Shruti Haasan: ఫాదర్‌ వయసున్న వారితో రొమాన్స్ అవసరమా?.. ట్రోలర్స్ కి స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన శృతి హాసన్‌..

Published : Jan 03, 2023, 12:45 PM ISTUpdated : Jan 03, 2023, 01:10 PM IST

శృతి హాసన్‌ తెలుగులో చిరు, బాలయ్యతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు సీనియర్‌ హీరోలతో నటించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై శృతి స్పందించింది.   

PREV
16
Shruti Haasan: ఫాదర్‌ వయసున్న వారితో రొమాన్స్ అవసరమా?.. ట్రోలర్స్ కి స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన శృతి హాసన్‌..

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్‌ ఆ ఇమేజ్‌ నుంచి బయటకొచ్చి తానేంటో నిరూపించుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్‌ డాటర్‌ అనే నిబంధనలు లేకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ వస్తుంది. కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. గ్లామర్‌ కి కూడా ఎప్పుడో గేట్లు ఎత్తేసింది. 
 

26

కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే గ్యాపిచ్చింది. మళ్లీ రీఎంట్రీతో దూసుకుపోతుంది. `క్రాక్‌`తో కమ్‌ బ్యాక్‌ అయిన శృతి హాసన్‌ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగులో ఆమె ప్రస్తుతం చిరంజీవి `వాల్తేరు వీరయ్య`, బాలకృష్ణ `వీరసింహారెడ్డి` చిత్రాలున్నాయి. దీంతోపాటు ప్రభాస్‌తో `సలార్‌` చిత్రంలో నటిస్తుంది. 
 

36

వీటిలో చిరంజీవి `వాల్తేర్‌ వీరయ్య`, బాలయ్య `వీర సింహారెడ్డి` చిత్రాలు ఈ సంక్రాంతికి ఒక్క రోజు గ్యాప్‌తో విడుదలవుతున్నాయి. సంక్రాంతికి రెండు సినిమాలతో సందడి చేయబోతుంది శృతి. ఈ రెండు చిత్రాల్లో ఇద్దరు అగ్ర హీరోలతో శృతి హాసన్‌ రొమాన్స్ చేస్తున్న విసయం తెలిసిందే. ఇద్దరు సీనియర్లతోనూ ఆడిపాడుతూ రచ్చ చేస్తుంది. పాటల్లో ఈ బ్యూటీ వేసే స్టెప్పులు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో వైరల్‌ అవుతున్నాయి. సరికొత్త చర్చకి తెరలేపుతున్నాయి. 
 

46

ప్రధానంగా శృతి హాసన్‌ ఇద్దరు సీనియర్ హీరోలతో నటించడం పట్ల కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శృతిని ట్రోల్‌ చేస్తున్నారు. ఫాదర్‌ వయసున్న హీరోలతో ఈ రొమాన్స్ అవసరమా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. డబ్బు కోసమేనా అంటున్నారు. వేరే హీరోలతో ఆఫర్లు రావడం లేదా? సీనియర్లతో చేస్తున్నావని ప్రశ్నిస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. 
 

56

దీంతో దీనిపై తాజాగా శృతి హాసన్‌ స్పందించింది. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీలో వయసు మ్యాటర్‌ కాదని చెప్పింది. ఏజ్‌ అనేది కేవలం నెంబర్‌మాత్రమే అని తెలిపింది. టాలెంట్‌, ఎనర్జీ ఉంటే చనిపోయేంత వరకు నటిస్తూనే ఉండొచ్చని చెప్పింది శృతి. గతంలో చాలా మంది హీరోలు తనకంటే సగం వయసున్న హీరోయిన్లతో నటించారని, అది అసలు మ్యాటరే కాదని, తాను దానికి అతీతం కాదని తెలిపింది శృతి. దీంతో ఆమె అభిమానులు, కొందరు నెటిజన్లు శృతికి మద్దతు పలుకుతున్నారు. 

66

ట్రోల్స్  పక్కన పెడితే ఈ సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో సందడంగా శృతి హాసన్‌ దే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు కావడంతో అందరి అటెన్షన్‌ వీటిపైనే ఉంటుంది. పైగా ఈ రెండింటిలోనూ శృతి హీరోయిన్‌ కావడంతో ఇద్దరు హీరోల అభిమానులు శృతికి మద్దతుగా ఉంటారు. దీంతో కమల్‌ తనయ రచ్చ మామూలుగా ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories