`కస్టడీ` ఫెయిల్‌ అయితే నా కెరీర్‌ అయిపోతుందన్నారు.. షాకింగ్‌ విషయం బయటపెట్టిన కృతి శెట్టి..

Published : Mar 18, 2024, 02:31 PM IST

కృతి శెట్టి.. టాలీవుడ్‌లోకి సునామీలా వచ్చింది. అంతే వేగంగా డౌన్‌ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది.   

PREV
16
`కస్టడీ` ఫెయిల్‌ అయితే నా కెరీర్‌ అయిపోతుందన్నారు.. షాకింగ్‌ విషయం బయటపెట్టిన కృతి శెట్టి..

`ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి.. టాలీవుడ్‌లోకి ఉప్పెనలా వచ్చింది. ఒక్క సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది. ఆ తర్వాత కుప్పలు తెప్పలుగా ఆమెకి సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రారంభంలో ఛాన్స్ లు రావడమే గొప్ప, పైగా స్టార్‌ హీరోలతో సినిమా అంటే మరో ఆలోచన చేయలేదు. వరుసగా ఐదారు సినిమాలకు సైన్‌ చేసింది. తీరా అవన్నీ బోల్తా కొట్టాయి. 
 

26

నానితో కలిసి నటించిన `శ్యామ్‌ సింగరాయ్‌` ఓ మోస్తారుగానే ఆడింది. హిట్‌ ఖాతాలో పడలేదు. నాగచైతన్యతో చేసిన `బంగార్రాజు` యావరేజ్‌గానే ఆడింది. దీంతోపాటు రామ్‌తో చేసిన `ది వారియర్స్`, నితిన్‌తో నటించిన `మాచర్ల నియోజకవర్గం`, సుధీర్‌బాబు `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగచైతన్యతో `కస్టడీ` చిత్రాలు చేసింది. ఇవన్నీ బ్యాక్‌ టూ బ్యాక్‌ విడుదలయ్యాయి. ఒక్కోక్కటిగా బోల్తా కొడుతూ వచ్చాయి. దీంతో ఎంత వేగంగా పైకి లేచిందో, ఇప్పుడు అంతే వేగంగా పడిపోయింది కృతి శెట్టి. 

36

దీంతో తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. ఈ బ్యూటీని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కృతి శెట్టి ఓ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టింది. తనని బాగా బాధిపెట్టిన ప్రశ్న ఏంటో తెలిపింది. ప్రేమ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని తెలిపింది. మీకు బాగా రెగ్యూలర్‌గా అనిపించిన ప్రశ్న, బాగా హర్ట్ చేసిన ప్రశ్న ఏది అని ప్రశ్నించగా, కృతి శెట్టి రియాక్ట్ అయ్యింది. 
 

46

తనకు రెగ్యూలర్‌గా సినిమాకి సంబంధించి స్టార్‌ హీరో, దర్శకుడు, షూటింగ్‌ ఎక్స్ పీరియెన్స్ గురించి అడుతారదని, వారితో పనిచేయడం ఎలా ఉందని తరచూ అడుగుతుంటారని, అది తనకు ఫన్నీగా అనిపిస్తుందట. ఒకవేళ షూటింగ్‌ ఎక్స్ పీరియెన్స్ బాగా లేకపోతే, ఆ విషయం చెబుతామా? అని అనిపిస్తుంటుందని వెల్లడించింది కృతి శెట్టి. 

56
Custody Movie Review

ఇక బాగా హర్ట్ చేసిన ప్రశ్న గురించి చెబుతూ, `కస్టడీ` సినిమా ఫెయిల్‌ అయితే ఇదే మీకు చివరి సినిమా అవుతుందా?, ఇక ఆఫర్లు రావా? అని అడిగారట. అది తనని బాగా బాధ కలిగించిందని తెలిపింది. అందులో కొంత నిజమే ఉన్నా, లక్కీగా తనకు ఆఫర్లు వస్తున్నాయని, బిజీగా ఉన్నట్టు తెలిపింది. తనకి అవకాశాలు ఇస్తున్నారని వెల్లడించింది, నిత్యం తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని వెల్లడించింది కృతి శెట్టి. 
 

66

కృతి శెట్టి చివరగా `కస్టడీ` చిత్రంలో నటించింది. ఈ మూవీ నిజంగానే ఆడలేదు. ఆ ప్రభావం కృతి శెట్టి కెరీర్‌పై పడింది. ఆమెకి తెలుగులో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం మలయాళంలో ఓ మూవీ, తమిళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్‌ ముఖం చాటేయగా, కోలీవుడ్‌ ఆదుకుందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories