నిజానికి మసాజ్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా పాదాల అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేయడం వల్ల చర్మానికి, శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలా మంది ఫుట్ మసాజ్ కోసం ఆవాల నూనె, కొబ్బరి, బాదం నూనెను ఉపయోగిస్తుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పచ్చిపాలతో అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే?