Janaki Kalaganaledu: షాప్ తాకట్టు పెట్టడానికి ఒప్పుకోని జ్ఞానాంబ.. అప్పు కోసం తిప్పలు పడుతున్న రామచంద్ర?

First Published Jan 4, 2023, 1:00 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 4వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈ రోజు ఎపిసోడ్ లో రామచంద్ర,జానకి, జ్ఞానాంబ దగ్గరికి షాపు కాగితాలు తీసుకుని వెళ్లడంతో వాళ్లను చూసి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా అమ్మ ఏదో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు రామచంద్ర. నేను తప్పు చేశాను, అప్పు చేశాను కానీ సమస్యను నేనే పరిష్కరిస్తాను ఈరోజు ఇల్లు పోయే పరిస్థితి వచ్చింది. చేసిన అప్పు తీర్చడానికి నాకు ఎంత ఆలోచించినా ఒకటే మార్గం కనిపిస్తుంది అనడంతో అప్పుడు గోవిందరాజులు ఏంటి రామ అది అని అడగగా స్వీట్ కొట్టు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం అనుకున్నాను అనడతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఇంతలోనే కోపంతో మల్లిక అక్కడికి వస్తుంది.
 

వెటకారంగా మాట్లాడిస్తూ ఏం మాట్లాడుతున్నారు బావగారు ఇంటి అప్పు తీర్చడానికి షాప్ ని తాకట్టు పెడతారా, మళ్లీ షాప్ ని విడిపించడానికి ఇంటిని తాకట్టు పెడతారా అంటూ  వచ్చిన విధంగా మాట్లాడుతుంది మల్లిక. ప్రస్తుత సమస్య నుంచి బయటపడాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా మల్లిక అనడంతో ఏం చేయాలో ఇలా చేయాలో అప్పు చేసిన వారికి తెలుసులే మామయ్య అని అంటుంది మల్లిక. మనకు జీవన ఆధారంగా ఉన్న షాప్ ని తాకట్టు పెడతాను అంటే ఎలా కుదురుతుంది చెప్పండి అని అంటుంది. అప్పుడు విష్ణు మౌనంగా ఉండు మల్లిక అనడంతో మరింత రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది.
 

అప్పుడు జెస్సి సమస్యను అందరూ పరిష్కరించుకోవాలి కానీ ఇలా పెద్దది చేయొచ్చా అక్క అని అడగగా జెస్సీ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా నువ్వు మౌనంగా ఉండు అని అంటాడు అఖిల్. అప్పుడు జానకి ఇంటి పోయే పరిస్థితి వచ్చింది కదా మల్లిక ముందు ఈ అప్పు తీరితే తర్వాత షాప్ గురించి ఆలోచించవచ్చు అని అంటుంది. అప్పుడు మల్లిక వెటకారంగా మాట్లాడుతూ  మనమంతా ఒకటే ఇంట్లో కలిసి ఉన్నామన్న విషయం గురించి పరువు గురించి ఇల్లు పేపర్లు తాకట్టు పెట్టినప్పుడు గుర్తు రాలేదా జానకి అని అడుగుతుంది. అప్పుడు మల్లిక నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండగా అప్పుడు రామ ఇల్లు మనకు దక్కాలి అంటే నన్ను అర్థం చేసుకోని ఇల్లు తాకట్టు పెట్టడానికి అందరూ ఒప్పుకోండి అని అంటాడు రామచంద్ర.
 

అప్పుడు జ్ఞానాంబ రామచంద్ర మాకు తెలియకుండా అప్పు చేశావు ఇంట్లోకి రాకూడని వాదనలు వినిపించుకోడని మాటలు వినిపించేలా చేశావు. ఇప్పుడు కొట్టు తాకట్టు పెట్టి ఇంకొక తప్పు చేయకు ఆ కాగితాలు అక్కడ పెట్టి వెళ్ళిపో అని అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత రామచంద్ర జరిగిన విషయాలు తలచుకొని ఏమి చేయాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి జానకి వస్తుంది. ఎప్పుడు డబ్బు కూడా పెట్టుకోవాలి అని ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఎందుకు అందరూ నన్ను దోషిగా చేసి మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటాడు రామచంద్ర.
 

ఇప్పుడు జానకి ఏంటి అమ్మగారు చిన్న పిల్లల బాధపడుతున్నారు కష్టం వచ్చినప్పుడు అయిన వాళ్లు కూడా కాని వాళ్ళలాగే మాట్లాడతారు అటువంటి సమయంలో ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని అంటుంది. అప్పుడు రామచంద్ర కు ధైర్యం చెబుతూ ఉంటుంది జానకి. షాప్ తాకట్టు పెడితే ఎంతో కొంత వస్తే కొంచెం అడ్జస్ట్ అవుతుంది అనుకుంటే అమ్మ కూడా అలా మాట్లాడే సరికి నేను తట్టుకోలేకపోతున్నాను జానకి గారు అని అంటాడు రామచంద్ర. అత్తయ్య గారు ఇంటి పెద్ద అయిన  కొన్ని కొన్ని సార్లు అందరి మాటలకు తల వంచక తప్పదు కదా అని అంటుంది. సరే జానకి గారు నేను డబ్బుల కోసం వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు రామచంద్ర. 

తర్వాత గదిలోకి వెళ్లిన విష్ణు జరిగిన విషయాలు తలుచుకుని ఆలోచిస్తూ ఇంతలో తన స్నేహితునికి ఫోన్ చేసి నాకు ఒక పది లక్షలు కావాలి అని అడుగుతూ ఉండగా ఇంతలోనే మల్లిక అక్కడికి వస్తుంది. ఎందుకోసం మీరు డబ్బులు అడుగుతున్నారు అని అడగగా తెలిసి కూడా అడుగుతావేంది మల్లిక ఈ సమయంలో నేను మా అన్నయ్యకు తోడుగా ఉండాలి. నాన్న కు కూడా టెన్షన్తో పక్షవాతం వచ్చింది ఇటువంటి సమయంలో అన్నయకు తోడు లేకపోతే బాగుండదు అనడంతో ఇంత అమాయకంగా ఉన్నారేంటండీ. ఇటువంటి పిచ్చి పనులు చేయకండి అంటూ మల్లిక విష్ణు మనస్సును చెడగొడుతుంది.
 

మరొకవైపు జెస్సి అఖిల్ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు జెస్సి జానకి వాళ్లకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో అఖిల్ సీరియస్ అవుతాడు. నీ విషయంలో బావ గారు చేసింది నిజమే అనిపిస్తుంది అనగా అంటే అన్నయ్య నాకోసం 20 లక్షలు చేశారని నువ్వు నమ్ముతున్నావా అనడంతో కచ్చితంగా నమ్ముతాను అని అంటుంది జెస్సి. అప్పుడు జెస్సి నమ్మకంగా మాట్లాడడంతో ఈ నమ్మకాలు అడ్డుపెట్టుకొని మన జీవితాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు జెస్సి అని అంటాడు. రెండు రోజుల్లో బావగారు అంత అమౌంట్ ఎలా అడ్జస్ట్ చేస్తారు నువ్వు కూడా చూడొచ్చు కదా అంటూ మంచిగా సలహాలు ఇస్తుంది జెస్సీ.
 

ఎన్నైనా చెప్పు జెసి ఇదంతా వదిన ప్లానే తన తెలివితేటలతోనే అన్నయ్యని పిచ్చివాన్ని చేసి ఇలా ఆడుకుంటుంది అంటూ జానకిని తప్పుగా మాట్లాడుతాడు అఖిల్. జానకి అక్క అలాంటిది కాదు అనడంతో వదిన ఇలాంటిదో నాకు బాగా తెలుసు నువ్వు సలహాలు ఇవ్వకు అని సీరియస్ అవుతాడు అఖిల్. మరొకవైపు రామచంద్ర ఒక అతను దగ్గరికి డబ్బుల కోసం వెళ్లగా అంత డబ్బులు సరే లేవు అనడంతో సరే అని బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రామచంద్ర. మరొకవైపు డాక్టర్ గోవిందరాజులు కి చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అందరూ డాక్టర్ వైపు అలాగే చూస్తూ ఉంటారు. జ్ఞానాంబ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ చెక్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

click me!