లెహంగాలో ‘జబర్దస్త్’ వర్ష మతులు పోగొట్టే అందాలు.. కొంటె పోజులతో కుర్ర భామ కవ్వింపు చూశారా!

First Published Dec 21, 2022, 3:36 PM IST

యంగ్ బ్యూటీ, ‘జబర్దస్త్’ ఫేమ్ వర్ష (Varsha) అదిరిపోయే అందాల ప్రదర్శిస్తూ ఇంటర్నెట్ లో రచ్చరచ్చ చేస్తోంది. క్రేజీ ఫొటోషూట్లతో నెటిజన్లను తనవైపునకు తిప్పుకుంటోంది. లేటెస్ట్ గా వర్ష పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

‘జబర్దస్త్’ (Jabardasth) వర్ష అందాల ధాటికి కుర్రకారు చిత్తైపోతున్నారు. యంగ్ బ్యూటీ మతులుపోయే ఫొటోషూట్లకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. రోజురోజుకు డోస్ పెంచుతున్న వర్ష.. అదే స్థాయిలో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను దక్కించుకుంటోంది.
 

‘జబర్దస్త్’తో బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది వర్ష.  కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కు జోడీగా కామెడీ స్కిట్లతో టీవీ ఆడియెన్స్ ను అలరించింది. మరోవైపు వీరి జంటకూ స్మాల్ స్క్రీన్ పై మంచి క్రేజ్ దక్కడం విశేషం. 
 

మరోవైపు వర్ష బుల్లితెరపైనా ఆయా ఈవెంట్లలోనూ అందాలను ఒళకబోస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. డాన్స్, స్కిట్లతో అలరిస్తూ వస్తున్న వర్ష.. కొద్దిరోజులుగా నెట్టింట గ్లామర్ విందుతోనూ తన ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తోంది.

ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట తెగ రచ్చ చేస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్ల కోసం తన ఫ్యాషన్ సెన్స్ కు పదును పెడుతూ అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తోంది. వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.
 

ట్రెడిషనల్ వేర్ అయినా.. ట్రెండీ వేర్ అయినా అందాల విందుతో అదరగొడుతోంది. కొద్దికొద్దిగా హద్దులు మీరుతోంది. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కు హాజరైన వర్ష.. లెహంగాలో దర్శనమిచ్చింది. పరువాల ధాటితో కుర్ర గుండెల్ని పెల్చేసింది.

స్టేజీపై యంగ్ బ్యూటీ కొంటె పోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్లీవ్ లెస్ అందాలతో మతులు పోగొట్టింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. మొత్తంగా నెట్టింట మరింత ఫాలోయింగ్ ను సాధించేందుకు ఇలా అందాల రచ్చ చేస్తోంది.
 

బుల్లితెరపై మరింతగా మెప్పించి.. వెండితెరపైనా మెరవాలనే లక్ష్యంతో వర్ష ముందుకు సాగుతోంది. ఇప్పటికే రష్మీ గౌతమ్, అనసూయ, విష్ణుప్రియ, వర్షిణి యాంకర్లుగా బుల్లితెరపై సందడి చేసి యాక్ట్రెస్ గా వెండితెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. 
 

సరిగ్గా ప్రయత్నిస్తే వర్ష కూడా ఈ వరుసలోనే చేరిపోనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా వర్ష పోస్ట్ చేస్తున్న ఫొటలపై క్రేజీగా కామెంట్లు పెడుతూ, లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు యంగ్ బ్యూటీ అందాలను పొడుగుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

click me!