జ్యూస్‌ పిండటం కూడా ఇంత హాట్‌గానా.. అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్‌

First Published Aug 23, 2021, 8:33 PM IST

అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్‌ క్రేజీ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంటోంది. శ్రీదేవి తనయగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. అందుకోసం తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. 
 

జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. రోజుకి రెండు మూడు పోస్టులైనా, గ్లామర్‌ ఫోటోలైన పంచుకోనిదే ఉండదు. అలా నెట్టింటి అభిమానులు ఖుషీ చేస్తుంది జాన్వీ. 
 

ఓనం(కేరళా వాళ్లు జరుపుకునే పండుగ) సందర్భంగా జాన్వీ కపూర్‌ ట్రెడిషనల్‌గా లెహంగా ఓణీలో మెరిసింది. చిరునవ్వులు చిందిస్తూ అభిమానులకు ఓనం శుభాకాంక్షలు తెలిపింది. 

ఈ సందర్భంగా పంచుకున్న జాన్వీ కపూర్‌ ట్రెడిషనల్‌ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎప్పుడూ గ్లామరస్‌గా కనిపించే జాన్వీ ఒకేసారి ఇలా ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. 
 

ఆయా పిక్స్ ని వరుసగా షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. సాంప్రదాయ దుస్తుల్లోనూ ఎంతో అందంగా ఉంది జాన్వీ కపూర్‌. దీంతో అప్పుడప్పుడు ఇలాంటి దుస్తులు కూడా ధరించండి అంటూ కామెంట్‌ చేస్తున్నారు 
నెటిజన్లు. 
 

మరోవైపు జ్యూస్‌ వీడియోని షేర్‌ చేసుకుంది జాన్వీ. ఇందులో ఆమె జ్యూస్‌ పిండే మిషన్‌ ని వద్ద రెండు రకాల గెటప్‌ల్లో కనిపించింది. అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటోంది. 

అంచనాలకు, రియాలిటీకి ఉన్న తేడాని ఓ వైపు జ్యూస్‌ రూపంలో, మరోవైపు తన గ్లామర్‌ షో విషయంలో చూపించింది. మొత్తంగా జ్యూస్‌ తక్కువ, అందాల ఆరబోత ఎక్కువ అనేట్టుగా ఉంది జాన్వీ పోజులు. 

ప్రస్తుతం ఈ వీడియో క్లిప్పులు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, నెటిజన్లని కనువిందు చేస్తున్నాయి. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయి. 
 

`దఢఖ్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన జాన్వీ కపూర్. ఆ మధ్య వచ్చిన `గుంజన్‌ సక్సేనా`లో అందరి చేత తన నటన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇక `రూహి` చిత్రంలో రెండు విభిన్న షేడ్స్ ఉన్నపాత్రలో మెస్మరైజ్‌ చేసింది. 
 

ప్రస్తుతం జాన్వీ కపూర్‌ `దోస్తానా 2`, `గుడ్‌ లక్‌ జెర్రీ`, `మిలి` చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలన్ని విభిన్న నేపథ్యంతో కూడిన చిత్రాలు కావడం విశేషం. 

click me!