ్రమపై ఏపీ ప్రభుత్వవైఖరిని ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ విమర్శలతో చెలరేగిపోయారు.

రిపబ్లిక్ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల హీట్ క్రమంగా పెరుగుతోంది. చిత్ర పరిశ్రమపై ఏపీ ప్రభుత్వవైఖరిని ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ విమర్శలతో చెలరేగిపోయారు. చిత్ర పరిశ్రమని ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ విధానాన్ని తీసుకువస్తుందని పవన్ విమర్శించారు. 

ఏపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు చిత్ర పరిశ్రమ మొత్తం ఏకం కావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఏపీ ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోవడం వల్లే ఆన్లైన్ టికెట్ విధానాన్ని తీసుకువస్తున్నారని విమర్శించారు. ఏపీలో థియేటర్స్ సమస్య, ఆన్లైన్ టికెట్ విధానం, టికెట్ ధరలు లాంటి సమస్యలతో ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. 

pawan kalyan

ఈ పరిస్థితుల వల్ల చాలా చిత్రాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ చిత్రం కూడా ఓటిటిలోనే విడుదలయింది. వ్యక్తిగతంగా తనకు ఇష్టం లేకున్నా ప్రస్తుత పరిస్థితుల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని నాని వివరణ ఇచ్చాడు. కానీ ఎగ్జిబిటర్లు మాత్రం నానిపై విమర్శలు గుప్పించారు. 

దీనిపై పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఆడియో వేడుకలో స్పందించారు. ఈ సమస్యకు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి నానిని విమర్శిస్తే ఏమొస్తుంది అని పవన్ అన్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నాని ట్వీట్ చేయడం విశేషం. 

'పవన్ కళ్యాణ్ సర్ కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న రాజకీయ విభేదాలు పక్కన పెట్టండి. ఆయన చెప్పిన విషయాలు వాస్తవమైనవి. నిజాయతీతో చిత్ర పరిశ్రమ సమస్యలు వివరించారు. తక్షణమే వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. థాంక్యూ పవన్ కళ్యాణ్ సర్. ఇంకా ఆలస్యం కాకముందే సీఎం జగన్ గారు, సంబంధిత మంత్రులు ఈ సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాను' అంటూ నాని ట్వీట్ చేశాడు. 

ఇదిలా ఉండగా పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు వరుసగా విమర్శలు మొదలు పెట్టారు. 'ఆన్లైన్ లో టికెట్లు అమ్మితే తప్పేంటి. మాకు పవన్ కళ్యాణ్ అయినా సంపూర్ణేష్ బాబు అయినా ఒకటే. వైసిపి నేతలపై ట్రోలింగ్ పెంచేందుకే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.  

అనిల్ కామెంట్స్ పై సంపూర్ణేష్ బాబు స్పందించారు. 'మంత్రి అనిల్ గారు,  మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం.  ఏ సమస్య వచ్చినా  పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో వున్నారు. అదే పెద్ద మనసుతో అవి  పరిష్కారం అయ్యేలా చూడగలరు' అంటూ సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశారు. 

click me!