గల్లీ బాయ్ ని హీరోని చేసిన నాగబాబు... డైరెక్టర్ గా జబర్ధస్త్ కమెడియన్!

First Published Jan 20, 2021, 7:45 AM IST


నాగ బాబు తన ఫేవరేట్ కమెడియన్ ని ఏకంగా హీరోగా మార్చేశాడు.  జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది షో కంటెస్టెంట్ సద్దాం హీరోగా ఆయన ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. బస్తీ బాయ్స్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది. 
 

ఈ సినిమా యొక్క మరొక విశేషం ఏంటంటే... ఈ మూవీకి జబర్ధస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా బుల్లెట్ భాస్కర్ కి ఇది మొదటి చిత్రం కాగా ఆయన స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
undefined
అదిరింది, బొమ్మ అదిరింది షోలలో గల్లీ బాయ్స్ గా సద్దాం చేసే అల్లరి అంతా ఇంతా కాదు. రాయలసీమ యాసలో సద్దాం వేసే పంచులకు మంచి హాస్యం పండుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ, రాజశేఖర్ వంటి స్టార్స్ ని ఇమిటేట్ చేస్తూ ఆయన చేసే కామెడీ అద్భుతం అనాలి.
undefined
యూట్యూబ్ లో ఉన్న సద్దాం అదిరింది ఎపిసోడ్స్ కి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. అయితే తన షోలో చేసే కమెడియన్ ని హీరోగా మార్చి తన ప్రత్యేకత చాటుకున్నారు నాగబాబు.
undefined
జబర్ధస్త్ షో నుండి తనతో పాటు బయటికి వచ్చిన కిరాక్ ఆర్పీ దర్శకుడిగా మారగా... అతని సినిమా ఓపెనింగ్ కి వెళ్లి ప్రచారం కల్పించాడు. ఇప్పుడు జబర్ధస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ ని దర్శకుడిగా మార్చడం జరిగింది.
undefined
ఈమధ్యనే విడుదలైన బస్తీ బాయ్స్ లుక్ కి విశేష ఆదరణ దక్కుతుంది. ఈ నేపథ్యంలో హీరోగా సద్దాం, దర్శకుడిగా బుల్లెట్ భాస్కర్ ఏ మేరకు సత్తా చాటుతారో చూడాలి.
undefined
click me!