టాలీవుడ్ టాప్ స్టార్ గా మహేష్.. పవన్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ పొజిషన్స్ తెలిస్తే షాక్ అవుతారు!

First Published May 14, 2021, 10:32 AM IST

ఏ పరిశ్రమలో అయినా ఎవరు నంబర్ వన్ అనేది కీలక అంశం. చిత్ర పరిశ్రమలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. నంబర్ వన్ హీరో, హీరోయిన్, కమెడియన్, డైరెక్టర్ ఇలా ఎవరు ముందు అనేది ప్రేక్షకులు గమనిస్తూ ఉంటారు. టాలీవుడ్ అనేక మంది టాప్ స్టార్స్ ఉండగా వారిలో అత్యధిక క్రేజ్ కలిగినవారు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం...

ప్రముఖ జాతీయ సర్వే సంస్థ ఆర్మాక్స్ టాలీవుడ్ హీరోలలో అత్యధిక ఫాలోయింగ్ ఎవరికి ఉందనేది సర్వే చేసి ఫలితాలు ప్రకటించింది.  ఆర్మాక్స్ సంస్థ సర్వే ఫలితాల ప్రకారం టాలీవుడ్ నంబర్ వన్ స్టార్ గా మహేష్ నిలిచాడు. అత్యధిక సినిమా ప్రేమికులు తమకు మహేష్ అంటే క్రేజ్ అని చెప్పడంతో ఆయనకు నంబర్ వన్ స్థానం దక్కింది. ఈ మధ్య వరుస విజయాలు అందుకుంటున్న మహేష్ క్రేజ్ అమాంతంగా పెరిగింది.
undefined
ఈ సంస్థ సర్వేలో అనూహ్యంగా అల్లు అర్జున్ సెకండ్ పొజిషన్ కి వచ్చి చేరారు. మహేష్ తరువాత అత్యధిక మంది ఇష్టపడుతున్న స్టార్ గా అల్లు అర్జున్ నిలిచారు. గత చిత్రం అల వైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన రేసులో దూసుకు వచ్చారు.
undefined
పాన్ ఇండియా స్టార్ గా ఇండియా వైడ్ ఫాలోయింగ్ కలిగిన ప్రభాస్ మూడో స్థానంలో నిలవడం ఆశ్చర్య పరిచే అంశమే. ప్రభాస్ నుండి మూవీ వచ్చి రెండేళ్లు కావస్తుండగా ఆయన రేసులో వెనుకబడ్డారు.
undefined
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ ల తరువాత అత్యధిక ఫాలోయింగ్ కలిగిన టాలీవుడ్ హీరోగా నిలిచారు. ఎన్టీఆర్ నుండి కూడా గత మూడేళ్ళుగా మూవీ రాకపోవడం ఆయన నాలుగో స్థానంలో నిలవడానికి కారణం అయ్యింది.
undefined
అయితే ఫ్యాన్స్ తమ దేవుడిగా చెప్పుకొనే పవన్ కళ్యాణ్ ఐదో స్థానానికి పరిమితం కావడం ఊహించని పరిణామమే. మూడేళ్లు రాజకీయాల కారణంగా సినిమాల నుండి గ్యాప్ తీసుకున్న పవన్ నంబర్ వన్ గేమ్ లో వెనుకబడ్డారు.
undefined
ఇక ఆరో స్థానం ఆర్ ఆర్ ఆర్ స్టార్ రామ్ చరణ్ దక్కించుకున్నారు. రామ్ చరణ్ టాప్ ఫైవ్ లో చోటు సంపాదించలేకపోవడం అనూహ్య పరిణామం.
undefined
ఇక టూ టైర్ హీరోలలో నంబర్ వన్ గా ఉన్న నాచురల్ స్టార్ నాని టాప్ టెన్ లో చోటు సంపాదించారు. రామ్ చరణ్ తరువాత ఏడో స్థానం ఆయన అందుకున్నారు.
undefined
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండకు సైతం టాప్ టెన్ లో చోటు దక్కింది. విజయ్ దేవరకొండ ఎనిమిదవ స్థానంలో నిలిచాడు.
undefined
చివరి రెండు స్థానాలు సీనియర్ హీరోలు దక్కించుకున్నారు. క్రాక్ తో హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజ తొమ్మిదవ స్థానం అందుకోవడం గమనార్హం.

ravi teja

కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఎవర్ గ్రీన్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు. చిరంజీవి చివరిదైన పదో స్థానంలో నిలిచారు.
undefined
ఆర్మాక్స్ సంస్థ సర్వే ఫలితాల ప్రకారం టాలీవుడ్ నంబర్ వన్ స్టార్ గా మహేష్ నిలిచాడు.
undefined
click me!