పవన్ ఆస్తులపై నాగబాబు వ్యాఖ్యలు! లాజిక్ మిస్ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!

First Published Feb 1, 2023, 1:41 PM IST

నాగబాబు చెప్పినట్లు పవన్ కి కేవలం ఇల్లు, స్థలం, కార్లే ఉన్నాయి అనుకుందాము. వాటి విలువ ఎంత అనేది ఇక్కడ మేటర్. నాగబాబు స్థలం అన్నారు కానీ దాని పరిమాణం, విలువ చెప్పలేదు. 

Pawan Kalyan

చూస్తుంటే నాగబాబు తమ్ముడు పవన్ పొలిటికల్ ఇమేజ్, మైలేజ్ పెంచే బాధ్యత తీసుకున్నట్లనిపిస్తుంది. చెప్పాలంటే చిరంజీవి కూడాను. చిరంజీవి నాకు రాజకీయాలు సరిపడవంటూనే జనసేనకు మద్దతుగా పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారు. తమ్ముడు పవన్ ఆదర్శ భావాలున్న నాయకుడు. ఏదో రోజు సీఎం సీటులో కూర్చుంటాడని జోస్యం చెబుతున్నారు. ఇక జనసేనలో కీలక నాయకుడిగా ఉన్న నాగబాబు పవన్ గొప్ప త్యాగజీవి, నిస్వార్థపరుడని చెబుతున్నారు.

Pawan Kalyan

తాజా ఇంటర్వ్యూలో నాగబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి డబ్బు పిచ్చి లేదు. సంపాదించిన మొత్తం సమాజ సేవకే వాడేశాడని చెప్పే ప్రయత్నం చేశారు. నాగబాబు మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ కి డబ్బు మీద మోజు లేదు. దాన్ని జాగ్రత్త చేయడం కూడా తెలియదు. అన్నయ్య బ్లడ్ బ్యాంకు పెట్టి కోట్లు సమాజహితం కోసం ఖర్చు చేశాడు. పవన్ ఆపదలో ఉన్నవారికి దానం చేశాడు. జనసేన పార్టీ కోసం డబ్బులు వాడేస్తున్నాడు. 
 

Pawan Kalyan


జాని సినిమా నాటికి పవన్ రెమ్యూనరేషన్ కోటిన్నర. మూవీ ప్లాప్ కావడంతో బయ్యర్లు నష్టపోయారు. తన రెమ్యునరేషన్ మొత్తం బయ్యర్లకు ఇచ్చేశాడు. అలాగే తన పేరిట ఉన్న స్థలం అమ్మి మరి కొంత ఇవ్వబోయాడు. నేను వద్దని చెప్పి అడ్డుకున్నాను. పవన్ కళ్యాణ్ తత్త్వం అలా ఉండేది. పవన్ స్టార్ హీరోగా వందల కోట్లు కూడాబెట్టారని అందరూ అపోహపడతారు. అది నిజం కాదు. పవన్ కళ్యాణ్ కి కేవలం ఒక ఇల్లు, స్థలం, కార్లు ఉన్నాయి. అవి కూడా తాకట్టులో ఉన్నాయి. 
 

Pawan Kalyan


పిల్లల కోసం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్స్ డబ్బులు కూడా పార్టీ కోసం ఖర్చు చేశాడని నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ లాజిక్ మిస్ అవుతుంది. గత రెండేళ్లలో పవన్ భీమ్లా నాయక్, వకీల్ సాబ్ చిత్రాలు విడుదల చేశారు. హరి హర వీరమల్లు మూవీ చేస్తున్నారు. హరీష్ శంకర్, సుజీత్ లతో చిత్రాలు ప్రకటించారు. వినోదయ సిత్తం రీమేక్ కూడా చేస్తున్నట్లు సమాచారం. 


ఈ చిత్రాల రెమ్యూనరేషన్ దాదాపు రూ. 300 కోట్లు. ఈ మొత్తంలో ఇతర ఖర్చులు, టాక్స్ కటింగ్స్ తీసేసినా రెండు వందల కోట్లకు పైనే ఆయన సినిమాల ద్వారా సంపాదించారు. ఇంత ఆదాయం ఉన్న పవన్ అప్పులు చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదని నెటిజెన్స్ అభిప్రాయం. కాదు పార్టీ కోసం ఖర్చు చేశారు అనుకుంటే వందల కోట్లు ఖర్చయ్యే పొలిటికల్ ఈవెంట్స్ ఏముంటాయని?   నాగబాబుని ప్రత్యర్ధులు ప్రశ్నిస్తున్నారు. .  

Pawan Kalyan

జనసేన ఎక్కడ మీటింగ్ పెట్టినా స్థానిక నాయకులే ఏర్పాట్లు చేస్తున్నారని. ఒకవేళ సభల ఏర్పాటుకు అవసరమైన డబ్బులు జనసేన పార్టీనే ఇస్తుందనుకున్నా ఒక సభ ఖర్చు రూ. 5 లక్షల లోపే ఉంటుందంటున్నారు. జనసేన డై హార్డ్ ఫ్యాన్స్ చందాల రూపంలో వేలు, లక్షలు పార్టీ అకౌంట్లో వేస్తున్నారు. ఒక పార్టీని నడపడానికి వందల కోట్లు కావాలంటే ఈ దేశంలో ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు పుట్టవు కదా అనే అంశం లేవనెత్తున్నారు. 
 

నాగబాబు చెప్పినట్లు పవన్ కి కేవలం ఇల్లు, స్థలం, కార్లే ఉన్నాయి అనుకుందాము. వాటి విలువ ఎంత అనేది ఇక్కడ మేటర్. నాగబాబు స్థలం అన్నారు కానీ దాని పరిమాణం, విలువ చెప్పలేదు. హైదరాబాద్ నగరం నడిబొడ్డుగా మారిన గండిపేట్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 ఎకరాల ఫార్మ్ హౌస్ ఉంది. దాని ఖరీదు ఎంతో చెబితే బాగుండేది. గజాలు లక్షలు పలికే చోట ఆయనకు ఎకరాల నేల ఉంది. ఈ క్రమంలో అంత విలువైన ఆస్తులు, సంపాదన కల పవన్ పేదవాడంటే నమ్మలా అంటున్నారు. ఇదే విషయాన్ని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లేవనెత్తారు. సినిమాకు రూ. 50 కోట్లు తీసుకుంటున్న పవన్ పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారా? అని ఎద్దేవా చేశారు.

pawan kalyan


అలాగే ఆస్తులు తాకట్టు పెట్టే స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ కోట్లు ఖర్చుపెట్టి వారాహి తయారు చేయిచాడంటే జనాలు నమ్మడం లేదు. వారాహిని అన్ని హంగులతో ప్రత్యేకంగా రూపొందించారు. రెండు కోట్లకు పైనే ఖర్చు చేశారు.  దేశంలోనే కాస్లీ ప్రచార రథం కలిగిన పొలిటీషియన్ గా పవన్ రికార్డులకు ఎక్కాడు. దానికి ఆర్మీ వాహనాన్ని తలపించే రంగు, రూపం. సిక్కు యోధుల ప్రహారా... ఇవన్నీ సామాన్యుడు చేసే పనులేనా? నిరాడంబరతకు అర్థం ఇదేనా?... అని వాపోతున్నారు. 

Pawan Kalyan

 పవన్ కి ఏ విషయంలో స్పష్టత లేదు. ఏది పూర్తి స్థాయిలో చేయరు. పొత్తు రాజకీయాలు, రీమేక్ సినిమాలతో... పవన్ పై జనాల్లో ఉన్న ఆ కొద్ది ఆసక్తికూడా పోతుందంటున్నారు. ఇకనైనా పవన్ గట్టి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందంటున్నారు. 

click me!