శివాజీకి రహస్య కూతురు? ఫోటో చూపిస్తూ గుట్టేమిటో విప్పిన ఆలీ... అసలు నిజం ఇదా!

First Published Mar 21, 2024, 7:17 AM IST

బిగ్ బాస్ శివాజీకి కూతురు ఉందంటూ ఆ మధ్య నటుడు సమీర్ అన్నాడు. ఇదే విషయాన్ని శివాజీని ఆలీ నేరుగా అడిగాడు. ఓ పాప ఫోటో చూపించి తనేనా నీ కూతురు అన్నాడు. అవునని శివాజీ ఒప్పుకున్నాడు... 
 

Sivaji

నటుడిగా బ్రేక్ ఇచ్చిన శివాజీ పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచాడు. సడన్ గా బిగ్ బాస్ షోలో ప్రత్యక్షం అయ్యాడు. గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న శివాజీ 3వ స్థానంలో నిలిచాడు. ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యాడు. నైంటీస్ సిరీస్ తో నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.

బిగ్ బాస్ షో కారణంగా శివాజీ ఫ్యామిలీ జనాలకు పరిచయం అయ్యింది. భార్య శ్వేత, కొడుకులు కెన్నీ, రిక్కీ బిగ్ బాస్ షోలో దర్శనం ఇచ్చారు. ఫ్యామిలీ వీక్ లో పెద్దబ్బాయి కెన్నీ హౌస్లోకి వచ్చాడు. అలాగే శ్వేత, రిక్కీ కూడా ఒకటి రెండు సందర్భాల్లో షోలో మాట్లాడారు. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

ఈ క్రమంలో శివాజీకి ఇద్దరు అబ్బాయిలు అన్న విషయం అందరికీ తెలిసింది. అయితే శివాజీకి కూతురు కూడా ఉందని ఆ మధ్య నటుడు సమీర్ అన్నాడు. దాంతో మనకు తెలియని కూతురు ఎవరు? ఆయనకు మరో భార్య ఉందా? ఆమెకు కూతురు ఉందా? అంటూ పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి.

Sivaji

ఆలీతో సరదాగా సెకండ్ సీజన్ స్టార్ట్ చేశాడు నటుడు ఆలీ. ఈ షోకి గెస్ట్ గా శివాజీ వచ్చాడు. శివాజీని పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు ఆలీ. ఈ క్రమంలో ఓ పాప ఫోటో స్క్రీన్ పై వేసి చూపించాడు. ఈ పాప మీ అమ్మాయా? అని అడగ్గా అవును మా అమ్మాయే అన్నాడు. 

Sivaji

నాకు ఇద్దరు అబ్బాయిలు మాత్రమే సంతానం. అది కెన్నీ, రిక్కీ. అమ్మాయిలు లేరు. నేను ఎక్కడా విత్తనాలు చల్లలేదు. అలాగే మా కుటుంబంలో అందరికీ అబ్బాయిలే. మా తమ్ముడికి కూడా ఇద్దరు అబ్బాయిలు. అంతెందుకు మా ఇంట్లో జంతువులకు కూడా మగ బిడ్డలే పుడతాయి. 

ఆ ఫొటోలో ఉంది నా చిన్న కొడుకు రిక్కీ. వాడికి అమ్మాయి గెటప్ వేశాము. బహుశా ఈ ఫోటో చూసే సమీర్ నాకు కూతురు ఉందని పొరపాటు పడి ఉండొచ్చు... అని శివాజీ అన్నాడు. కాబట్టి శివాజీకి అమ్మాయిలు లేరు. అమ్మాయి అంటూ ప్రచారం అవుతున్న ఫోటో కొడుకు లేడీ గెటప్ అని క్లారిటీ వచ్చింది. 

click me!