Malli: మాలినికి జాగ్రత్తలు చెప్పిన వసుంధర.. అరవింద్ పై సీరియస్ అయిన మాలిని?

First Published Feb 8, 2023, 12:46 PM IST

Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు ఫిబ్రవరి 8వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో అరవింద సైలెంట్ గా వచ్చి పడుకోవడంతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అరవింద్ అనగా ఏమైంది మాలిని అనడంతో ఇందాక మల్లీ చేసిన పనికి అందరూ మాలిని తిడుతూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు ఏమి మాట్లాడలేదు అని అంటుంది. మల్లీ నా బాధ్యత అని అంటావు మరి అందరికంటే ముందు నువ్వే కదా మల్లీ మీద సీరియల్స్ అవ్వాలి. కానీ నువ్వు మాత్రం మౌనంగా ఉన్నావేంటి అరవింద్ అని అడుగుతుంది మాలిని. ఆ విషయం గురించి పక్కన పెడితే కనీసం నేను ఉన్నాను సంగతి కూడా మరిచిపోయి నీ అంతట నువ్వే పడుకుంటున్నావు కలిసి ఒకే గదిలో ఉన్నాము అన్న మాటే కానీ నీకు మాకు మధ్య చాలా దూరం పెరుగుతోంది అరవింద్ కలిసి దగ్గరికి తీసుకొని ఓదార్చి నన్ను ఎన్ని రోజులు అయింది అని అంటుంది మాలిని.
 

ఇప్పుడు ఏమైంది మాలిని ఎందుకు చిన్న దానికి పెద్ద దానికి రాద్ధాంతం చేస్తావు అని అంటాడు అరవింద్. మల్లీ తన ఆచారం సంప్రదాయమని చెప్పింది కదా మరి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావడం లేదు అని అంటాడు అరవింద్. నువ్వు చెప్పింది కరెక్టే అరవిందు నేను ఎక్కువగానే ఆలోచిస్తున్నాను. మరి నేను ఎందుకు అలా ఆలోచిస్తున్నానో నువ్వు అయినా ఆలోచించావా అని అంటుంది మాలిని. గుడ్ నైట్ చెప్పి పడుకుంటుంది మాలిని. ఆ తర్వాత సత్య మీరా దగ్గరికి వెళ్లి నువ్వు కూడా నాకు అబద్దాలు చెప్పడం నేర్చుకున్నావా అనడంతో ఏం జరిగింది సత్య అనగా అప్పుడు పేపర్లో శరత్ మల్లీ ఫోటో చూపించడంతో అది చూసి మీరా ఒక్కసారిగా షాక్ అవుతుంది.
 

మల్లీ కి తన తండ్రి ఆ పట్నం బాబు అని చెప్పావా అనగా నేను చెప్పలేదు సత్య నా మాట నమ్ము అంటుంది మీరా. ఒకవేళ నేను చెప్పింది నిజమే అయితే సంతోషం. ఆ పట్నం బాబు మల్లీ సంతోషంగా ఉంటారు అంటే నేను ఈ జీవితంలో మీ కంటికి కనిపించను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ఫోటోని చూసి కోపంతో రగిలిపోతూ ఎలా అయిన మల్లీ తో ఫోన్ మాట్లాడాలి అనుకుంటూ అక్కడికి వెళుతుంది. ఇప్పుడు మళ్లీ కి ఫోన్ చేయగా అప్పుడు మల్లీ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయడంతో అవతల మల్లీ మాట్లాడుతుందా లేదా అన్నది కూడా పట్టించుకోకుండా శరత్ తన తండ్రి అన్న నిజాన్ని మీరా తన నోటితోనే మల్లీకి చెబుతుంది.
 

అప్పుడు అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేసి మల్లీ కి అసలు విషయం తెలియదు అత్తయ్య అనడంతో మీరే షాక్ అవుతుంది. అల్లుడుగారు మీకు నిజం ఎలా తెలుసు అని అనడంతో అప్పుడు అరవింద్ మామయ్య మీ ఊరికి వచ్చినప్పుడు నాకు తెలిసింది అని అంటాడు. నా బిడ్డకి అని అనగా నేను ఉన్నాను ఏ ఇబ్బంది రానివ్వను అని మాట ఇస్తాడు. మరొకవైపు వసుంధర, మాలిని ఇద్దరు ఒక చోట కలుస్తారు. మల్లీ స్టేట్ సెకండ్ ర్యాంకు వచ్చిందని మీ ఇంట్లో పండగ చేసుకొని ఉంటారు కదా అనడంతో అలాంటి పల్లెటూరి అమ్మాయి సెకండ్ ర్యాంకు రావడం అంటే మామూలు విషయం కాదు కదా నేను కూడా సంతోషపడ్డాను అని అంటుంది మాలిని. ఎక్కువ సంతోష్ పడిపోకు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు మాలిని అంటారు.
 

మీ ఇంట్లో వాళ్ళు ఆ మల్లీనీ నెత్తిన పెట్టుకుంటారు ఇప్పుడు స్టేట్ ర్యాంకు రావడంతో దాన్ని ఏ కాలేజీలో చేర్పించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు కచ్చితంగా మీ కాలేజీలో చేర్పిస్తారు కానీ నువ్వు కుదరదు వేరే కాలేజీలో చేర్పించమని చెప్పు అదేంటి మామ్ నేను మొదటి నుంచి మా కాలేజీలో చేర్పిస్తానని మా వాళ్లకు మాట ఇచ్చాను అని అంటుంది మాలిని. నువ్వు అరవింద్ సంతోషంగా ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్ మాలిని అంటుంది వసుంధర. ఆ తర్వాత సరే అని చెప్పి మాలిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు కాలేజీ ఫ్యాకల్టీ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మాలిని రావడంతో నీకోసమే ఎదురు చూస్తున్నాం అని నీతో ఒక విషయం మాట్లాడాలి అంటాడు ప్రిన్సిపల్.

మల్లీ అనే అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటుంది కదా ఆ అమ్మాయికి ఫ్రీ సీట్ ఇచ్చి మన కాలేజీలో జాయిన్ చేసుకుందామని అనుకుంటున్నాం ఏమంటావ్ మాలిని,మల్లీ కోసం కాలేజీలో అన్ని పోటీ పడతాయి అందుకే నేను ముందుగానే నేను అడుగుతున్నాను అంటారు ప్రిన్సిపల్. అప్పుడు ప్రిన్సిపల్ ప్లీజ్ మాలిని నా మాట విను అమ్మాయిని చేర్పించు అనడంతో మాలిని,వసుంధర అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అందరు కలిసి భోజనం చేస్తూ ఉండగా ఇంతలో మల్లీనీ ఏ కాలేజీలో చేర్పించాలి అన్న టాపిక్ రావడంతో అప్పుడు సిటీలో ఏది టాప్ కాలేజీ అయితే దాంట్లో చేర్పిద్దాము అని అంటారు.
 

అప్పుడు అరవింద్ వాళ్ళ నాన్న మాలిని పనిచేస్తున్న కాలేజీలో చేర్పిస్తే మంచిది కదా అని అంటాడు. అప్పుడు అనుపమ కూడా అవును అరవింద్ అని అంటుంది. అప్పుడు మాలిని వసుంధర అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అరవింద్ వద్దు అమ్మ మల్లీ నీ మాలిని వాళ్ళ కాలేజీలో చేర్పించడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. ఎందుకు వద్దో చెప్పు అర్థమైంది మాట దాటేయకు అసలు విషయం చెప్పు అని అంటుంది మాలిని. ఏం లేదు మాలినీ నీకు మల్లీ కి మధ్య మనస్పర్ధలు మాటలు సరిగ్గా లేదు కదా అందుకే వద్దనుకున్నాను అనగా  ఏం మాట్లాడుతున్నావ్ అరవింద్ నేను నీకు ఆ విషయం చెప్పానా అని అనడంతో లేదు మాలిని అనగా మాట్లాడుతున్నావో అరవింద్ అంటుంది మాలిని.
 

అప్పుడు మాలిని సీరియస్ అవుతూ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మల్లీ ఎటువంటి ప్రాబ్లం లేదు మధ్యలో నీకే ప్రాబ్లం అదేంటో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. ఓకే అరవింద్ నేను చెప్పాల్సింది నేను చెప్పాను తర్వాత నీ ఇష్టం అని చెప్పి భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని. అప్పుడు అందరూ బాధపడుతూ ఉంటారు.

click me!