జబర్దస్త్ కొత్త యాంకర్ కి హైపర్ ఆది వేధింపులు... ముద్దు కావాలంటూ పైకెళ్లడంతో 'ఛీపోరా' అంటూ తోసేసిన సౌమ్య రావు!

First Published Nov 27, 2022, 6:53 PM IST

సౌమ్య రావుకు అప్పుడే హైపర్ ఆది సెగ మొదలైంది. ఫస్ట్ ఎపిసోడ్లోనే భయపెట్టిన హైపర్ ఆది, అది కొనసాగిస్తున్నాడు. భాష కూడా పెద్దగా రాని ఈ కన్నడ యాంకర్ నానా ఇబ్బందులు పడుతుంది.

జబర్దస్త్ లో యాంకర్స్ పై పంచ్ల సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. హైపర్ ఆది వచ్చాక ఈ ట్రెండ్ ఎక్కువైంది. తమ స్కిట్స్ లో యాంకర్స్ ని భాగం చేసుకోవడం వాళ్ల మీద కూడా పంచెస్ వేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ కామెడీ హద్దులు దాటేస్తుంది కూడా. జబర్దస్త్ మానేసిన తర్వాత అనసూయ ఈ ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. కమెడియన్స్ నన్ను బాడీ షేమింగ్ కి గురి చేశారని అనసూయ ఆరోపించారు. జబర్దస్త్ మానేయడానికి అది కూడా ఒక కారణం అన్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చాడు. 
 

అనసూయపై హైపర్ ఆది ఓ రేంజ్ లో పంచెస్ వేసేవాడు. ముద్దు మురిపాలు ఆడేవాడు. ఒక దశలో అనసూయను ఆది ప్రతి స్కిట్ లో భాగం చేశాడు. ఆమె కూడా కోపరేట్ చేసినట్లుగానే కనిపించేది. ఆరోపణలు చేశాక కానీ అర్థం కాలేదు. ఆమె ఇబ్బంది పడుతూనే అవి భరించారని. కాగా ఆమె ప్లేస్ లో వచ్చిన సౌమ్య రావుకి కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. 
 


సౌమ్య రావుకు అప్పుడే హైపర్ ఆది సెగ మొదలైంది. ఫస్ట్ ఎపిసోడ్లోనే భయపెట్టిన హైపర్ ఆది, అది కొనసాగిస్తున్నాడు. భాష కూడా పెద్దగా రాని ఈ కన్నడ యాంకర్ నానా ఇబ్బందులు పడుతుంది. 
 


తాజాగా ముద్దు అడుగు అంటూ.. మీదకు వెళ్ళాడు. ఆమె ఛీపోరా అంటూ నెట్టిపడేసింది. నెక్స్ట్ గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఇది చోటు చేసుకుంది. కామెడీ పేరుతో యాంకర్ ని హైపర్ ఆది ఇబ్బందిపెడుతున్నాడని క్లియర్ గా అర్థం అవుతుంది. సౌమ్య రావుని బలవంతంగా తన స్కిట్స్ లో నటింపజేస్తూ కంగారు పెడుతున్నాడు. 
 


హైపర్ ఆది చర్యలు సౌమ్య రావుపై ఒత్తిడి పెంచేస్తున్నాయనిపిస్తున్నాయి. మరోవైపు ఆమె యాంకర్ గా నిరూపించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జబర్దస్త్ యాంకర్ గా అవకాశం రావడం ఎంత మంచో అంతే చెడు కూడాను. అనసూయ ఆ స్థానానికి ఓ బెంచ్ మార్క్ సెట్ చేసిపోయింది. ప్రతి జబర్దస్త్ ఆడియన్స్ ఆమెతో పోల్చుకుంటాడు. కాబట్టి అనసూయ కంటే బెటర్ అనిపించకపోయినా... కనీసం పోటీ ఇవ్వగలగాలి. 


ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో సీనియర్ గా రష్మీ గౌతమ్ దూసుకుపోతుంది. సౌమ్య రావు వచ్చే వరకు రష్మీ జబర్దస్త్ యాంకర్ గా చేశారు. కాగా జబర్దస్త్ వదిలిపోయిన స్టార్ కమెడియన్స్ ఒక్కొక్కరిగా తిరిగొస్తున్నారు. గెటప్ శ్రీను, హైపర్ ఆది కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని రీఎంట్రీ ఇచ్చారు. సుడిగాలి సుధీర్ రాక కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

click me!