తమిళ చిత్ర పరిశ్రమలో రెడిన్ కింగ్స్ లీ క్రేజీ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. రజనీకాంత్ జైలర్ చిత్రంతో రెడిన్ పేరు తెలుగులో కూడా బాగా వినిపించింది. సౌత్ లో రెడిన్ క్రమంగా పాపులర్ అవుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో రెడిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసులో రెడిన్ బుల్లితెర నటి సంగీతని వివాహం చేసుకున్నాడు.