
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో శుక్రవారం నాడు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం ను దర్శకులు రామ్‌గోపాల్ వర్మ ఆహ్వానించారు. ఈ వార్త ఇప్పుడు అంతటా అన్ని మీడియాల్లో వచ్చింది. అయితే ఇందులోనూ ఆయన వ్యతిరేకులు వేరే కోణాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు.
వాళ్ల వెర్షన్ ఏమిటంటే... రామ్ గోపాల్ వర్మకి ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న టెన్షన్ పెరిగిపోయిందని అందుకే ఇప్పుడు పది మంది మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కాకా పట్టే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే అందులో నిజమెంత అనేది ఎవరికి వాళ్లు ఊహించుకోవాల్సిందే. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించబోతున్న సమయంలోనే రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు.
ఎంతో జ్ఞానం ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేశారని ఆయన అన్నారు. రేవంత్ గురించి, ఆయన శక్తి గురించి, ఆయన ఆలోచనల్లో పదును గురించి తెలిసిన వ్యక్తిగా చెపుతున్నా... ఆల్ టైమ్ బెస్ట్ సీఎంగా రేవంత్ అవుతారని చెప్పడంలో తనకు ఎలాంటి సందేహం లేదని అన్నారు. నో డౌట్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అంటే అప్పుడే ఎలక్షన్ తర్వాత ఫలితాలు ఆయన ఊహించినట్లా...అనేది కొందరు ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి తన సోషల్ మీడియా అకౌంట్ నుండి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం మావేశారు వర్మ. దర్శకుడుగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం', 'శపథం' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు ఈ మధ్యనే ఎలక్షన్స్ ముందు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. వీడియోలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాక్సింగ్ రింగ్ లోకి దిగిన వాళ్లు అవతలివాడిని గట్టిగా గుద్దాలని... నీ వెంట్రుకలు పీకుతా, బుగ్గ గిల్లుతా అని అంటే కుదరదని చెప్పారు. తన రెండు చిత్రాల్లో వాస్తవాలను గుడ్డలు విప్పి, నగ్నంగా చూపించానని అన్నారు.
టీడీపీ, జనసేన వాళ్లు ఈ చిత్రాలను చూస్తారా అని కొందరు అడుగుతున్నారని... తాను పోర్న్ చూసే విధంగా... ఈ సినిమాను వాళ్లు బాత్రూమ్ లలో చూస్తారని చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా న్యూట్రల్ గా ఉండేవాళ్లు పబ్లిక్ గా అందరితో పాటు లివింగ్ రూమ్ లో చూడొచ్చని అన్నారు.