శ్రద్ధా దాస్‌ని ముద్దడిగిన హైపర్‌ ఆది.. స్టేజ్‌పైనే అందరి ముందు చెంపలు వాయించిన హీరోయిన్‌.. షో మొత్తం రచ్చ

First Published Oct 6, 2022, 10:48 AM IST

`జబర్దస్త్` కమెడియన్‌ చేసే కామెడీ నవ్వులు పూయిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పంచ్‌లకే కేరాఫ్‌గా నిలుస్తుంది. లేడీ కమెడియన్లతో ఆయన చేసే ఓవరాక్షన్‌ కొన్నిసార్లు బెడిసికొడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. 

హైపర్‌ ఆది(Hyper Aadi) `జబర్దస్త్` షోతోపాటు `ఢీ`షో |(Dhee Show)లో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలకు అత్యంత కామెడీని పంచే కమెడియన్‌గా రాణిస్తున్నారు. ముఖ్యంగా పంచ్‌ డైలాగ్‌లకు కేరాఫ్‌గా నిలిచే ఆయన కొన్నిసార్లు ఇరుకున పడ్డ సందర్భాలున్నాయి. ఆయన చేసే పంచ్‌లు అవతలివాళ్లు తీసుకోలేకపోవడం వల్ల రచ్చ జరుగుతుండటం విశేషం. 
 

తాజాగా హైపర్‌ ఆది `ఢీ`షోలో నవ్వులు పూయిస్తున్నాడు. అయితే లేటెస్ట్ ఎపిసోడ్‌లో మాత్రం  ఆయనకు గట్టి షాక్‌ తగిలింది. హీరోయిన్, `ఢీ` జడ్జ్ శ్రద్ధా దాస్‌(Shraddha Das) దిమ్మదిగిరే షాక్‌ ఇచ్చింది. అందరి ముందు హైపర్‌ ఆది చెంపలు వాయించడం విశేషం. 

ఇంతకి ఏం జరిగింది. `ఢీ` షోలో డాన్సర్ల అద్బుతమైన డాన్సుతోపాటు మధ్య మధ్యలో హైపర్‌ ఆది, యాంకర్‌ ప్రదీప్‌, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ అఖిల్‌ కామెడీ స్కిట్లతో నవ్వులు  పూయిస్తుంటారు. అలాగే లెటెస్ట్ ఎపిసోడ్‌లో జరిగింది. డాన్సర్ల డాన్సు మధ్యలో హైపర్‌ ఆది, శ్రద్ధా దాస్‌, యాంకర్‌ ప్రదీప్‌ కామెడీ చేశారు. 
 

ఇందులో శ్రద్ధాదాస్‌ని ముద్దు అడిగాడు హైపర్‌ ఆది. అయితే అది శ్రద్ధా భాషలో అడిగే ప్రయత్నం చేశాడు. దీనికి యాంకర్‌ కాస్త పోప్‌ వేయగా, శ్రద్ధా ముద్దు కోసం వెయిట్‌ చేస్తున్నాడు. స్టేజ్‌పైనే అందరి ముందు షాకిచ్చింది శ్రద్ధా దాస్‌. హైపర్‌ ఆది చెంపలు వాయించింది. ఊహించని పరిణామంతో హైపర్‌ ఆది షాక్‌ అయ్యాడు. ముద్దు  పెడుతుందని భావించిన శ్రద్ధా ఇలా చెంపలు వాయించడంతో ఆదికి దిమ్మతిరిగిపోయింది. 
 

దాన్నుంచి తేరుకుని ధైర్యం చేసి ఆమెని మరోసారి ముద్దు అడిగాడు హైపర్‌ ఆది. ఈ సారి మరింత డేర్‌గా శ్రద్ధా ముద్దుకోసం వెయిట్‌ చేస్తున్నాడు ఆది. మళ్లీ ఆయనకు మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా చేసింది. ఆది చెస్ట్ పై గట్టిగా వరుసగా పంచ్‌లిచ్చింది. దీంతో తల్లడిల్లిపోయాడు ఆది. అయితే ఇదంతా కామెడీ కోసం సరదాగా చేసిన స్కిట్‌ అనే విషయం  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

`ఢీ`వచ్చే ఎపిసోడ్‌ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇందులో కంటెస్టెంట్ల డాన్సులు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్ల డాన్సు ప్రదర్శన గూస్‌బంమ్స్ తెప్పించింది. 

click me!