మలైకాకి కరోనా.. ప్రియుడు అర్జునే అంటిచ్చాడా?

First Published Sep 7, 2020, 2:20 PM IST

బాలీవుడ్‌ హాట్‌ అండ్‌ సెక్సీ హీరోయిన్‌ మలైకా అరోరాకి కరోనా సోకింది. సోమవారం ఆమె కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని మలైకా పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టింది. తనకు కరోనా పాజిటివ్ ‌వచ్చినప్పటికీ లక్షణాలేవి లేవని వెల్లడించింది.

`ఈ రోజు టెస్ట్ చేసుకోగా, కరోనా పాజిటివ్‌ అని తేలిసింది. నేను ప్రస్తుతం బాగానే, ఆరోగ్యంగానే ఉన్నానని తెలియజేస్తున్నా.కరోనాకి సంబంధించి నియమాలను, నిబంధనలను, డాక్టర్ల సూచనల, సలహాలు, అధికార వర్గాలు సూచనలు పాటిస్తూఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటున్నా.
undefined
ప్రతి ఒక్కరు ప్రశాంతంగా, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాల`ని తెలిపింది.
undefined
ఇదిలా ఉంటే ఆదివారం మలైకా ప్రియుడు అర్జున్‌ కపూర్‌కి కరోనా పాజిటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. ఆయనకు కూడాపెద్దగా లక్షణాలేవి కనిపించడం లేదని తెలిపారు.
undefined
అయితే మలైకాకి వైరస్‌ ఎలా సోకిందనేదనే దానిపై బాలీవుడ్‌లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ప్రియుడితో తిరగడంవల్లే ఆమెకి సోకి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
undefined
గత కొన్ని రోజులుగా అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా బహిరంగంగానే డేటింగ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. అనేక పార్టీల్లోఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ప్రస్తుతం ఇద్దరు ఘాటు ప్రేమతోపాటు రొమాన్స్ లోనూ మునిగి తేలుతున్నట్టుసమాచారం.
undefined
click me!