ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్‌ బస్టర్‌ మూవీస్.. అవి కూడా చేసుంటేనా?

First Published May 9, 2020, 12:05 PM IST

ఒక్కోసారి మన హీరోల అంచనాలు తల కిందులు అవుతుంటాయి. తాము రిజెక్ట్ చేసిన కథలుకూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయి నిరాశపరుస్తుంటాయి. అయితే ఆ సమయంలో హీరోల ఇమేజ్‌, వారి ఆలోచన ఆ కథలను రిజెక్ట్ చేసేలా చేసినా.. ఆ సినిమా సక్సెస్‌ అయిన తరువాత మాత్రం హీరోలతో పాటు అభిమానులు కూడా నిరాశ చెందటం కామన్‌. అలా ఎన్టీఆర్‌ రిజెక్ట్ చేసిన దాదాపు 10 సినిమాలు సూపర్‌ హిట్స్ కావటం విశేషం.

వినాయక్ దర్శకత్వంలోొ నితిన్‌ హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా దిల్. ఈ కథను వినాయక్‌ ముందుగా ఎన్టీఆర్‌కే వినిపించాడట.అయితే ఎన్టీఆర్‌ ఇంట్రస్ట్‌ చూపించకపోవటంతో ఆ మూవీ నితిన్‌ చేతికి వెళ్లింది. సూపర్‌ హిట్ అయ్యింది.
undefined
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా ఆర్య. డిఫరెంట్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నాడు సుకుమార్‌. కానీ తన ఇమేజ్‌కు బాడీ లాంగ్వేజ్‌కు ఈ కథ సూట్ అవ్వదన్న ఉద్ధేశంతో ఎన్టీఆర్‌ ఈ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేశాడు.
undefined
కళ్యాన్ రామ్‌ను హీరోగా నిలబెట్టిన తొలి హిట్ సినిమా అతనొక్కడే. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా ఎన్టీఆర్‌తో చేయాలని భావించాడు సురేందర్‌. కానీ అన్న కోసం ఎన్టీఆరే ఈ కథను త్యాగం చేశాడన్న టాక్ వినిపించింది.
undefined
వివి వినాయక్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా కృష్ణ. ఈ సినిమా కథను కూడా ముందుగా ఎన్టీఆర్‌ కే వినిపించాడట వినాయక్‌. కానీ అంత కామెడీ తనకు వర్క్ అవుట్ కాదేమో అన్న ఉద్దేశంతో ఎన్టీఆర్‌ ఆ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేశాడు.
undefined
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భద్ర సినిమా కూడా ముందుగా ఎన్టీఆర్ దగ్గరకే వచ్చింది. అయితే అప్పట్లో వరుస సినిమాలతో ఎన్టీఆర్‌ బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేశాడు.
undefined
ఎన్టీఆర్‌ మిస్‌ అయిన మరో సూపర్‌ హిట్ సినిమా కిక్‌. రవితేజ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ముందుగా ప్రభాస్‌తో చేయాలనుకున్నాడు దర్శకుడు. ప్రభాస్ నో చెప్పటంతో ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది. ఎన్టీఆర్ కూడా రిజెక్ట్ చేయటంతో చివరకు రవితేజ హీరోగా తెరకెక్కి సూపర్‌ హిట్ అయ్యింది.
undefined
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలోతెరకెక్కిన శ్రీమంతుడు సినిమాను కూడా ముందుకు ఎన్టీఆర్‌తోనే చేయాలని భావించాడట. అయితే ఎన్టీఆర్ అప్పటికే కమిట్‌ అయిన ప్రాజెక్ట్స్ కారణంగా ఈ సినిమా చేయలేకపోయాడు.
undefined
ఫ్రెంచ్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన సూపర్‌ హిట్ తెలుగు సినిమా ఊపిరి. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ స్థానంలో ముందుగా ఎన్టీఆర్‌ను అనుకున్నారు. ఎన్టీఆర్‌ కూడా ఆ పాత్ర చేసేందుకు ఓకే చెప్పినా.. చివరి నిమిషంలో డేట్లు సర్దుబాటు కాకపోవటంతో ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు.
undefined
ఎన్టీఆర్‌ మిస్‌ అయిన మరో సూపర్‌ హిట్ సినిమా రాజా ది గ్రేట్‌. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కథను ముందుగా ఎన్టీఆర్ కు వినిపించాడు. ఎన్టీఆర్ రిజెక్ట్ చేయటంతో తరువాత రామ్ దగ్గరకు వెళ్లింది సబ్జెక్ట్. రామ్ ముందుగా చేయాలని భావించినా వరుస ఫ్లాప్‌ల నేపథ్యంలో రిస్క్ అని పక్కన పెట్టేశాడు. దీంతో ఫైనల్‌గా రవితేజ చేతికి వెళ్లిన రాజా ది గ్రేట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
undefined
click me!