మోహన్‌బాబు ఇంట్లో మోహన్‌లాల్‌, మీనా.. అరుదైన కలయిక.. ఫోటోలు వైరల్‌

First Published Aug 7, 2021, 8:22 PM IST

కలెక్షన్‌ కింగ్‌, డైలాగ్‌ కింగ్‌ మంచు మోహన్‌బాబు ఇంట్లో మలయాళ సూపర్‌ స్టార్ మోహన్‌లాల్‌, అలనాటి హీరోయిన్‌ మీనా సందడి చేశారు. మోహన్‌బాబు ఇంట్లో డిన్నర్‌ చేశారు. ఈ సందర్బంగా వీరు దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

మంచు మోహన్‌బాబుకు మలయాళ, తమిళ సీనియర్‌ నటులతో మంచి స్నేహం ఉంది. రజనీకాంత్‌, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ లాంటి సీనియర్‌ హీరోలు ఇప్పటికి మోహన్‌బాబుతో టచ్‌లో ఉంటారు. 

షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వస్తే.. కచ్చితంగా మోహన్‌బాబుని కలిసి వెళ్తుంటారు. అందులో భాగంగా తాజాగా మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌లాల్‌, నటి మీనా మంచువారి ఇంట్లో సందడి చేశాడు. 

మంచు కుటుంబంతో కలిసి మోహన్‌లాల్‌, మీనా భోజనం చేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మంచు లక్ష్మి. వారితో కలిసి దిగిన ఫోటోలు పంచుకుంటూ ఈ విషయాన్ని తెలిపింది. 

మోహన్‌బాబు, మోహన్‌లాల్‌ కలిసి డిన్నర్‌ చేశారు. వారి సినిమాల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నారని తెలిపింది మంచు లక్ష్మీ. 

మోహన్‌లాల్‌ నటిస్తున్న `బ్రో డాడీ`మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇందులో మోహన్ లాల్ సరసన మీనా నటిస్తోంది. వీరిద్దరినీ ఇటీవల మోహన్ బాబు తన ఇంటికి విందుకు ఆహ్వానించారు.

మోహన్ బాబు సతీమణి నిర్మల, కుమార్తె మంచు లక్ష్మీ, కొడుకు కోడలు విష్ణు, విరోనికా వీళ్ళంతా కలసి మోహన్ లాల్ తో ఫోటోలు కూడా దిగారు. వీటిని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

click me!