హీరోయిన్లు ఫోన్‌ చేసి మాట్లాడితే బెడ్‌ మీద పడుకున్నట్టేనా?.. ఫోన్‌ ట్యాపింగ్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

First Published Mar 29, 2024, 9:49 PM IST

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంతోపాటు చిత్ర పరిశ్రమని ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో నిర్మాత చిట్టిబాబు దీనిపై స్పందించి సంచలన వ్యాక్యలు చేశారు. 
 

Revanth reddy

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సినిమా సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి. ఓ స్టార్‌ జంట విడిపోయిందని, మరో స్టార్‌ హీరోయిన్‌ తోపాటు ఏకంగా ఆరుగురు సెలబ్రిటీలు(హీరోయిన్లు) ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇరుక్కున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ పోలీసుల విచారణలో తెలిపిన వివరాల ప్రకారం సినిమా వాళ్ల పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. టీఆర్‌ఎస్‌ నాయకులే టార్గెట్గా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తుందనే తెలుస్తుంది.   

ఇదిలా ఉంటే నాగచైతన్య, సమంత విడిపోవడానికి ఫోన్‌ ట్యాపింగే ప్రధాన కారణం అని తెలుస్తుందని ఇటీవల తీన్‌ మార్‌ మల్లన్న కామెంట్‌ చేశాడు. ఈ వార్తలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై మరో నిర్మాత చిట్టిబాబు స్పందించారు. క్యూబ్‌ టీవీతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

ఇది కాంగ్రెస్‌ చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కావాలని సినిమా పరిశ్రమని టార్గెట్ చేస్తుందని నిర్మాత చిట్టిబాబు ఆరోపించారు. హీరోహీరోయిన్లపై పడటం మొదట్నుంచి కాంగ్రెస్‌ పార్టీకి అలవాటు అని, ఒకప్పుడు చెన్నారెడ్డి టైమ్‌లో వాణి శ్రీ విషయం మీద, అప్పట్లో జయసుధ మీద ఇలాంటివే ఇష్యూచేశారు. ఇలా హీరోయిన్లని ఇలాంటి అశ్లీల విషయాల్లోకి లాగడం వంటి దౌర్భాగ్య పనులు చేస్తారని ఆరోపించారు.
 

KTR vs REVANTH REDDY

  ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది ప్రతి ప్రభుత్వం చేస్తుందని, రాష్ట్ర సెక్యూరిటీ బేస్డ్ గా ఇలాంటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తుందని, ఏదైనా కుట్ర జరుగుతుందా, ఏదైనా అల్లర్లు చోటు చేసుకోబోతున్నాయా అనేది తెలుసుకునేందుకు, వాటిని ముందే కనిపెట్టేందుకు ఇలాంటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తుందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పడం గమనార్హం. 

ఈ సందర్భంగా సమంత, రకుల్‌ విషయాలను ప్రస్తావించారు ఆయన. సమంతకి ఏదైనా సమస్య వచ్చి ఉండొచ్చు,  ప్రభుత్వాన్ని ఆమె అడిగి ఉండొచ్చు, అలాగే అప్పట్లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌పై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఉండొచ్చు. ఇలా కాంటాక్ట్ అయి ఉంటేనే బెడ్‌ మీద పడుకున్నట్టా అంటూ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్లు ఏమైనా లైట్ వేసి ఇలా జరుగుతుందని చూశారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఆడపిల్లలు ఫోన్‌ చేస్తే, రూమ్‌లోకి వస్తే పడుకున్నట్టే లెక్కనా అని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇవన్నీ చిల్లర ఆలోచనలు అని, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజం లేదని ఆయన వెల్లడించారు. 
 

నిజానికి ఏదైనా తప్పు జరిగితే, ఏం మాట్లాడారో చెప్పాలి, అవి బయటపెట్టాలి. సమంత, నాగచైతన్య విడిపోయినప్పుడు ఇద్దరూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఎందుకు విడిపోయారో ఇద్దరూ చెప్పారు. అంత క్లారిటీగా ప్రకటించి విడిపోయినప్పుడు దాంట్లో వీరు జోక్యం చేసుకోవడం ఏంటన్నారు నిర్మాత. అల్ఫుడు అధికారంలోకి వస్తే ఎలాంటి దౌర్భాగ్యపు పనులు చేస్తారనేది సీఎం రేవంత్‌ రెడ్డి నిరూపిస్తున్నారన్నారు. 

ఫోన్‌ ట్యాపింగ్‌ వల్ల ఆ నాయకుడు ఆ ఇద్దరు హీరోయిన్లని తన బెడ్‌ రూమ్‌కి పిలిపించుకున్నాడనుకో, దీనికి సంబంధించిన ఆధారాలుంటే బయటపెట్టండి అని, ఇలాంటి గాలి వార్తలను, రూమర్లని స్ప్రెడ్‌ చేయకూడదన్నారు. మీ రాజకీయం కోసం వారి జీవితాలతో ఆడుకోవద్దన్నారు. సమంత ఏదో కష్టాల్లో ఉందని, ఆరోగ్యం బాగలేదని ఆమె సినిమాలకు రెస్ట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ మీ రాజకీయాల కోసం వారిని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. పేరున్న హీరోయిన్లని లాగితేనే అది హాట్‌ టాపిక్ అవుతుందనేది కాంగ్రెస్‌ పార్టీ కుట్ర అని నిర్మాత చిట్టిబాబు ఆరోపించారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

click me!