Janaki kalaganaledu: మల్లిక గర్భవతి కాదని తెలుసుకున్న జానకి.. డాక్టర్ రావడంతో చెట్టు ఎక్కిన మల్లిక?

First Published Oct 27, 2022, 12:18 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 27వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. మల్లిక గోవిందరాజుకి పర్స్ ఇచి అక్కడ నుంచి వెళ్లిపోవాలి అని అనుకుంటుంది. అదే సమయంలో డాక్టర్ అక్కడికి వస్తుంది. రామ డాక్టర్ ని లోపలికి తీసుకురావడానికి వస్తున్నప్పుడు మల్లికను చూస్తాడు. మల్లికా లోపలికి రా బయట ఏం చేస్తున్నావు అని లోపలికి తీసుకొని వచ్చేస్తాడు. అప్పుడు డాక్టర్ జెస్సిని పరీక్షించి దీనికి ఆరోగ్యం సరిగ్గా లేదు పోషణ కడుపు వరకు వెళ్లడం లేదు నేను ముందే చెప్పాను కదా తిన పరిస్థితి గురించి మన హాస్పటల్లో అంతలా చెప్పినా కూడా ఇంకా మీరు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటున్నారు అని అంటుంది. 
 

దానికి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యానికి గురవుతారు ఇక్కడేదో తేడా కొడుతుంది అని మల్లికా అనుకుంటుంది. అప్పుడు జానకి సైగ చేస్తూ చేతులు దండం పెట్టి చెప్పొద్దు అని అంటుంది. అప్పుడు డాక్టర్ కి జానకి ఇంట్లో వాళ్లకి విషయం చెప్పద్దు అన్న మాటలు గుర్తొచ్చి మీకు కాదు జెస్సి లాగే ఒక అమ్మాయికి మొన్న నేను ట్రీట్మెంట్ చేశాను తన గురించి మీకు చెప్తున్నాను సారీ అని చెప్పి మందులు ఇస్తుంది. అదే సమయంలో మల్లిక, ఇక్కడ ఉంటే ఇంక నా కడుపు గురించి ప్రస్తావన వస్తుంది వెళ్ళిపోవడం మంచిది అనుకొని అక్కడ నుంచి తప్పించుకుంటుంది.
 

 గది నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక చెట్టు ఎదురుగుండా నిచ్చెన వేసుకొని చెట్టు మీద ఎక్కి కూర్చుంటుంది. అదే సమయంలో జెస్సికి వైద్యం అందించి ఇంక వెళ్ళిపోదాం అనుకున్న డాక్టర్ని జానకి ఆపి, మా ఇంట్లో మల్లిక కూడా గర్భవతి ఒకసారి తనకి కూడా చెక్ అప్ చేయమని చెప్తుంది. అప్పుడు మల్లిక ఏది అని మల్లిక కోసం వెతుకుతారు. మల్లిక చెట్టు మీద ఉండడం వలన ఎవరూ చెట్టు మీదను గమనించరు మల్లిక కనిపించలేదు అని చెప్తాడు విష్ణు. అప్పుడు డాక్టర్ నాకు టైం అవుతుందమ్మా మళ్లీ సార్ వచ్చినప్పుడు తనని చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. 
 

మల్లిక ఎక్కడికి వెళ్ళింది అనుకొని అందరూ అనుకుంటారు అప్పుడు జానకి డాక్టర్ ని ఇంటి బయట దేపెడుతుంది. హమ్మయ్య డాక్టర్ వెళ్లిపోయారు అనుకుంటుంది మల్లిక. అదే సమయంలో గోవిందరాజు ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఈ నిచ్చెన ఇక్కడ ఎవరు పెట్టారు అనుకోని నిచ్చెన ని అక్కడి నుంచి తీసేస్తాడు. మల్లిక చెట్టు మీదకి ఎక్కి కిందకి ఎలా దిగాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో చెట్టు ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చున్న జానకి మల్లిక ఏంటి అలా వెళ్ళిపోయింది ఎక్కడున్నది అని అనుకుంటుంది. అదే సమయంలో మల్లిక కిందకు దిగడానికి ప్రయత్నించగా జానకి మల్లికను చూస్తుంది.
 

 మల్లిక హాయ్ అని నవ్వుతూ అంటుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మల్లికా అని జానకి అడగగా ముందు నన్ను కిందకి దించు జానకి  ఎలా దిగాలో తెలియడం లేదు అని మల్లిక అంటుంది. నిచ్చన లేదా అని చూసేసరికి అక్కడున్నది నిచ్చన అని మల్లిక చెప్పింది.  అప్పుడు నిచ్చన పెట్టి అక్కడి నుంచి దింపుతుంది జానకి. మల్లిక అక్కడి నుంచి వెళ్లిపోదామని చూసేసరికి జానకి ఆపి అక్కడ ఏం చేస్తున్నావ్ మల్లిక అని అనగా వేపాకులకు కోస్తున్నాను నాకు వేపరసం తాగాలని ఉన్నది అని అంటుంది. మొన్న నీకు వేపరసం వచ్చినప్పుడు నీకు వేపాకు నచ్చదు అని చెప్పావు కదా అని అడుగుతుంది జానకి.
 

  నువ్వు చెప్పిన తర్వాత నేను ఆలోచించాను అది మంచిదనిపించింది అందుకే కోయడానికి వెళ్లాను అని అనగా అక్కడికి వెళ్తే మరి ఆకులు ఎందుకు దిగడానికి ఎవరిని ఎందుకు పిలవలేదు. నిచ్చన తీస్తున్నప్పుడు కూడా ఆపలేదు ఎందుకు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. లాయర్ లాగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది అనుకొని జానకి నాకు దాహంగా ఉన్నది వచ్చి నీతో మాట్లాడుతాను అని కంగారుగా అటువైపు నుంచి వెళ్ళిపోతుంది మల్లిక. అప్పుడు జానకి,  ఎందుకు అంత భయపడుతుంది అయినా గర్భవతిలో ఉండవలసిన ఒక క్వాలిటీ కూడా మల్లికలో లేదు. 
 

అసలు గర్భవతిలా ప్రవర్తించడం లేదు ఒకవేళ గర్భవతి అని నాటకం ఆడుతుందా తెలుసుకోవాలి అని జానకి అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!