ఈరోజు ఎపిసోడ్లో అనసూయ నాకు చెప్తున్నారు గానీ మీరు మర్చిపోగలరా చెప్పండి. మీ అందర్నీ బాధ పెట్టాను ఇంట్లో ఆనందాన్ని దూరం చేశాను ఆయన పెదవులపై చిరునవ్వును దూరం చేశాను అని అంటుంది అనసూయ. ఇంత చేసి ఎలా ప్రశాంతంగా ఉండగలను ఒక్కసారిగా మీ అందరి దృష్టిలో పాతాలానికి దిగజారిపోయాను అని అంటుంది అనసూయ. అప్పుడు తులసి అత్తయ్య మీరు చెప్పదలచుకున్నది ఇదే అయితే ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు అని అంటుంది. అప్పుడు తులసి తన మాటలతో అనసూయకు ధైర్యం చెబుతుంది.