నడుముని విల్లులా వంచుతూ రెడ్‌ చురిదార్‌లో బేబమ్మ కైపెక్కించే పోజులు.. రాజహంసలా కృతిశెట్టి హోయలు..

First Published Oct 6, 2022, 6:50 AM IST

తెలుగు తెరపై బేబమ్మగా తనదైన ముద్ర వేసుకున్న కృతి శెట్టి హోమ్లీ బ్యూటీగా నిలిచిన విషయం తెలిసిందే.  కానీ అది తన కెరీర్‌కి అడ్డంకిగా మారుతుందనుకుందేమో హాట్‌ డోస్‌  పెంచుతూ మత్తెక్కిస్తుంది. 
 

`ఉప్పెన` బ్యూటీ కృతిశెట్టి గ్లామర్‌ డోస్‌ పెంచుతూ కనిపిస్తున్న విషయం తెలిసిందే. గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ ఆమె సోషల్‌  మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. నెటిజన్లని తరచూ టచ్‌లో ఉంటుంది.  తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందాల విందుతో అందరిని ఎంగేజ్‌ చేస్తుంది. 
 

తాజాగా ఈ టాలీవుడ్‌ బేబమ్మ చుడిదార్‌లో మెరిసింది. రెడ్‌ చురిదార్‌లో కృతి శెట్టి హోయలు పోయింది. దసరా పండుగ సందర్భంగా అభిమానులకు ట్రీట్‌  ఇచ్చింది. రెడ్‌ డ్రెస్‌ లో కృతిశెట్టి లేలేత అందాలు ఘాటెక్కగా.. ఆమెని ఇలా చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అసలైన దసరా పండగ తెచ్చిందంటూ కామెంట్లు  చేస్తున్నారు.  

కృతి శెట్టి అందాలకు ఫిదా అవుతున్న నెటిజన్లు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. ఘాటెక్కిన బేబమ్మ అందాలు అని, రెడ్‌ చురిదార్‌లో అందాల రాజహంసలా ఉందని, క్యూట్‌ అందాలు కాస్త హాట్‌గా మారాయని, ఉప్పెన భామ ఫైరింగ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆమె ఫోటోలను పంచుకుంటూ వైరల్‌ చేస్తున్నారు. 
 

`ఉప్పెన` సినిమాతో టాలీవుడ్‌లో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది హీరోయిన్‌ కృతిశెట్టి. తొలి చిత్రంతో తన క్యూట్‌ అందాలు, మంచి నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీని చూసి టాలీవుడ్‌ మొత్తం ఫిదా అయ్యింది. దీంతో అభిమానులకే కాద, ఇండస్ట్రీ కూడా ఆమె వెంటపడింది. వరుస ఆఫర్లు వచ్చింది. మొదటి  మూడు సినిమాలతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. 
 

Krithi Shetty latest

కానీ ఇటీవల ఆమె నటించిన చిత్రాలన్నీ  పరాజయం చెందాయి. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `మాచర్ల నియోజకవర్గం`,  `ది వారియర్స్` చిత్రాలు  పరాజయం చెందాయి. దీంతో ఒక్కసారిగా కృతి క్రేజ్‌ తగ్గిపోయింది. దీంతో ఆఫర్లు కూడా అంత ఎగబడేలా రావడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ కేవలం నాగచైతన్యతో వెంకట్‌ ప్రభు రూపొందించే బైలింగ్వల్‌ చిత్రంలో నటిస్తుంది. 

Krithi Shetty

సాధారణంగా అనుకోకుండా, ఒక్కసారిగా వచ్చే హిట్లు హీరో, హీరోయిన్ల కెరీర్‌ని రాంగ్‌ ట్రాక్‌ పట్టిస్తుంటాయి. ఆ ఊపులో సరైనా కథలను ఎంచుకోకపోవడంతో అవి పరాజయం చెందడం,  ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా ఫేడౌట్‌ కావడం జరుగుతుంటుంది. కృతి శెట్టి విషయంలో అదే జరుగుతుందా? తన కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటుందా? అనేది చూడాలి. 
 

click me!