Karthika Deepam: శౌర్యని వెతుకుతున్న శివ.. విషయం తెలుసుకొని ఆశ్చర్యంతో మోనిత!

First Published Oct 19, 2022, 7:39 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 19వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..కార్తీక్, వారణాసి కోమా లో ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్లి వారణాసిని చూస్తూ, వారణాసి మమ్మల్ని కలపబోయి నీకు ఇంత కష్టం వచ్చింది నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను నీకు నయమైన వెంటనే నా సొంత మనిషిలా చూసుకుంటాను నీకు ఏ కష్టం రానివ్వను అని అంటాడు. అప్పడు అక్కడికి డాక్టర్ రాగా వారణాసి పరిస్థితి ఎలా ఉన్నది అని కార్తీక్ అడుగుతాడు. ఇంకా కోమాలోనే ఉన్నారు కానీ ప్రతి ట్రీట్మెంట్ కి రియాక్ట్ అవుతున్నారు అని డాక్టర్ చెబుతారు. అప్పుడు ఆ డాక్టర్ కార్తీక్ ని చూసి, మీ ప్రొఫైల్ ఫోన్లో చూశాను. చాలా బాగున్నది మరి హైదరాబాద్ వదిలి ఎందుకు ఇక్కడికి వచ్చారు ఏమైనా హాస్పిటల్లో పని చేస్తున్నారా అని అనగా, అనుకోని పరిస్థితిలో రావాల్సి వచ్చింది ఇంకొన్ని రోజులు ఉంటాము ఈ లోపల ఏమైనా సర్జరీలు ఉంటే చెప్పండి 

ఇంట్లో ఖాళీయే అని అనగా సరే మీలాంటి మంచి డాక్టర్ ఉండడం మాకు లాభమే కదా అని ఆ డాక్టర్ అంటాడు. ఆ తర్వాత సీన్లో దీప, వాళ్ళ అన్నయ్యకి కాఫీ ఇస్తూ డాక్టర్ బాబుకి ఎవరు ఫోన్ చేసి ఉంటారు ఇప్పుడే వస్తాను అని వెళ్లిపోయారు ఈ ఊర్లో డాక్టర్ బాబుకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య అలాగ అనుకోవద్దు అమ్మ ఈమధ్య ఒక కార్తీక్ లో మార్పు వస్తుంది బయటకు వెళ్ళినా సరే తిరిగి ఇల్లు దారి గుర్తు పెట్టుకొని వస్తున్నాడు. అలాగే పేర్లు కూడా మర్చిపోవడం లేదు కొంచెం కొంచెంగా గుర్తొస్తున్నాయి నీకు మంచి రోజులు వచ్చినట్టే అని అంటాడు. అప్పుడే వచ్చిన దుర్గ అవును దేపమ్మ, నీకు మంచి రోజులు వస్తున్నాయి. చూసావా ఆ మోనిత ఎలాగా గింజుకుంటుందో. కార్తీక్ సార్ కి గతం గుర్తొచ్చే లోపల ఇదే నువ్వే సార్ భార్య అని చెప్పి పరిపోతాది అని అంటాడు.ఆ తర్వాత సీన్ లో మోనిత తన ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ, కార్తీక్ ఎక్కడికి వెళ్లి ఉంటాడు.
 

అంత అర్జెంటుగా ఈ ఊర్లో కార్తీక్ కి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు ఎక్కడికి వెళ్లావు కార్తీక్ అని మోనిత అడగగా ఊరికే అలా తిరగడానికి వెళ్లాను అని కార్తీక్ అంటాడు. ఏదో ఫోన్ వస్తే వెళ్లావు కదా అని మోనిత తిరిగి అడుగుతుంది. ఫ్రెండ్ ని చూడడానికి వెళ్ళాను అని కార్తీక్ సమాధానం ఇస్తాడు దానికి మోనిత, ఈ ఊర్లో నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా అని అనగా, నీకు ఉన్నారు కదా ఫ్రెండ్స్ నాకెందుకు ఉండకూడదు అని కార్తీక్ అంటాడు. ఆ ఫ్రెండ్ పేరేంటి అని అడుగుతుంది. సుబ్బారావు, అప్పారావు లేకపోతే ఆనందరావు, సౌందర్యవో నీకు తెలుసా వాళ్లు అని కార్తీక్ అంటాడు. దానికి మోనిత ఉలిక్కిపడి ఆనందరావు సౌందర్య అంటున్నాడేంటి.తెలిసి అన్నాడా తెలీకన్నాడా అని భయపడి ఆగు కార్తిక్ ఈ మధ్య నువ్వు మాత్రులు సరిగ్గా వేసుకోవడం లేదు అని మతిమరుపు మాత్రలు కావాలని కార్తీక్ కి ఇచ్చి ఇప్పుడే కాఫీ తెస్తాను కార్తీక్ లోపలికి వెళ్తుంది మోనిత. 

అప్పుడు కార్తీక్ టాబ్లెట్ వేసుకున్నట్టు వేసుకొని పక్కన పారేస్తాడు. మోనిత వచ్చేసరికి వేసుకున్నట్టు ఈ టాబ్లెట్ దేనికోసం అని కార్తీక్ అడగగా గతం గుర్తు రావడానికి కార్తీక్  అని మోనిత అంటుంది. నాకు గతం మరిచిపోయేలా చేసి దీప అడ్డు తొలగించి హ్యాపీగా ఉందామనుకున్నావు కదా మోనిత ఎంత ప్లాన్ చేశావు అని మనసులో మోనితని తిట్టుకుంటాడు కార్తిక్.తర్వాత సీన్లో దీప తన ఇల్లంతా చండాలంగా ఉన్నది అని వాళ్ళ అన్నయ్యతో అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఎలాగో కార్తీక్ లో కొంచెం మార్పు వస్తుంది కదా ఇద్దరు మా ఇంటికి వచ్చేయొచ్చు కదా అని అనగా వద్ద హేమచంద్ర గారు అని కార్తీక్ అంటాడు. అప్పుడు హేమచంద్ర(దీప వాళ్ళ అన్నయ్య)  ఆశ్చర్యపోతాడు. మీకు నా పేరు ఎలా తెలుసు అని అడగగా గుర్తున్నది ఈమధ్య ఏంటో కొంచెం కొంచెం గుర్తొస్తున్నాయి అని కార్తీక్ అంటాడు. అప్పుడు దీప, ఎక్కడి నుంచి వస్తున్నారు డాక్టర్ బాబు ఏదో ఫోన్ వచ్చింది అని అడుగుతుంది.
 

ఇప్పుడు వారణాసి పేరు చెప్తే నాకు గతం గుర్తొచ్చింది దీపకి తెలుస్తుంది అని వద్దు అని అనుకొని కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేశారు దీప అక్కడి నుంచి బయట పడాలని ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి బయటకు వచ్చేసాను అని అనగా హేమచంద్ర, ఈమధ్య ఇంట్లో నుంచి తప్పించుకోవడానికి మంచి సాకే అది అంటాడు. అప్పుడు కార్తీక్, నేను మీకు ఇల్లు శుభ్రం చేయడంలో సహాయం చేస్తాను ఎలాగో ఇంట్లో ఊసుపోవడం లేదు అని అంటుంది. అప్పుడు హేమచంద్ర కావాలని, నాకు చిన్న పని ఉన్నది మీ ఇద్దరు ఉండండి చనేను తర్వాత వస్తాను అని దీప కార్తిక్ లకు ఏకాంత సమయం ఇస్తారు.దాని తర్వాత హేమచంద్ర వెళ్లినప్పుడు కార్తీక్ దీప తో, ఈరోజు వంట నేను చేస్తాను వంటలక్క అని అంటాడు. దానికి  దీప ఆలోచనలు పడుతుంది.నేను మరీ అంత దరణంగా వంట చేస్తానా అని అనగా లేదు డాక్టర్ బాబు మీరు బానే వంట చేస్తారు అని దీప అంటుంది. 

అప్పుడే కార్తీక్ కి ఫోన్ వచ్చి బయటకు వెళ్తాడు అప్పుడు శివ కార్తీక్ మాట్లాడుతూ సర్ మూడు కాలనీలు వెతికించారు ఆ పాప ఇంకా ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను సార్ అని అంటాడు. అప్పుడు కార్తీక్, ఆ పాప మనకు ఎలాగైనా కావాలి బాగా వెతుకు అని అంటాడు.ఆ తర్వాత శివ ఇంటికి వస్తున్నప్పుడు మోనిత ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంది.ఏమి లేదు మేడం చిన్న పనులు ఉండి వెళ్తున్నాను అనగా,చాలా రోజుల నుంచి నీ ప్రవర్తన మారుతుంది శివ నిజం చెప్పు లేకపోతే నేను ఉన్న జీతం కూడా తీసేస్తాను అలాగే నీ పనులు చూసుకో మా పనులు ఎందుకులే అని అనగా శివ భయపడిపోయి జరిగిన విషయం అంతా చెప్పేస్తాడు. దానికి మోనిత భయపడి కార్తీక్ కి గతం గుర్తొచ్చేసిందా. ఒకవేళ గుర్తొస్తే దీప ను తీసుకుని వెళ్ళిపోతాడు కదా ఇప్పుడు శౌర్య కనిపిస్తే, దీప శౌర్య కాలువకూడదు అలాగే శౌర్య,కార్తీక్ నీ చూడకూడదు అని అనుకొని, శివ ఈరోజు నుంచి నీకు 2000 జీతం పెంచుతాను.

ఇంక పాప గురించి మర్చిపో అని  అనగా మీరు డబ్బులు పెంచుతారు అంటే నేను ఎందుకు ఆ పని చేస్తాను మేడం అని  శివ ఆనందపడతాడు. ఇంతలో దుర్గా అక్కడికి వస్తాడు నేను వెళ్తాను మేడం అని దుర్గను చూసిన శివ అనగా దుర్గ శివని ఆపుతాడు. అప్పుడు మోనిత, ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇప్పుడు కార్తీక్ లేడు కదా అని అనగా, అక్కడ దీప కార్తిక్ సర్ లను ఏకాంతంగా వదిలేయడానికి వచ్చానులే అని అంటాడు. దానికి మోనిత కంగారు పడుతూ అక్కడికి వెళుతుంది. అప్పటికే కార్తీక్ భోజనం వండి దీప ను కూర్చోబెడతాడు. నేను వడ్డిస్తాను అని కార్తీక్ అనగా మీరు వంట చేశారు కదా డాక్టర్ బాబు చాలు నేను వడ్డిస్తాను అని వాళ్ళు కూర్చుంటారు. అప్పుడు అక్కడేకి వచ్చిన మోనిత కోపంతో,నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ కార్తీక్ అయినా వంటలక్క నా మొగుడుతో నువ్వేం చేస్తున్నావే అని అనగా కార్తీక్ అడ్డుకొని, ఇంట్లో వాళ్ళ ప్రవర్తనలే బాగుంటే నేను ఎందుకు ఇక్కడికి వస్తాను ఇంట్లోనే ఉండేవాడిని కదా అని అనగా నేనేం తప్పు చేశాను కార్తీక్ నన్ను అంటున్నావు అని అంటుంది మోనిత. 

తప్పును నీకే చెప్పడం ఎందుకు మోనిత. అక్కడ జరిగిన వాటికి చూడ్డానికి నాకే అశయ్యం వేసి ఇక్కడికి వచ్చేసాను అని అంటాడు.దానికి దీప, జరిగిన విషయమే కదా డాక్టర్ బాబు చెప్తున్నారు నువ్వే దుర్గతో ఏకాంతంగా ఉండాలని శివతో డాక్టర్ బాబుని రెండు గంటలు బయటికి పంపించమన్నావు కదా అని అనగా మోనిత ఆశ్చర్య పోతుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!