హాట్ సిట్టింగ్ ఫోజులో జబర్దస్త్ వర్ష గ్లామర్ షో... హీటు పుట్టిస్తున్న జబర్దస్త్ బ్యూటీ నయా లుక్!

First Published Sep 8, 2022, 3:14 PM IST


జబర్దస్త్ వర్ష సరికొత్త లుక్ కిక్ ఇస్తుంది. వైట్ స్లీవ్ లెస్ టాప్, ప్యాంట్స్ ధరించిన ఈ బుల్లితెర భామ గ్లామర్ షోతో ఆకట్టుకుంది. వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 
 


వర్ష సోషల్ మీడియా పోస్ట్స్ కాక రేపుతున్నాయి. ఆమె వరుస ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని గిలిగింతలు పెడుతుంది. వర్ష అందాలను ఆస్వాదిస్తూ వారు పండగ చేసుకుంటారు. సెలెబ్రిటీలు తమ పాపులారిటీ పెంచుకోవడానికి సోషల్ మీడియాను సాధనంగా ఉపయోగిస్తున్నారు. వర్ష సైతం అదే చేస్తున్నారు. 
 

ఇక బుల్లితెరపై వర్ష ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారారు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో ఆమె సందడి చేస్తున్నారు. సదరు ఈవెంట్స్ లో వర్ష ప్రత్యేక ఆకర్షణ. టైమింగ్ పంచెస్ కి కామెడీ స్కిట్స్ కి వర్ష బాగా సెట్ అవుతున్నారు. రెండేళ్లుగా బుల్లితెర షోస్ ద్వారా వర్ష పాపులారిటీ రాబట్టారు. 
 

సీరియల్ నటిగా ఏళ్ల తరబడి నటించినా వర్షకు కనీస గుర్తింపు రాలేదు. జబర్దస్త్ కి రావాలన్న ఆమె నిర్ణయం ఫేట్ మార్చేసింది. జబర్దస్త్ షో వలన ఫేమస్ తెచ్చుకున్న ఆర్టిస్ట్స్ లో వర్ష కూడా ఒకరు. జబర్దస్త్ ఆమెకు కెరీర్ ఇవ్వడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మార్గం వేసింది. 
 

వర్ష అంత త్వరగా పాప్యులర్ కావడం వెనుక మరొక రీజన్ ఇమ్మానియేల్. అతనితో ఆమె రొమాన్స్, లవ్ ట్రాక్స్ ఫేమ్ తెచ్చిపెట్టాయి. ఏదో శాంపిల్ గా మొదలైన వీరి లవ్ ట్రాక్ సీరియస్ టర్న్ తీసుకుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని గమనించిన మేకర్స్ వీరి కాంబినేషన్ లో స్కిట్స్, స్పెషల్ లవ్ ట్రాక్స్ రూపొందించడం స్టార్ట్ చేశారు.

ఇక వర్ష ఈ విషయంలో జీవించేస్తుంది. ఇమ్మానియేల్ అంటే చచ్చేంత ప్రేమ అన్నట్లు డైలాగ్స్ కొడుతుంది. అసలు ఇమ్మానియేల్ లేకపోతే బ్రతకలేను అన్నట్లు బిల్డప్ ఇస్తుంది. లైఫ్ లో దొరికిన ఒకే ఒక అదృష్టం ఇమ్మానియేల్ అని చెప్పుకొస్తుంది. చాలా సందర్భాల్లో ఇది జరిగింది. 
 

Jabardasth Varsha

రష్మీ-సుధీర్ ల తర్వాత ఆ రేంజ్ లో పాపులరైన ప్రేమ జంట వర్ష-ఇమ్మానియేల్. ఈ ఇద్దరికీ ఉత్తిత్తి పెళ్లి కూడా జరిగిపోయింది. వీరికి అవకాశాలు విరివిగా రావడం వెనుక కారణం కూడా అదే. అయితే ఇదంతా ఎంటర్టైన్మెంట్ కోసమే. నిజానికి వర్ష-ఇమ్మానియేల్ మధ్య ఏం లేదు. వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఏది ఏమైనా వర్ష బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ తెచ్చుకొని దూసుకుపోతున్నారు. 
 

click me!