టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీ బిజీ.. ఏపీలో ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో.. ఏమాత్రం తీరిక లేకుండా ప్రచారం లో మునిగిపోయి ఉన్నారు పవన్. కూటమిగా ముందుకు వెళ్తూ.. ప్రభుత్వం ఫామ్ చేయడమేలక్ష్యంగా ఆయన దూసుకుపోతున్నారు. ఇక ఎలక్షన్స్ అయిపోయే వరకూ ఆయన తన షూటింగ్స్ కు విరామం ఇచ్చారు. రిజల్ట్ తరువాత కొన్నాళ్లు రెస్ట్ తీసుకుని మళ్ళీ సెట్స్ మీదకు వెళ్ళాలని చూస్తున్నారు పవర్ స్టార్.
పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ పేరు రాజకీయాల్లో కూడా మారుమ్రోగిపోతోంది. ఈక్రమంలో ఆయన చాలా ఒత్తిడిలో ఉంటారు. అలసిపోయి ఉంటారు. సాధారణంగా షూటింగ్ లో అలసి పోయి రావడం వేరు.. ఎన్నికల ప్రచారాలు, ప్రయణాలు, పర్యటనలు, సమ్మర్ కావడంతో నడి ఎండలో తిరగడం ఎంతో రిస్క్ తో కూడిన వ్యవహారం. మరి ఈ ఒత్తిడిలో రాత్రి నిద్ర పట్టకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో తెలుసా.. ?
2000 కోట్ల ఆస్తి ఉన్న హీరో.. కాని చిన్న గదిలో సంసారం.. సైకిల్ పై షూటింగ్ కు.. ఎవరో తెలుసా..?
చాలామందికి తెలుసు.. పవన్ కు పుస్తకాలంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఎన్నో బుక్స్ చరివారు పవర్ స్టార్. ఇక తనకు రాత్రివేళలో నిద్రపట్టకపోతే వెంటనే మంచ బుక్ ఒకటి తీసుకునిచదువుతారట. ఎంతో ఇంట్రెస్ట్ గా బుక్ ను చదివితే.. వెంటనే నిద్ర వచ్చేస్తుందంటారు పవన్. అయినా సరే కొన్ని పేజీలు చదివిన తరువాత అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారట స్టార్ హీరో.
బుక్స్ చదివితే ఎన్నో విషయాలు తెలియడంతో పాటు.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది అంటారు పవన్. అందుకే ఎంత ఒత్తిడిలో ఉన్నా.. పుస్తకాలు చదవడం మాత్రం ఆపరట పవర్ స్టార్. అంతే కాదు చాలా ప్రశాంతంగా కనిపించే జనసేనాని.. అప్పుడప్పుడు రాత్రివేళలో హర్రర్ పిక్చర్స్ చూసే అలవాటు కూడా ఉందట పవన్ కళ్యాణ్ కు.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహరవీరమల్లు సినిమాతో పాటు.. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. హరిహర వీరమల్లు సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈసినిమా నుంచి క్రిష్ తప్పకోవడంతో.. ఆయన ఆద్వర్యంలో మరో ద్శకుడు మిగిలిన సినిమాను కంప్లీట్ చేయబోతున్నారు.