`హీరోయిన్‌` చిత్రంలో న్యూడ్‌ సీన్స్ చేసిన కరీనా.. ఐశ్వర్యా రాయ్‌ చేయకపోవడానికి కారణమేంటి?

First Published Apr 28, 2021, 3:34 PM IST

బేబో కరీనా కపూర్‌ `హీరోయిన్‌` సినిమాలో న్యూడ్‌గా కనిపించి, పలు రొమాంటిక్‌ సీన్‌లోనూ నటించి షాక్‌ ఇచ్చింది. అదే మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ మాత్రం చేయలేకపోయింది. అందుకు కారణాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

బాలీవుడ్‌లో బికినీ సీన్లు, రొమాంటిక్‌ సీన్లు చాలా సర్వసాధారణం. ఇతర భాషలకు ఆయా సీన్లని పరిచయం చేసింది బాలీవుడ్‌ అనే చెప్పాలి. న్యూడ్‌ సీన్లు కూడా చాలా సినిమాల్లో చూడొచ్చు. హీరోయిన్లు ధైర్యం చేసి మరీ ఆయా సీన్లల్లో నటించారు. వారిలో స్టార్‌ హీరోయిన్లు కూడా ఉన్నారు. కరీనా కపూర్‌ కూడా ఒకరు.
undefined
ఆమె ప్రముఖ విలక్షణ దర్శకుడు మధూర్‌ భండార్కర్‌ రూపొందించిన `హీరోయిన్‌` చిత్రంలో నటించింది. ఓ స్టార్‌ హీరోయిన్‌ జర్నీలోని ఆటుపోట్లు, తెర వెనుక జరిగే విషయాలను సైతం తెలిపే చిత్రమిది.
undefined
ఇందులో అద్భుతమైన నటనతో మెప్పించింది కరీనా కపూర్‌. స్టార్‌ హీరోయిన్‌గా, తన జీవితంలో స్ట్రగుల్స్ పడే అమ్మాయిగా విలక్షణ నటనతో బాలీవుడ్‌ ఆడియెన్స్ ని ఫిదా చేసింది. ప్రశంసలందుకుంది.
undefined
అయితే ఇందులో ఆమె పలు సన్నివేశాల్లో న్యూడ్‌గానూ, మరికొన్ని సెక్స్ సన్నివేశాల్లోనూ కనిపించడం విశేషం. అప్పట్లో చాలామంది కరీనా ఇలాంటి పాత్ర చేయడంపై ఆశ్చర్యానికి వ్యక్తం చేశారు. షాక్‌కి గురయ్యారు.
undefined
ఆయా సన్నివేశాలు తరచూ వైరల్‌గా మారుతుంటాయి. నెటిజన్లు వాటిని బయటకు తీసి మరీ వైరల్‌ చేస్తుంటారు. అప్పట్లో ఇలా చేసిందంటూ కామెంట్లు, మీమ్స్, ట్రోల్స్ చేస్తుంటారు. అలా ఇటీవల కాలంలో కరీనా నటించిన `హీరోయిన్‌` సినిమాని న్యూడ్‌ సీన్లని వైరల్‌ చేస్తున్నారు.
undefined
ఈ సందర్భంగానే పలు కొత్త విషయాలు బయటకు వచ్చాయి. దర్శకుడు మధూర్‌ భండార్కర్‌ కరీనాతో `హీరోయిన్‌` సినిమా చేయడానికి ముందు మరో ఐశ్వర్యరాయ్‌ని హీరోయిన్‌ అనుకున్నారు. ఆమెచేత కేన్స్ లో ఫస్ట్ లుక్‌ కూడా విడుదల చేయించారు. ఆ సమయంలోనే ఇదొక బాలీవుడ్‌ హీరోయిన్‌ తెరవెనుక కథ అని అంతా అనుకున్నారు. కాస్త వివాదంగానూ మారింది.
undefined
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌తో సినిమా అంటే అంతా అటెన్షన్‌ క్రియేట్‌ అయ్యింది. అయితే అదే సమయంలో ఐశ్వర్య తాను ప్రెగ్నెంట్‌ అని ప్రకటించింది. అంతేకాదు కొద్ది రోజుల్లోనే తన బాడీలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ సినిమా చేయలేనని చెప్పేసింది. అలా ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.
undefined
ఆ తర్వాత వెంటనే కరీనాతో `హీరోయిన్‌` ని తెరకెక్కించాడు మధూర్‌ భండార్కర్‌. ఇందులో అంత బోల్డ్ గా నటించేందుకు కరీనా ఒప్పుకోవడం సంచలనంగా మారింది. పైగా అప్పుడే ఆమె సైఫ్‌ అలీ ఖాన్‌ని పెళ్లి చేసుకోబోతుంది. మ్యారేజ్‌కి నెల రోజుల ముందే ఈ సినిమా విడుదలైంది.
undefined
ఇంతటి బోల్డ్ రోల్‌ చేయడంపై కరీనా స్పందిస్తూ, తాను ఏం చేసినా పాత్రకి న్యాయం చేస్తా. నటిగా సినిమాకి నా బెస్ట్ ఇవ్వడమే నా అంతిమ లక్ష్యం. అదే ఎలాంటి పాత్ర అయినా సరై అని, అందులో భాగంగానే `హీరోయిన్‌`లో ఆ పాత్ర చేశానని తెలిపింది.
undefined
సో ఇలా తాను చేసిన పాత్రని సమర్ధించుకుంది కరీనా. అయినా ఈ సినిమా ప్రభావం సైఫ్‌తో మ్యారేజ్‌ విషయంలోగానీ, లవ్‌ విషయంలోగానీ ఎలాంటి ప్రభావం చూపలేదు. సినిమా వేరు, లైఫ్‌ వేరు అనే దృష్టిలోనే సైఫ్‌ చూడగలగడం వల్లే అంతా సాఫీగా సాగింది.
undefined
సైఫ్‌, కరీనాలకు ఇప్పటికే కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌ జన్మించాడు. ఇటీవల ఆమె రెండో కుమారుడికి జన్మనిచ్చింది. మరోవైపు అమీర్‌ ఖాన్‌తో కరీనా `లాల్‌ సింగ్‌ చద్దా` సినిమా చేస్తుంది.
undefined
click me!