ముద్ద మందారం విరబూసినట్లు చిరునవ్వు.. టాప్ యాంగిల్ లో వరుణ్ తేజ్ హీరోయిన్ అందాల జడివాన

First Published Dec 11, 2022, 2:41 PM IST

యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. 

యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. 

మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించింది. 

ఈ మూవీలో మృణాళిని భలే క్యూట్ గా నటించి మెప్పించింది. అల్లరి పిల్ల తరహాలో ఆమె ఈ సినిమాలో బాగా సందడి చేసింది. ఆ చిత్రంలో ఆమె చేసింది గ్లామర్ రోల్ కాదు. కేవలం నడుము సొగసుతోనే మెప్పించింది. 

దర్శకుడు హరీష్ శంకర్ కంట్లో పడ్డ మృణాళిని గద్దలకొండ గణేష్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో మృణాళిని పాత్ర పూర్తి స్థాయి హీరోయిన్ రోల్ కాదు. కానీ గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రే. 

గ్లామర్ పరంగా కూడా మృణాళిని చూడ ముచ్చటగా ఉండడంతో సినిమా అవకాశాలు వస్తున్నాయి. పూర్తి స్థాయి హీరోయిన్ గా రెండు హిట్స్ పడితే ఈ టిక్ టాక్ బేబీ సినిమాల్లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. ప్రస్తుతం మృణాళినికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. 

ప్రస్తుతం మృణాళిని సోషల్ మీడియాలో కుర్రాళ్ళ హృదయాలకు గాలం వేసేలా గ్లామర్ షో మొదలు పెట్టింది. సింపుల్ గా చీరకట్టులో కళ్ళు చెదిరే ఫోజులు ఇస్తోంది. క్యూట్ గా ఉండే మృణాళిని బ్యాక్ సైడ్ సొగసు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

టాప్ యాంగిల్ అందాలకు కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కలువ కళ్ళతో ఈ యంగ్ బ్యూటీ చేస్తున్న మ్యాజిక్ అంతా ఇంతా కాదు. చీరకట్టులో ఆమె సొగసు చూపు తిప్పుకోవడం కష్టం అన్నట్లుగా ఉంది. 

 మృణాళిని వయ్యారాలకు కుర్రాళ్ల హృదయాలు గల్లంతవ్వడం ఖాయం. ఇటీవల మృణాళిని నటించిన 'ఎనిమి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్, ఆర్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.  

click me!