Karthika Deepam: సౌర్య కోసం వెతుకుతున్న కార్తీక్..తనని వదిలేయమంటూ దుర్గ ని వేడుకుంటున్న మోనిత!

First Published Oct 17, 2022, 7:27 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 17వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..దుర్గ మోనిత దగ్గరికి వచ్చి బంగారం అని పిలుస్తాడు. ఎవడ్రా నీకు బంగారం, అసలుకే నాకు మూడు బాలేదు నా దగ్గరకు వచ్చి విసిగించ వద్దు అని మోనిత అనగా, మరి అనుకున్న పని అవ్వకపోతే ఇలాగే చిరాగ్గా ఉంటారులే బంగారం అయినా ఇప్పటికిప్పుడు పిలుపు మానేయమంటే అలవాటైన పిలుపు వదలలేము కదా. ఎప్పుడు నిన్ను అలాగే పిలుస్తాను కదా అయినా రౌడీలను పంపించావు కదా దీప ను చంపడానికి అయినా మనం చంపాల్సింది దీప ను కాదు కదా.కార్తీక్ సార్ అడ్డు తొలగిస్తే మనిద్దరి మధ్య ఇంకెవరూ రారు అని చెప్పావు కదా అని అనగా మోనిత, నేను ఎవరిని పంపించలేదు నాకు ఏమి సంబంధం లేదు అని అనగా దుర్గ, నేను కార్తీక్ ని కాదు నువ్వు ఏం చెప్తే అది నమ్మైయడానికి నా దగ్గర ఫోటోలు ఉన్నాయి చూపించినా అని అనగా మోనిత దుర్గకు దండం పెడుతూ నన్ను వదిలేయరా అని బతిమిలాడుతూ ఉంటుంది. 

అప్పుడు దుర్గ కార్తీక్ ని చూసి ఇంట్లో కార్తీక్ సర్ ఉన్నారా! ఆ విషయం నాకు ముందే చెప్పాలి కదా. సర్ లేనప్పుడు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ పక్కనుంచి వింటున్న కార్తీక్ కోపంతో దగ్గరికెళ్ళి, ఆ రౌడీలను నువ్వు పంపలేదు అన్నావు మరి ఇదేంటి అని అడుగుతాడు.నిజంగా నేను పంపలేదు కార్తీక్ నన్ను నమ్ము అని మోనిత ఏడుస్తూ అంటుంది.దానికి కార్తీక్, చెప్పిందే పది సార్లు చెప్పి ఏడుస్తూ మాత్రం నిజం అబద్ధం అయిపోదు నిజంగా నువ్వే తప్పు చేయలేకపోతే మరి దుర్గకు ఎందుకలా భయపడుతున్నావు అని అడగగా నీకు ఎలా చెప్పను కార్తీక్ నీకు అర్థం కాదు అని మొనిత అంటుంది. అప్పుడు కార్తీక్ కోపంతో అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో దీప, వాళ్ళ అన్నయ్యతో ఆ మోనిత ఇంతకీ తెగిస్తాదని నేను అనుకోలేదు ఇన్ని రోజులు నా మీద కుట్ర లు పన్ని డాక్టర్ బాబుని నాకు కాకుండా చేసింది.

కానీ ఎప్పుడూ చంపడం వరకు వచ్చింది లేదు అని అనగా దీప వాళ్ళ అన్నయ్య, ఇన్ని రోజులు కార్తీక్ దక్కుతాడని చిన్న ఆశ ఉన్నట్టున్నది అమ్మ ఎప్పుడైతే నిన్ను దుర్గని కలిపి చూసిందో అప్పటినుంచి తన ఆశలు చచ్చిపోయి నిన్ను చంపేద్దామని ప్లాన్ వేసినట్టున్నది అని అంటుంది. ఆ తర్వాత సీన్లో కార్తీక్,కిందటిసారి శౌర్య బొమ్మలు కొన్నప్పుడు ఎక్కడ ఉన్నది ఆ చోటికి వచ్చి శౌర్య కోసం పూర్తిగా వెతుకుతాడు కానీ ఎక్కడ సౌర్య దొరకదు. పక్కనున్న బండి వాళ్ళతో శౌర్య వాళ్ళ గురించి అడగగా,వాళ్ళు ప్రతిరోజు రారు సార్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అని వాళ్ళు చెప్తారు. అప్పుడు కార్తీక్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత సీన్లో దుర్గ మోనిత ఇంట్లో దర్జాగా కూర్చుంటాడు.మోనిత అక్కడికి కోపం గా వస్తుంది.అప్పుడు దుర్గ మోనితతో, ఏంటి బంగారం కోపంగా చూస్తున్నావు నన్ను చంపేయాలి అనుకుంటున్నావా కానీ ఇప్పుడు నువ్వు నాకు ఏదైనా చేస్తే కార్తిక్ సర్ దగ్గర నీ మీద ఉన్న అనుమానం నిజమవుతుంది ఇంక నీ ఇష్టం అని అనగా మోనిత ఏడుస్తూ దుర్గ కాళ్ళ మీద పడి, నన్ను వదిలే దుర్గ ప్లీజ్ నువ్వా దీపకు సపోర్ట్ చేస్తే నీకు ఏమొస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను నీకు చాలా డబ్బు ఇస్తాను నాకు హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి నీకేం కావాలన్నా ఇస్తాను ప్లీజ్ అని ఏడుస్తూ వేడుకుంటుంది.

 అప్పుడు దుర్గ నవ్వుతూ ఉంటాడు అదే సమయంలో దీప కూడా అక్కడికి వస్తుంది దీప కూడా నవ్వుతూ ఉంటుంది. అప్పుడు దుర్గ, చూసావా దీపమ్మ కాళ్ళ మీద పడి ఎలా వేడుకుంటుందో అని అనగా, మరి నాకు ఇదే గతి పట్టినప్పుడు నేనేమైపోవాలి దుర్గా దీనివల్ల డాక్టర్ బాబు నాకు 10 సంవత్సరాలు దూరంగా ఉన్నారు అని దీప అంటుంది. దానికి దుర్గ, అయినా నీ మీద అనుమానం రాగానే వెంటనే నిన్ను వదిలేశారు కానీ ఇన్ని అనుమానాలు తెపిస్తున్నా మోనిత వదలలేదంటే ఇప్పటికి వచ్చి మోనిత తన భార్యని అనుకోవడం లేనట్టే కదా అని అనగా మోనిత కోపంతో ఉంటుంది. దీప నవ్వుతూ, నువ్వు డాక్టర్ బాబా భార్యవని డాక్టర్ బాబుని నమ్మించినా డాక్టర్ బాబు మనసు స్వీకరించలేక పోతుంది అది నీ స్థానం. అయినా దుర్గ నువ్వు ఏమాత్రం తగ్గొద్దు వీలైన ప్రతిసారి దీని మీద అనుమానం వచ్చేలా చేయు ఇంక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మోనితకి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నేను కార్తీక్ కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించి కొత్త మనుషులను సృష్టించి అంతా నమ్మిస్తే చివరి నిమిషంలో వీళ్ళు వచ్చి నా ప్లాన్ అంతా చెడగొడుతున్నారు.

అసలు నేను వీళ్ళకి ఎం ద్రోహం చేసానని దీని కోసమా నేను నేను పదేళ్ల నుంచి ఇలా ఉంటున్నాను. అసలు ఎందుకు నాకు ఎలా జరుగుతుంది. కార్తీక్ ఇదంతా అబద్ధమని నమ్మించడానికి కూడా ఆధారాలు అడుగుతారు ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఎక్కడినుంచి వస్తాయి. కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు బయట ఉన్నా టెన్షన్ ఇంట్లో వచ్చిన టెన్షన్.ఇంటికి వస్తే అనుమానాలతో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడు బయటకు వెళ్తే ఆ వంటలక్క ఉంటుంది ఏంటో అని అనుకుంటుంది మోనిత.ఆ తర్వాత సీన్లో శౌర్య కోసం అంతా వెతికి కార్తీక్ తిరిగి దీప దగ్గరికి వస్తాడు.
 

అప్పుడు దీప, పడుకోని ఉండడం చూసి కిటికీలోని కార్తీక్ దీపతో,ఇన్ని కష్టాలు వచ్చి కూడా నాతోనే ఉంటున్నావు దీప.ఆ మోనిత వల్ల పదేళ్లు నిన్ను దూరం పెట్టాను ఇప్పుడు నాకు గతం గుర్తొచ్చి నిన్ను తీసుకెళ్ళి పోదాం అనుకుంటే శౌర్య ఇక్కడే ఉన్నది. శౌర్య మన కోసం ఎదురుచూస్తుంది. అయినా ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్లిపోయినా  మోనిత వెనకాతలు రాదు అని నమ్మకం లేదు కనుక గట్టిగా బుద్ధి చెప్పిన తర్వాతే వెళ్దాము అని అనుకుంటాడు కార్తీక్. ఆ తర్వాత సీన్లో మోనిత శివని పిలిచి సర్ ఎక్కడా అని అడగగా, ఏ సార్ మేడం దుర్గా సారా లేకపోతే కార్తీక్ సార అని శివ అంటాడు.
 

దానికి మోనిత శివ చంప మీద కొట్టి, దుర్గ సార్ ఏంట్రా అని అనగా, శివ మనసులో మరి రాసుకొని పోసుకొని తిరిగితే అలాగే అనుకుంటారు అని అనుకుంటాడు. అప్పుడు శివ, సార్ బయట ఎక్కడ లేరు మేడం మాకు కనిపించలేదు అని అనగా, పోనీలే ఇంటికి రాకపోవడమే మంచిది ఎప్పుడు నచ్చితే అప్పుడు వస్తాడు ఏం బలవంతం లేదు ఇంట్లో ఉండడం కన్నా బయట ప్రశాంతంగా ఉండటమే మంచిది కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.అప్పుడు శివ, ఎప్పుడూ ఇంటికి రాకపోతే కంగారు పడే మేడం ఈరోజు ఎందుకు ఇలా ఉన్నారని అనుకుంటాడు.
 

 ఆ తర్వాత సీన్లో దీప ఉదయాన్నే లేచి దేవుడికి దండం పెట్టి తలుపులు తీసి బయటకు వస్తుంది. అదే సమయంలో కార్తికే అక్కడ కూర్చుని ఉంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడవలసిందే!

click me!